హలీం మాత్రమే కాదు..   హైదరాబాదులో ఈ ఏరియాల్లో నోరూరించే వంటకాలతో వీధులు కిక్కిరిసిపోతున్నాయి.. 

హలీమ్ మాత్రమే కాదు.. సీక్రెట్ వాక్స్ ఇన్ హైదరాబాద్ పై మీరు ఓ కన్నేయండి.. రంజాన్‌ స్పెషల్‌ హలీమ్‌.. ఒక్కసారి హైదరాబాద్‌ హలీమ్‌ తిన్నారంటే ఎవ్వరైనా గులామ్‌ ఆవ్వాల్సిందే..! అది అందులో మజా.. ఒకప్పుడు ముస్లింలు మాత్రమే తినే ఈ హలీం ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. రంజాన్‌ సీజన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసిన హలీమ్‌ బట్టీలు వెలిశాయి. రంజాన్‌ మాసంలో విశిష్టమైన ఆహారంగా హలీమ్‌ నిలుస్తుంది. హైదరాబాద్‌ హలీమ్‌ అంటే పడిచచ్చేవాళ్లు […]

Share:

హలీమ్ మాత్రమే కాదు.. సీక్రెట్ వాక్స్ ఇన్ హైదరాబాద్ పై మీరు ఓ కన్నేయండి..

రంజాన్‌ స్పెషల్‌ హలీమ్‌.. ఒక్కసారి హైదరాబాద్‌ హలీమ్‌ తిన్నారంటే ఎవ్వరైనా గులామ్‌ ఆవ్వాల్సిందే..! అది అందులో మజా.. ఒకప్పుడు ముస్లింలు మాత్రమే తినే ఈ హలీం ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. రంజాన్‌ సీజన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసిన హలీమ్‌ బట్టీలు వెలిశాయి. రంజాన్‌ మాసంలో విశిష్టమైన ఆహారంగా హలీమ్‌ నిలుస్తుంది. హైదరాబాద్‌ హలీమ్‌ అంటే పడిచచ్చేవాళ్లు మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఉన్నారు. రంజాన్‌ మాసంలో ప్రతీ వీధికో హాలీమ్ దుకాణం దర్శమనిచ్చేది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా చార్మినార్, ఓల్డ్ సిటీ, మలక్ పేట, కుల్సుమ్ పుర, బహదూర్ పుర ఇలా అనేక ప్రాంతాల్లో హాలీమ్ అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తున్నారు. హైద్రాబాద్‌ పిస్తా హౌస్‌ పేరుతో రాష్ట్రంలో అనేక చోట్ల హలీమ్‌ సెంటర్లు ఉన్నాయి. అన్ని వర్గాల వారు హాలీమ్ ను ఇష్టపడటంతో చాలాచోట్ల హలీమ్‌ తయారీ పెరిగాయి. పగలంతా ఉపవాసాలు ఉండే ముస్లింలు దీక్షను విరమించాక తక్షణం శక్తి కోసం హలీమ్‌ స్వీకరిస్తారు. హలీమ్ మాత్రమే కాదు హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంతా కూడా రంజాన్ స్పెషల్స్ తో నిండిపోయింది.. సాయంత్రం అంతా హైదరాబాద్ పాతబస్తీలో జనాలతో కిక్కిరిసిపోతుంది.. సీక్రెట్ వాక్స్ ఇన్ హైదరాబాద్ ఈ ఏరియాలో దొరికే హలీంతో పాటు మరికొన్ని స్పెషల్ డిషేస్ ఉన్నాయి. వాటిపై ఓ లుక్ చేద్దాం.. 

నిహరి ఇంకా కుల్చా..

బిర్యానీ హలీం తర్వాత హైదరాబాదులో చాలా ఇష్టంగా తినేది నిహరి. దీనిని మటన్, చికెన్, బీఫ్ లతో తయారు చేస్తారు.  నిహారిని సాధారణంగా కుల్చా లేదా రోటీతో కలిపి తింటారు. చార్మినార్ సమీపంలోని పలు ఏరియాలలో పాతబస్తీలో ఇరానీ స్టైల్స్ లో ఈ వంటకాన్ని రుచి చూడండి.. 

పథర్ కా గోష్.. 

వెడల్పాటి రాయిపై మటన్ ముక్కలతో దీనిని తయారు చేస్తారు.‌ మాంసం రంగు లేలేదా గోధుమ రంగులోకి వచ్చేవరకు దీనిని కాలుస్తారు. ఆ తర్వాత దానిపై ఘాటైన మసాలాలను జోడించి వేడివేడిగా వడ్డిస్తారు..

 దహీ వడ: 

 రంజాన్ నెలలో ఎక్కువ మంది తినే వంటకం దహీ వడ. ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాదులోని చాలా ప్రాంతాల్లో దహీ వడ లభిస్తుంది. పెరుగులో వడను నానబెట్టి తయారు చేస్తారు. కొత్తిమీర దానిమ్మ, ఆమ్చూర్ పౌడర్ ని కూడా కలిపి వడ్డిస్తారు.

షాహి తుక్డా: 

పాలు, బ్రెడ్ స్లైసులతో తయారు చేసే ప్రసిద్ధ వంటకం షాహి తుక్డా.  ఇది పాలు, చక్కెర , యాలకుల పొడి, బాదం, పిస్తా అన్ని వేసి మరిగిన తరువాత అందులో నేతిలో వేయించిన బ్రెడ్ స్లైసులను వేస్తారు. చూడటానికి కాస్త డబల్ కా మీఠా తరహాలో ఉండే షాహి తుక్డా రుచి అద్భుతంగా ఉంటుంది.

షీర్ ఖుర్మా: 

రంజాన్ రోజు షీర్ కుర్మా తాగనిదే అసలు పండుగ అనిపించదు రంజాన్ మాసం అంతా హలీంతో సరి సమానంగా షీర్ కుర్మా అమ్మకాలు జరుగుతాయి. చాలామంది స్వీట్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ వంటకం ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీ ఓల్డ్ సిటీ చార్మినార్, మరికొన్ని ఏరియాలలో రంజాన్ స్పెషల్ ఫుడ్ గా అందరికీ అందుబాటులో ఉంది.

హైదరాబాద్ లోని ఆ ఏరియాలన్నీసాయంత్రం అయితే చాలు ఈ వంటకాలతో పండగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. హలీం తో పాటు ఈ స్పెషల్ డిషెస్ కూడా లభించేసరికి ఎక్కువమంది రంజాన్ వంటకాలను రుచి చూడటానికి ఇష్టపడుతున్నారు.