అమ్మ‌ల‌కు బ్రేక్ ఇద్దామా?

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1న నేషనల్ లేజీ మాతృ దినోత్సవాన్ని  జరుపుకుంటారు. ఈ రోజు వారి రోజువారీ బాధ్యతల నుండి రెస్ట్ తీసుకోవడానికి, మరియు వారిని అభినందించడానికి ఈ రోజు చాల ప్రత్యేకం. తల్లులు చాలా నాన్‌స్టాప్‌గా పనిచేస్తూ ఉంటారు.  కాబట్టి ఈ రోజు అనేది  వారు సంవత్సరానికి ఒక రోజు అయినా ఏ పని చేయకుండా ముఖ్యంగా వారి కుటుంబాలను చూసుకోవడానికి మరియు వారి స్వంత అవసరాలను పక్కన పెట్టే తల్లుల కృషి మరియు అంకితభావాన్ని […]

Share:

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1న నేషనల్ లేజీ మాతృ దినోత్సవాన్ని  జరుపుకుంటారు. ఈ రోజు వారి రోజువారీ బాధ్యతల నుండి రెస్ట్ తీసుకోవడానికి, మరియు వారిని అభినందించడానికి ఈ రోజు చాల ప్రత్యేకం. తల్లులు చాలా నాన్‌స్టాప్‌గా పనిచేస్తూ ఉంటారు.  కాబట్టి ఈ రోజు అనేది  వారు సంవత్సరానికి ఒక రోజు అయినా ఏ పని చేయకుండా ముఖ్యంగా వారి కుటుంబాలను చూసుకోవడానికి మరియు వారి స్వంత అవసరాలను పక్కన పెట్టే తల్లుల కృషి మరియు అంకితభావాన్ని గుర్తిస్తుంది.  

అమ్మ ప్రేమ వివరించడానికి మన ఈ జన్మ సరిపోదు. ఎందుకంటే ప్రేమంటే ఏంటో మొదట మనకు తెలిసేది తల్లి దగర నుండే ఆ తల్లి ప్రేమను వర్ణించడానికి భాష సరిపోదు. అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం ఉంది. మనకు జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవుళ్లను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం.  తెల్లవారు ఝాము నుంచి రాత్రి పడుకునే వరకు కంప్యూటర్‌లా అమ్మ ఇంటి పని చేస్తూనే ఉంటుంది. 

ఎప్పుడైనా కుటుంబ సభ్యులు సహాయపడతామన్నా కూడా తిరస్కరించి నేను చేస్తున్నా కదా అంటూ తన పనిలో నిమగ్నం అవుతుంది మాతృమూర్తి. భర్తకు టిఫిన్ బాక్స్ తో సహా అన్నీ అందించి ఆఫీసుకి సాగనంపుతుంది. పిల్లల్ని బడికి పంపించడం కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం పాఠశాల వెళ్ళేందుకు బస్ ఎక్కించడం వరకూ అన్నీ చేస్తుంది. వారు వెళ్లిపోయాక విశ్రాంతి ఉంటుందా? అంటే మిగిలిన పని అంతా చేయాలి. ఆ విధంగా మాతృమూర్తికి నిమిషం రెస్టు ఉండదు. ఇలా హౌజ్ వైఫ్ట్స్ చేస్తుంటే.

 కొంత‌మంది ఆడ‌వారు అటు ఇంట్లో ప‌ని ఇటు బ‌య‌ట ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో ఆర్ధికంగా కూడా కొంత మంది ఆడ‌వాళ్ళు ఆదుకుంటూ ఉంటారు. ఇలా రెండు విధాలా త‌ల్లి అనేది త‌న కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటుంది.  గడియ కూడా కూర్చోదు. ఆరోగ్యంగా లేకున్నా సరే ఇంటి పని చేస్తూనే ఉంటుంది. ఎంత ఆధునిక కాలంలో ఉన్నా కూడా తల్లిపాత్ర తీరనిదే. అయితే, మనకు జీవితాన్ని ఇచ్చిన కన్న తల్లిదండ్రుల పట్ల కొంమంది నిర్దయగా ప్రవర్తించడం అమానవీయం మాత్రమే కాదు, మనకు మనం విలువనిచ్చుకోలేని నైజం. 

అమ్మకు ప్రేమతో.. 

 అమ్మను ప్రేమగా చూసుకోలేని వారు ఉన్నా లేనట్లే. వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం అన్నిటికీ మించిన ఘోరం. చాలా మంది పిల్ల‌లు అయిన త‌ర్వాత వాళ్ళ‌కుండే బాధ్య‌త‌ల వ‌ల్ల త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి అమ్మ పెంచి పెద్ద చేస్తేనే ఈ స్థాయిలో ఉన్నామనే ధ్యాస లేకపోవడం, మాతృమూర్తి పట్ల విచక్షణ కోల్పోవడం అంటే ప్రాణం కోల్పోయినట్లే అమ్మ గురించి చాలా సందేశాత్మక సినిమాలు వచ్చాయి. ఎన్నో పాటలు, పద్యాలు, కవితలు, కథలు, నవలలు వచ్చాయి. అమ్మ గురించి వచ్చినవన్నీ ఘనమైన విజయం సాధించాయంటే అమ్మతనమే కారణం.

