పళ్ళపై పసుపుగార పోగొట్టి మీ పళ్ళను మిలమేలా మెరిపించే టిప్స్ ఇవే

తినే ఆహారంలో పోషకాల లోపం, నీటిలో ఫ్లోరైడ్ లాంటి కారణాల వల్ల పళ్ళు పసుపు పచ్చగా మారిపోతాయి. ఎంతలా అంటే ఒకసారి పళ్ళు పచ్చగా మారాయి, అంటే ఇక వాటిని తొలగించడం అసాధ్యం అనే చెప్పాలి.  అయితే పసుపు పచ్చ పళ్ళను క్లీన్ చేయడానికి మీరు తప్పకుండా హాస్పిటల్‌కి వెళ్లాల్సిందే. అందుకే ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళకుండానే పసుపుపచ్చ పళ్ళను ఇంట్లోనే కొన్ని చిట్కాలను ఉపయోగించి తెల్లగా నిగనిగలాడేలా మార్చుకోవచ్చు. ఇక ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలతో దంతాలపై […]

Share:

తినే ఆహారంలో పోషకాల లోపం, నీటిలో ఫ్లోరైడ్ లాంటి కారణాల వల్ల పళ్ళు పసుపు పచ్చగా మారిపోతాయి. ఎంతలా అంటే ఒకసారి పళ్ళు పచ్చగా మారాయి, అంటే ఇక వాటిని తొలగించడం అసాధ్యం అనే చెప్పాలి.  అయితే పసుపు పచ్చ పళ్ళను క్లీన్ చేయడానికి మీరు తప్పకుండా హాస్పిటల్‌కి వెళ్లాల్సిందే. అందుకే ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళకుండానే పసుపుపచ్చ పళ్ళను ఇంట్లోనే కొన్ని చిట్కాలను ఉపయోగించి తెల్లగా నిగనిగలాడేలా మార్చుకోవచ్చు. ఇక ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలతో దంతాలపై పేరుకుపోయిన గార, పసుపు వంటి వర్ణాలను తొలగించి మీ పళ్ళను మరింత నిగనిగలాడేలా చేయవచ్చు. ఇక ఫలితంగా సంతోషకరమైన, ఆరోగ్యకరమైన చిరునవ్వుకు మీరు హాయ్ కూడా చెప్పవచ్చు.

ముఖ్యంగా టార్టార్. దీనిని డెంటల్ క్యాలికులస్ అని అంటారు అయితే ఫ్లేక్  అనేది దంతాలపై మరియు చిగుళ్లపై ఏర్పడే బ్యాక్టీరియా యొక్క మృదువైన అంటుకునే ఒక ఫలకం లాంటిది.  క్రమం తప్పకుండా తొలగించనప్పుడు టార్టార్ ఏర్పడడానికి దారితీస్తుంది కాబట్టి ఫలకాన్ని వదిలించుకోవడం చాలా ముఖ్యం. ఈ టార్టార్ అనేది పళ్ళపై పెరిగితే అప్పుడు చిగుళ్ల వ్యాధి,  దంత క్షయం, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ టార్టార్ ఏర్పడకుండా నిరోధించడానికి ఉత్తమమైన మార్గం మంచి దంత పరిశుభ్రతను పాటించడమే.

కొన్ని చిట్కాలను పాటించినట్లయితే ఇలాంటి టార్టర్ తొలగించి పసుపు పచ్చ పళ్ళను కాస్త తెల్లగా మార్చవచ్చు. 

1. ప్రతిరోజు ఉదయం, రాత్రి రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్ పేస్టుతో దంతాలను బ్రష్ చేయాలి.

2. దంతాల మధ్య చిక్కుకున్న ఫలకం, ఆహార కణాలను తొలగించడానికి ప్రతిరోజూ పుక్కిలించడం అలవాటు చేసుకోవాలి. తిన్న వెంటనే ఈ పద్ధతి పాటిస్తే దంతాలలో ఎటువంటి ఆహారపు కణాలూ నిలువ ఉండడానికి ఆస్కారం ఉండదు.

3. బ్యాక్టీరియాను చంపడానికి.. శ్వాసను ఫ్రెష్‌గా చేయడానికి యాంటీబాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించడం తప్పనిసరి. బ్రష్ చేసిన ప్రతిసారి మీరు మార్కెట్లో దొరికే మౌత్ ఫ్రెషనర్‌తో మౌత్ వాష్ చేసుకోవడం వల్ల మీ నోరు దుర్వాసన రాకుండా బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది.

4. ఇక తీసుకునే ఆహారంలో తక్కువ చక్కెర మరియు ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలి.  ఇక చాక్లెట్స్,  కాఫీ,  టీ వంటి అధిక చక్కర ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

5. ధూమపానం, పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం మానేయాలి.  ఇది దంతాలపై మరకలకు కారణం అవుతుంది. టార్టార్ ఏర్పడడానికి ఇది అతి పెద్ద సహాయకారి అని చెప్పవచ్చు. మీ పళ్ళపై టార్టార్ అధికంగా ఏర్పడినప్పుడు సొంత నిర్ణయాల కంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమమైన మార్గం.

ఇక ఇంటి చిట్కాల విషయానికి వస్తే.. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కొద్ది నీటిలో కలిపి పేస్ట్ లాగా తయారుచేసి ఆ మిశ్రమంతో పళ్ళు తోముకోవాలి.  కొన్ని నిమిషాల పాటు పళ్ళు తోమిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.  అయితే వారానికి రెండు సార్లు బేకింగ్ సోడా ను ఉపయోగించి పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళపై పేరుకుపోయిన పసుపుదనం దూరం అవుతుంది.

అలాగే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు కలిపి 30 సెకండ్ల పాటు ఆ నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఆ తర్వాత ఆ నీటిని ఉమ్మివేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నోట్లోని దుర్వాసన పోయి  బ్యాక్టీరియా కూడా దూరం అవుతుంది.