రిలేషన్‌షిప్‌లో విభేదాలు మామూలే.. కానీ ఇలా మంచిది కాదు

వైవాహిక జీవితం ఎంతో అందమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ఎంతో ఓపిక అవసరం. మూడుముళ్ల బంధాన్ని మూడివేసుకోవాలంటే కొంత మేర అవగాహన అనేది ముఖ్యం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకర జీవనశైలిపై దృష్టి పెట్టడమంటే కసరత్తు చేయడమే అంటున్నారు నేటి యువత. ప్రస్తుతం ఉన్న బీజీ లైఫ్‌లో జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపాలన్నా షెడ్యూల్‌ చేసుకోవాల్సి వస్తుంది కొందరికి. ఆర్ధికంగా స్థిరపడని  ఇంకొదరి పరిస్థితి మరీ దారుణం. ఆఫీసులో కష్టపడ్డమే […]

Share:

వైవాహిక జీవితం ఎంతో అందమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ఎంతో ఓపిక అవసరం. మూడుముళ్ల బంధాన్ని మూడివేసుకోవాలంటే కొంత మేర అవగాహన అనేది ముఖ్యం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకర జీవనశైలిపై దృష్టి పెట్టడమంటే కసరత్తు చేయడమే అంటున్నారు నేటి యువత. ప్రస్తుతం ఉన్న బీజీ లైఫ్‌లో జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపాలన్నా షెడ్యూల్‌ చేసుకోవాల్సి వస్తుంది కొందరికి. ఆర్ధికంగా స్థిరపడని  ఇంకొదరి పరిస్థితి మరీ దారుణం. ఆఫీసులో కష్టపడ్డమే కాకుండా వచ్చే జీతం సరిపోక పార్ట్‌టైం జాబ్‌లకు మొగ్గుచూపుతున్నారు. దీంతో.. వైవాహిక జీవితంలోని ఆనందాన్ని కోల్పోవడమే కాకుండా.. భాగస్వామికి దూరమవుతున్నారు. దంపతుల మధ్య ఉండాల్సిన బాండింగ్‌ లేకుండా పోవడంతో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వైవాహిక బంధాలను తెంచుకుంటున్నారు. అయితే.. దంపతులు మధ్య గొడవలు సర్వసాధరణమేనని అంతేకాకుండా.. విభేదాలు మంచివే అంటున్నారు ప్రముఖ థెరపిస్ట్‌  క్లారా కెర్నిగ్. 

ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న సమస్యలు, అప్పుడప్పుడు మనస్పర్థలు సర్వసాధారణం. అయితే..  వైవాహిక జీవితంలో విభేదాలు అనివార్యమనే చెప్పాలి. ఇద్దరు వ్యక్తులు మానసికంగా కనెక్ట్ అయినప్పుడు, వారి అలవాట్లలో తేడాలు ఉండటం సహజం. దంపతులిద్దరికీ అన్ని ఒకేలా నచ్చుతాయనడంలో వాస్తవం లేదు. అయితే.. ఈ సందర్భంలోనే భార్యభర్తల మధ్య గొడవులు వస్తుంటాయి. ఒకరి అలవాట్లను మరొకరు గౌరవించడం మంచిది. దంపతుల నడుమ ఒక సందర్భంలో విబేధాలు తలెత్తినప్పుడు దానిపై గొడవ పడడం ఉత్తమం. ఎందుకంటే.. ఆ గొడవ నుంచి ఆ సమస్యకు పరిష్కారం కనుగొంటారు. ఒక వేళ విభేదాలు తలెత్తినప్పుడు మిన్నకుంటే.. ఆ తరువాత భార్యభర్తల మనసులో మనస్పర్థలు మొదలవుతాయి. దీంతో.. తమలో తామే సంఘర్షణనకు లోనై అది ప్రతికూలంగా రిలేషిన్‌షిప్‌పై ప్రభావం చూపింది.  అయితే.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాహాటంగానే చర్చించుకుంటే ఇద్దరిలో సంఘర్షణకు చోటుండదు. భాగస్వామి ఏం కోరుకుంటున్నారో.. వారి అభిమతం ఏమిటో తెలుస్తుంది.  

ఒక వేళ గొడవులు అనేవి భార్యభర్తల మధ్య లేకుండా.. ఒకరి మనసులోని భావాన్ని మరొకరు అర్థం చేసుకోకుండా ఉంటే.. వారి మధ్య దూరం పెరిగే  అవకాశం ఉంది. ఏదైనా నచ్చనప్పుడు నచ్చలేదని స్వతంత్రంగా చెప్పలేని పరిస్థితులు ఉంటే.. వారు తీవ్రమైన ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు. అంతేకాకుండా.. ఆ ఒత్తిడి కాస్తా కోపం, పగ, ద్వేషం లాంటి మనసతత్వాన్ని తెచ్చిపెడుతుంది. ‘గతంలో, నేను ఒక వాదనను నిరోధించగలిగితే (నేను దానిలో పాల్గొననప్పటికీ) నా విలువలు, నమ్మకాలకు వ్యతిరేకంగా కూడా వెళ్తాను. కానీ సంఘర్షణ తరచుగా అవసరమని, వాదించడానికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన మార్గాలు ఉన్నాయని నేను అర్థం చేసుకున్నాను,” అని థెరపిస్ట్ క్లారా అన్నారు.

మనసులో నిండిన భావాలు పరిష్కరించబడకుండా ఇద్దరు వ్యక్తులలో ఉన్నప్పుడు, వారిలో కాలక్రమేణా కోపం, నిరాశగా, నిస్పృహా పెరుగవచ్చు. దీనివల్ల ఒకరిపై ఒకరు కోపంగానూ, పగతోనూ ఉండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఒక రిలేషన్‌షిప్‌ లో మనం ఒకరికొకరు కలిగి ఉన్న అవసరాలు, కోరికలు, అలవాట్లు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  ఆరోగ్యకరమైన రీతిలో విభేదాలను పరిష్కరించడం అవతలివారిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒక వేళ ఆరోగ్యకరమైన రీతిలో విభేదాలను నిరోధించలేకుంటే.. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతాం. దీంతో..  ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని అనారోగ్యకరమైన రీతిలో ప్రభావితం చేస్తుంది. ఏదిఏమైనా మన భాగస్వామి అలవాట్లను గౌరవిస్తూ.. మన అలవాట్లను వారికి తేలియజేస్తూ.. సమస్యను దూరం చేయడమే ఆరోగ్యకరమైన గొడవలకు అర్థం అంటున్నారు క్లారా.