 ఇవ‌న్నీ చెప్పుకోడానికి విన‌డానికి మాత్ర‌మే కాదు త‌ల్లిదండ్రుల‌ను గౌర‌విస్తూ మంచిగా చూసుకోవాలి. అమ్మ‌కి క‌నీసం ఆదివారం కూడా సెల‌వు లేకుండా మ‌న‌కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతూనే ఉంటుంది. ఒక్క‌రోజైనా క‌నీసం విశ్రాంతి ఉండ‌దు. సాధారణంగా మాతృ దినోత్సవమని కానుకలు ఇచ్చి అమ్మ కళ్లలో ఆనందాన్ని చూడటమే కాదు.. తన పనుల్లో కొన్నింటిని పంచుకొంటే   అమ్మ సంతృప్తి అంతా ఇంతా ఉండదు.

ఇలా చేద్దాం..!

ఇల్లంతా చిందరవందరగా ఉంది. చీపురు తీసుకుని గదులన్నీ శుభ్రం చేసి వస్తువులన్నీ సక్రమంగా సర్దేస్తే సరి. అమ్మ ముఖం వెలిగిపోదూ… తన పని భారాన్ని తగ్గించారన్న సంతోషం కంటే జీవన గమనంలో నాణ్యమైన విలువలు నేర్చుకుంటున్నారనే సంబరమే తనలో ఎక్కువ.

* అనుకోకుండా అతిథులొచ్చారు. హడావుడిలో ఉన్న అమ్మకు ఆసరాగా టీ, కాఫీ లాంటివి మీరు సిద్ధం చేస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది?

* పాలు కాయడం, పెరుగు కోసం తోడు వేయడం, కొన్ని దుస్తులను పిండుకుని ఆరుబయట ఆరేయడం, అలమరాల్లో సర్దడం. ఇలా చదువుకు ఆటంకం రాని ఏ పనులు చేసినా అమ్మకు కొంత విశ్రాంతి ఇచ్చిన వారమవుతాం.

* రాత్రి భోజనం తర్వాత సర్దుకోవడానికి అమ్మకు పట్టే సమయం ఎక్కువే. ఈ సమయంలో టీవీ చూస్తూ కాలక్షేపం చేయకుండా సాయం చేస్తే తొందరగా పూర్తవుతుంది. అమ్మకు విశ్రాంతి దొరుకుతుంది.

* మాతృమూర్తులు ఆహ్లాదం పంచడానికి మొక్కల పెంపకంపైనా దృష్టి పెడుతుంటారు. వాటికి నీళ్లు పట్టడం.. మట్టిని మార్చడం.. ఎరువు వేయడం లాంటి పనుల్లో సాయం చేయడం ద్వారా మీరు ప్రకృతితో మమేకం కావొచ్చు.

* ప్రతి రోజూ పాఠశాలకు వెళ్లే సమయానికే పిల్లలకు లంచ్‌బాక్స్‌, షూస్‌, యూనిఫాం అమ్మ రెడీ చేసి పెడుతుంది. అలా కాకుండా చిన్నారులే ముందు రోజు సాయంత్రమే సాక్సులు ఉతికేసుకొని షూస్‌ రెడీ చేసుకుంటే ఎంత బాగుంటుంది? లంచ్‌బాక్స్‌, యూనిఫాం సిద్ధం చేసుకుని అమ్మకు ఆ కాస్త భారం తగ్గిస్తే ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మేలు చేసిన వారమవుతాం. ఈ పనులన్నీ సెలవుల్లో అలవాటు చేసుకుంటే పాఠశాలలు ప్రారంభమయ్యాక అమ్మకు పని భారం తగ్గించొచ్చు. బాలలైనా, బాలికలైనా ఈ చిన్ని తోడ్పాటుతో అమ్మకు కృతజ్ఞతగా మెలిగితే మీ కోసం మరింత సమయమిచ్చే భాగ్యం కలుగుతుంది.

కృతజ్ఞతకు వెలకట్టలేం

బిడ్డ గర్భంలోకి వచ్చిన నుంచీ తన ప్రాణం పోయినా ఫరవాలేదు కానీ మాతృత్వానికి మాత్రం ప్రాధాన్యం ఇస్తుంది. తన గర్భం నుంచి బయటకొచ్చిన చిన్నారులను లాలిస్తుంది. పాలిస్తుంది. పెరిగి పెద్దయినా… కుమారులు, కూతుళ్లు వృద్ధులైనా అమ్మ ప్రేమ ఎంతమాత్రమూ తరగదు. అందుకే ఆ ప్రేమను  కొలవలేం. అమ్మ మోములో చిరునవ్వు చెరిగిపోకుండా చూసుకోవడమే నిజమైన కృతజ్ఞత..