Badrinath: బద్రీనాథ్ గుడిలో శంఖం ఎందుకు ఊదకూడదు!

భారతదేశ ఆలయాలలో బద్రీనాథ్ (Badrinath) ఆలయ (Temple) చరిత్ర ఎంతో గొప్పది. ప్రతి ఏటా కొన్ని లక్షల, కోట్ల మంది బద్రీనాథ్ (Badrinath) ఆలయాన్ని (Temple) దర్శించుకుంటారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బద్రీనాథ్ (Badrinath).. కేదార్నాథ్ ప్రాంతాల అందాలను చూసేందుకు చాలా మంది ఇతర ప్రాంతాల, దేశాల నుండి కూడా భారతదేశం చేరుకుంటారు. మరి అటువంటి బద్రీనాథ్ (Badrinath) ఆలయం (Temple)లో శంఖం (Conch) ఊదకూడదట.. ఈ విషయం మీకు తెలుసా! ఎందుకు ఊదకూడదో, కారణాలు (Reasons) […]

Share:

భారతదేశ ఆలయాలలో బద్రీనాథ్ (Badrinath) ఆలయ (Temple) చరిత్ర ఎంతో గొప్పది. ప్రతి ఏటా కొన్ని లక్షల, కోట్ల మంది బద్రీనాథ్ (Badrinath) ఆలయాన్ని (Temple) దర్శించుకుంటారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బద్రీనాథ్ (Badrinath).. కేదార్నాథ్ ప్రాంతాల అందాలను చూసేందుకు చాలా మంది ఇతర ప్రాంతాల, దేశాల నుండి కూడా భారతదేశం చేరుకుంటారు. మరి అటువంటి బద్రీనాథ్ (Badrinath) ఆలయం (Temple)లో శంఖం (Conch) ఊదకూడదట.. ఈ విషయం మీకు తెలుసా! ఎందుకు ఊదకూడదో, కారణాలు (Reasons) ఈరోజు తెలుసుకుందాం..

బద్రీనాథ్ గుడిలో శంఖం ఎందుకు ఊదకూడదు!: 

హిందూ ఆచారాలు.. వేడుకలలో శంఖం (Conch) ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది, వాటి ప్రతిధ్వని ధ్వని పవిత్రమైన ఓంను సూచిస్తుంది. మన ఈ సృష్టిలోనే పవిత్రమైన ధ్వనిగా శంఖ శబ్దాన్ని పరిగణిస్తారు. ఏదైనా మతపరమైన ఆచారం లేదా వేడుకను ప్రారంభించే ముందు సాంప్రదాయకంగా శంఖం (Conch) ఊదుతారు. ఆలయ (Temple) ఆరతులు, ఆచారాల సందర్భంలో ఇది సుపరిచితమైన శబ్దం. అయితే, భారతదేశంలోని బద్రీనాథ్ (Badrinath) ఆలయం (Temple)లో ఈ సంప్రదాయానికి ప్రత్యేకమైన మినహాయింపు ఉంది, ఇక్కడ శంఖం (Conch) ఊదకూడదు అని ఆచారం ఉంది. దీని వెనక చాలా కారణాలు (Reasons) ఉన్నాయి..

మతపరమైన ఆచారాల ప్రకారం, శంఖం (Conch) ఊదడం ఆచారం. అసాధారణమైన పర్యావరణ పరిస్థితుల కారణంగా బద్రీనాథ్ (Badrinath) ఆలయం (Temple) ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎత్తైన హిమాలయ పర్వతాలలో నెలకొని ఉన్న ఈ మందిరం సంవత్సరంలో ఎక్కువకాలం మనకి తెలిసి మంచుతో కప్పబడి ఉంటుంది..ఇటువంటి కారణంగానే ఇక్కడ శంఖం (Conch) ఊదిన వెంటనే అనేక విపరీత పరిణామాలు దారి తీసే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ శంఖం (Conch) ఊదకూడదు అంటారు.

చుట్టుపక్కల ఉన్న పర్వతాల భౌగోళిక లక్షణాలు శంఖం (Conch) శబ్దాలు ప్రతిధ్వనించడం కారణంగా మంచును పగులగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉండే వాతావరణాన్ని సృష్టిస్తాయి, ఇది మానవ జీవితానికి ప్రమాదం కలిగిస్తుంది. శంఖం (Conch) శబ్దం ఉత్పత్తి చేసే ఎకో.. మంచుతో నిండిన పరిసరాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. మంచు తుఫానులు ఏర్పడటానికి దారి తీస్తుంది, ఇది ఆలయాన్ని(Temple) మరియు యాత్రికులను మరింత ప్రమాదంలో పడేస్తుంది.

ఇది కూడా కారణం కావచ్చు: 

సైంటిఫిక్ రీజన్ కాకుండా, బద్రీనాథ్ (Badrinath)‌లో శంఖం (Conch) ఊదడం నిషేధానికి దోహదపడే పౌరాణిక కథనాలు కూడా ఉన్నాయి. లక్ష్మీదేవి తన తులషి అవతారంలో చార్ ధామ్‌లో ధ్యానం చేస్తున్నప్పుడు విష్ణువు శంఖచూడ్ అనే రాక్షసుడిని సంహరించిన కథను ఒక పురాణం వివరిస్తుంది. ఈ భయానక సంఘటన జ్ఞాపకాల నుండి లక్ష్మీ దేవిని రక్షించడానికి, బద్రీనాథ్ (Badrinath) ఆవరణలో శంఖాలు ఊదడం నిషేధించారని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.

మరో పౌరాణిక కథ ప్రకారం.. వాతాపి మరియు అతాపి అనే ఇద్దరు రాక్షసులను.. అగస్త్య మహర్షి వెంబడించిన కథను వివరిస్తుంది. అగస్త్యుడు కనికరం లేకుండా రాక్షస ద్వయాన్ని వెంబడించగా, రాక్షసుల్లో ఒకరైన వాతాపి పట్టుబడకుండా ఉండేందుకు శంఖం (Conch) లోపల తలదాచుకుంటాడట.. మరోవైపు భయంతో అతాపి అనే రాక్షసుడు మందాకిని నదిలో దాక్కున్నాడట.. ఎవరైనా శంఖాన్ని ఊదితే వాతాపి రాక్షసుడు పుంజుకుంటాడని ఇక్కడి నమ్మకం. ఇలా రకరకాల కారణాల (Reasons) వల్ల బద్రీనాథ్ (Badrinath) ఆలయ (Temple) ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా శంఖం (Conch) ఊదకూడదు.