కిడ్నీలు వీక్​గా ఉంటే ఇలాగే జరుగుతుంది సుమీ

మానవశరీరంలో కిడ్నీలు(మూత్రపిండాలు) ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. మనం రోజు మొత్తంలో తినే ఆహారాన్ని కిడ్నీలే క్లీన్ చేయాలి. మన శరీరంలోని మలినాలను వడబోసి రక్తాన్ని శుభ్రం చేసేవి ఇవే కనుక వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే మనకు ఏదో కిడ్నీ సమస్య వచ్చిందని తెలుసుకోవాలి. వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి అందుకు సంబంధించి చికిత్స చేయించుకోవాలి. దీర్ఘకాలిక సమస్య ఉందనుకో… కొంత మంది దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ […]

Share:

మానవశరీరంలో కిడ్నీలు(మూత్రపిండాలు) ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. మనం రోజు మొత్తంలో తినే ఆహారాన్ని కిడ్నీలే క్లీన్ చేయాలి. మన శరీరంలోని మలినాలను వడబోసి రక్తాన్ని శుభ్రం చేసేవి ఇవే కనుక వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే మనకు ఏదో కిడ్నీ సమస్య వచ్చిందని తెలుసుకోవాలి. వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి అందుకు సంబంధించి చికిత్స చేయించుకోవాలి.

దీర్ఘకాలిక సమస్య ఉందనుకో…

కొంత మంది దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) లేదా దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యంతో బాధపడే వారు నేటి రోజుల్లో కోకొల్లలు.  మూత్రపిండాల పనితీరు క్రమంగా కోల్పోవడం అనే దానినే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అని అంటారు. 

కారణలివే అంటున్న వైద్యులు

అసలు కిడ్నీ డిసీసెస్ రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయా? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఎందువల్ల కిడ్నీ వ్యాధులు వస్తాయని ప్రశ్నిస్తారు. ఇందుకు గల కారణాలు మధుమేహం, ఊబకాయం,ధూమపానం, వయస్సు,పాలీసిస్టిక్ వంటివి అని వైద్యులు తెలుపుతున్నారు. పైలోనెఫ్రిటిస్,కిడ్నీలకు హాని కలిగించే మందులు తీసుకోవడం కూడా  మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. కావున మనం మందులను వాడే ముందు ఏదో వాడుతున్నామా?అని వాడడం కాకుండా మనం ఎటువంటి మందులను వేసుకుంటున్నామో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకు వికారం, వాంతులు, పేలవమైన ఆకలి, బలహీనత, నిద్రలేమి, తరచుగా లేదా తక్కువ మూత్రం, కండరాల తిమ్మిరి, పాదాలు అలాగే చీలమండల వాపు, పొడి, దురద చర్మం, రక్తపోటు, ఊపిరి పీల్చుకోలేకపోవడం వంటి సంకేతాలు లేదా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడానికి, చాతీ నొప్పి వంటి సమస్యలు ఉన్నపుడు కూడా మనకు ఇవే లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD)ఇలా తగ్గించుకోండి..

మీరు కనుక దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుంటే తగ్గించుకునేందుకు ఇలా చేయండి

1.రెగ్యులర్ చెక్-అప్స్

రెగ్యులర్​గా చెకప్స్​ కోసం వెళ్లడం చాలా అవసరం. మీకు కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే, మీరు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు, ఫాలో-అప్‌లకు తప్పకుండా వెళ్లాలి.

2. మీ రక్తపోటును (బీపీ) తనిఖీ చేయండి

డాక్టర్ సూచించిన విధంగా మీ రక్తపోటును తనిఖీ చేసుకుంటూ ఉండండి. అధిక రక్తపోటు మీ మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. మీరు కిడ్నీ వ్యాధికి గురయ్యేలా చేస్తుంది. మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే మీ డాక్టర్ మీకు మందులు ఇస్తాడు. ఉప్పు తీసుకోవడం, మద్యం తగ్గించడం వంటి జీవనశైలిలో సాధారణ మార్పులు చేయడం వల్ల మీ హై బీపీని తగ్గించుకోవచ్చు.

3.రక్తంలో చక్కెర స్థాయిలు

రక్తంలో చెక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. మీకు మధుమేహం ఉంటే మీ మూత్రపిండాలను రక్షించడానికి ఉత్తమ మార్గం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. 

4. వ్యాయామం

వ్యాయామాలు మీరు ఆరోగ్యకరమైన బరువును మెయింటేన్ చేయడంలో సహాయపడతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను ఇవి నియంత్రిస్తాయి. మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

5. ధూమపానికి దూరంగా..

ధూమపానం చేయడం వలన ఊపిరితిత్తులపై మాత్రమే కాకుండా మూత్రపిండాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంది.