గుండె అనారోగ్యాన్ని ముందుగానే తెలుసుకోవ‌డం ఎలా?

ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా ముఖ్య ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు అంతేనా ఉంది. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది వ్యాయామం చేయాలని కొంత సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాను. అయితే వ్యాయామం చేయకపోవడం అనేది గుండెకు సంబంధించిన వ్యాధులను అధికం చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ ఎవరైనా చేయగలిగే సాధారణ వ్యాయామాలు చేయగలిగితే తమ గుండె ఆరోగ్యాన్ని అధికంగా చూసుకోవడం అవుతుంది. ఈరోజు కొన్ని […]

Share:

ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా ముఖ్య ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు అంతేనా ఉంది. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది వ్యాయామం చేయాలని కొంత సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాను. అయితే వ్యాయామం చేయకపోవడం అనేది గుండెకు సంబంధించిన వ్యాధులను అధికం చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ ఎవరైనా చేయగలిగే సాధారణ వ్యాయామాలు చేయగలిగితే తమ గుండె ఆరోగ్యాన్ని అధికంగా చూసుకోవడం అవుతుంది. ఈరోజు కొన్ని ఎక్ససైజులతో పాటు, గుండెకు సంబంధించి ఎటువంటి సంకేతాలు మనం గమనించుకుంటూ ఉండాలి.. చూద్దాం.. 

చెస్ట్ పెయిన్: 

ముఖ్యంగా గుండెకు సంబంధించి ఎటువంటి ప్రమాదమైన సరే, ఎటువంటి అనారోగ్యం ఉన్న సరే, ఒక్కోసారి చాతిలో నొప్పి అనేది మొదలవుతుంది. పట్టేసినట్టు, మంటగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా విపరీతమైన, చెప్పలేనంత చాతి నొప్పి కలుగుతుంది. 

ఊపిరందకపోవడం: 

ఒకోసారి ఊపిరి అందకపోవడం వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువసార్లు ఇలా జరుగుతున్నట్లు అనుమానిస్తే వెంటనే మంచి డాక్టర్ ని  సంప్రదించడం మంచిది. 

నీరసంగా ఉండడం: 

గుండెకు సంబంధించి అనారోగ్యం ఉన్నవారిలో ఎక్కువగా నీరసంగా అనిపించడం, మన రోజువారి పనులను చేసుకోలేకపోవడం అలాంటివి జరుగుతుంది. 

గుండె ఆగిపోయినట్లు అప్పుడప్పుడు అనిపించడం: 

గుండెకు సంబంధించిన అనారోగ్యం కారణంగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపించినప్పుడు, ఇది తీవ్రమైన సమస్యగా గుర్తించాల్సిన అవసరం ఉంది, అంతే కాకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. 

వాపు కనిపించడం: 

హార్ట్ ఫెయిల్యూర్ కి సంబంధించి కొన్ని సాంకేతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. పాదాలు, కాళ్లు, పొత్తికడుపు ఇలా పలుచోట్ల నీరు పట్టడం, వాపు కనిపించడం జరుగుతుంది. 

కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం: 

గుండెకు సంబంధించి ఎటువంటి వ్యాధి ఉన్న, మన శరీరం మొత్తంలో తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా తల బరువుగా అనిపించడం, కళ్ళు తిరుగుతున్నట్లు, ఒళ్ళు తూలుతున్నట్లు అనిపించడం కనిపిస్తుంది. 

చెమటలు పట్టడం: 

సాధారణంగా చెమటలు పట్టడాన్ని పక్కన పెడితే, గుండెకు సంబంధించి ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే, కొంతమందిలో ముఖ్యంగా అధికంగా చెమటలుపడుతూ ఉంటాయి. చల్లని ప్రదేశంలో ఉంటున్నప్పటికీ తెలియకుండానే చెమటలు పడుతూ ఉంటాయి. 

వాంతులు: 

ముఖ్యంగా ఆడవారిలో ఇటువంటి సమస్య కనిపిస్తుంది. ఎక్కువగా గుండెపోటు వచ్చే సమయంలో అధికంగా వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుండెకు సంబంధించి ఎటువంటి అనారోగ్యం ఉన్న అది మన డైజేషన్ మీద కూడా ప్రభావం పడుతుంది. 

శరీర పైభాగంలో అసౌకర్యం: 

ఇది కూడా ముఖ్యంగా ఆడవారిలో కనిపిస్తూ ఉంటే సమస్య. ఎవరిలో ఏదైనా గుండెకు సంబంధించి అనారోగ్యం ఉన్నట్లయితే, పొట్ట భాగం నుంచి పైన భుజాలలో, దవడలో, చేతులలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. 

అధిక బరువు పెరగడం: 

చాలామందిలో తెలియకుండానే ఏమి తినకపోతున్నప్పటికీ అధికంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. . గుండెకు సంబంధించిన అనారోగ్యం ఉన్న వారిలో ఎక్కువ శాతం నీరు నిలువలు పెరిగిపోతాయి. ముఖ్యంగా శరీరం అంతటా కూడా నీరు పట్టడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. 

కాబట్టి ఇటువంటి సంకేతాలు మనకు కనిపించినప్పుడు వెంటనే మంచి వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఏరోబిక్ వ్యాయామం: 

నిజానికి ఒత్తిడి లేకుండా చేసే ఒక రకమైన వ్యాయామం. ఇటువంటివి వ్యాయమం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, దీని ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది, స్టీవర్ట్ చెప్పారు. అంతేకాకుండా, ఇది మీ ఏరోబిక్ ఫిట్‌నెస్‌ని పెంచుతుంది. ఏరోబిక్ వ్యాయామం కూడా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు మీరు ఇప్పటికే మధుమేహంతో జీవిస్తున్నట్లయితే, మీ రక్తంలో గ్లూకోజ్‌ని నియంత్రించడంలో ఈ ఆరోబిక్ వ్యాయామం అనేది చాలా బాగా సహాయపడుతుంది. 

కార్డియో ఎక్సర్సైజ్: 

చాలామంది ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంత మంచి పద్ధతితో అందరికీ తెలుసు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ నిలువలు తగ్గేందుకు ఎక్ససైజ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్డియో ఎక్సర్సైజ్ అనేది ముఖ్యంగా గుండెను పదిలంగా ఉంచేందుకు చేసే ఎక్ససైజ్.