ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్న సద్గురు

ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటున్నాయి అంటున్నారు మనం ఎంతగానో అభిమానిస్తున్న సద్గురు. అవునండి, ముఖ్యంగా మనం రోజు తీసుకునే ఆహారంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు.  ఆరోగ్యానికి హైడ్రేషన్:  మనం ఫిట్ గా ఉండాలని, బరువు తగ్గాలని ఎన్నో గోల్స్ పెట్టుకుంటూ […]

Share:

ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటున్నాయి అంటున్నారు మనం ఎంతగానో అభిమానిస్తున్న సద్గురు. అవునండి, ముఖ్యంగా మనం రోజు తీసుకునే ఆహారంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. 

ఆరోగ్యానికి హైడ్రేషన్: 

మనం ఫిట్ గా ఉండాలని, బరువు తగ్గాలని ఎన్నో గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండీ.. మరి మన రోజు వారు తీసుకునే ఆహారంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు చేర్చిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అంటున్నారు యోగి సద్గురు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయలు మన జీవన శైలిని మార్చేస్తాయట, మనల్ని ఆరోగ్యంగా చేయడానికి అవి ఎంతో తోడ్పడతాయట. 

దోసకాయ తో ఎన్నో ప్రయోజనాలు: 

దోసకాయ మనల్ని డిహైడ్రేషన్ నుంచి తప్పిస్తుంది. అంతేకాకుండా, ఈ దోసకాయలో ముఖ్యంగా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మన బాడీలో డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది అసలు ఉండదు. ఇది మన శరీరంలో ఉండే ఎముకలను దృఢపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే, దోసకాయలో ఉండే విటమిన్ కె, మన ఆరోగ్యానికి ఎంతో మేలు. అంతేకాకుండా మన బ్లడ్ షుగర్ లెవెల్ ని కూడా తగ్గించడంలో దోసకాయలో ఉండే విటమిన్ కె ఎంతగానో సహాయపడుతుంది. ఎన్నో ప్రయోజనాలతో ఉన్న ఈ దోసకాయని మన రోజు వారు తినే ఆహారంలో చేర్చడం ద్వారా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పోషక విలువలు మన క్యాన్సర్ బారి నుంచి కూడా తప్పిస్తుందట. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యానికి దోసకాయ లో ఉండే పోషకాలు ఎంతో బాగా పనిచేస్తాయి. 

అయితే ఆరోగ్యపరంగా దృఢంగా మారేందుకు, బరువు తగ్గేందుకు, డిహైడ్రేషన్ ప్రాబ్లం బారి నుంచి బయట పడేందుకు, ఈరోజు నుంచే మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవాలని ఒక నియమాన్ని పెట్టుకోవచ్చు. దీని ద్వారా మంచి ఫలితాన్ని మీరే చూస్తారు. 

ఆరోగ్యాన్ని అందించే పళ్ళు: 

ఇక పళ్ళు విషయానికి వస్తే, రుచికరమైన పళ్ళు కేవలం రుచిని మాత్రమే కాకుండా, అవి మన శరీరానికి కావాల్సిన పోషకాలను, ఎన్నో రకాల విటమిన్ లను మనకు అందించడంలో సహాయపడతాయి. నిజానికి ఎన్నో  పోషక విలువలతో పాటుగా, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా ఎంతగానో ఉపయోగపడతాయి పళ్ళు. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ ప్రత్యేకించి మన వయసును తగ్గించి అందాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

మొక్కజొన్నలో ఎన్నో ఉపయోగాలు: 

మరో చక్కని ఉదాహరణ మొక్కజొన్న. ఇది పిండితో కూడిన ఒక చక్కని ఆహార పదార్థం. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మొక్కజొన్న లో ఉండే ఫైబర్ మన జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, ఆరోగ్యంగా మారుస్తుంది. మొక్కజొన్నల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఆంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. అంతేకాకుండా, ఫోలేట్ పోషక విలువ, మన శరీరంలో అవసరమయ్యే ఆరోగ్యకరమైన అంశాలను పెంపొందించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ సి ప్రత్యేకించి మన డిహైడ్రేషన్ ప్రాబ్లం ని తగ్గిస్తుంది. ఇలా అనేక రకాల ప్రయోజనకరమైన, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా, మంచి ఫిట్నెస్ తో ఉండేందుకు ఎంతగానో తోడ్పడతాయి.