Life Span: ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు ముందుగా చనిపోవడానికి కారణం

ఇక్కడే అధికం..

Courtesy: Twitter

Share:

Life Span: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా ఆడవాళ్ళ (Women) కన్నా మగవాళ్ళు (men) అధికంగా, తక్కువ వయసులోనే చనిపోతున్న (Death) క్రమం కనిపిస్తుంది. ఇది మనుషులలోనే కాకుండా, వేరే ఇతర జంతువులలో కూడా కనిపిస్తోంది. అయితే దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ముందుగా చనిపోవడానికి కారణం: 

ఉదాహరణకు, 2022లో జర్మనీలో పురుషుల (Men) సగటు ఆయుష్షు (Life Span) కేవలం 78 ఏళ్లు కాగా, మహిళల ఆయుష్షు (Life Span) 82.8 సంవత్సరాలు. USలో, 2021లో స్త్రీల (Women) సగటు ఆయుష్షు (Life Span) 79, పురుషుల (Men)కు ఇది 73 సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. పురుషుల (Men) స్త్రీల (Women)కు మధ్య వ్యాసం, ఈ 5.8 సంవత్సరాల గ్యాప్ 1996 తర్వాత నుంచి కనిపించడం జరుగుతోంది. అంతేకాకుండా కరోనా (Corona) తర్వాత కూడా ఈ మరణాల సంఖ్య పెరిగినట్లు, తక్కువ వయసులోనే పురుషులు (Men) మహిళల కంటే ముందుగానే చనిపోతున్నట్లు (Death) వెళ్లడైంది. నవంబర్ 2023లో JAMA జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన పేపర్‌లో, ఈ మహమ్మారి కరోనా (Corona) కారణంగా USలోని, ముఖ్యంగా పురుషుల (Men) ఆయుష్షు (Life Span)ను మరింత క్షీణించేలా చేసిందని అధ్యయనంలో తేలింది. 

ఇదిలా ఉండగా మరోవైపు, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, స్లోవేకియా మరియు స్విట్జర్లాండ్ వంటి దేశాలలో పురుషుల (Men) మరణాల కు సంబంధించి కొత్త విషయం బయటపడింది. ఇతర దేశాలలో పురుషుల (Men) ఆయుష్షు (Life Span) తగ్గుతూ ఉంటే, ఈ ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, స్లోవేకియా మరియు స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో మాత్రం, పురుషుల (Men) ఆయుష్షు (Life Span)పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా ఇతర జంతువులలో కూడా, మగ జంతువులు ఆయుష్షు (Life Span) తగ్గినట్లు. మగ జంతువులతో పోలిస్తే ఆడ జంతువులు ఎక్కువ కాలం జీవిస్తున్నాయి. ముఖ్యంగా, మగవారిలో ఎక్కువ శ్రమ, వత్తిడి, సెక్షువల్ పార్టిసిపేషన్ ఇలా పలు విషయాల కారణంగా ఆయుష్షు (Life Span) అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. 

యువతలో హఠాత్ మరణాలు: 

కరోనా (Corona) వచ్చిన సమయంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కరోనా (Corona) భారీ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఇప్పటికీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. కరోనా (Corona) నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రభుత్వం సిఫారసు చేసిన ఇంజక్షన్స్ మూడు డోసులు రూపంలో ప్రతి ఒక్కరూ వేసుకున్నారు. అంతా మామూలుగా మారింది. కానీ ఉన్నట్టుండి కరోనా (Corona) వచ్చిన తరువాత కూడా చాలామంది హఠాత్తుగా మరణించడం గ‌మ‌నార్హంగా. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి ఇప్పటికి క్లారిటీ లేదు. దీని గురించి తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, రెండు అధ్యాయాలు చేయనుంది. ముఖ్యంగా యువత కోవిడ్ అనంతరం ఎందుకు హఠాత్ మరణాలకు గురవుతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే రీసెర్చ్ లో భాగంగా ముఖ్య కారణాలు తెలుసుకుని మరిన్ని మరణాలను నిరోధించవచ్చు అని నివేదికలో పేర్కొంది ఐసిఎంఆర్.

ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్, ముఖ్యంగా 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మరణాలను పరిశీలిస్తున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ (జిసిటిఎం) సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి కారణాలు లేకుండా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి, దాని గురించే ఈ అధ్యయనాలు అంటూ వెల్లడించారు.

ఇప్పటివరకు, న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో 50 శవపరీక్షలను అధ్యయనం చేసింది మరియు రాబోయే కొద్ది నెలల్లో, మరో 100 పరీక్షలు నిర్వహించబోతున్నట్లు చెప్పింది. 

ఈ అధ్యయనంలో భాగంగా చనిపోయిన (Death) వారి గురించే కాకుండా, వారి కుటుంబ సభ్యుల గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కేస్ కంట్రోల్ స్టడీస్‌కు పోలికల కోసం కంట్రోల్ టీం వంటి అవసరం ఉండొచ్చు. అందువల్ల, చనిపోయిన (Death) వారి పరిసరాలలో ఒకే విధమైన ప్రొఫైల్ ఉన్న వ్యక్తులను - ఒకే ప్రాంతంలో, ఒకే లింగం, వయస్సు మరియు నివాసం ఉన్నవారిని ఇంటర్వ్యూ చేస్తున్నామని ICMR డైరెక్టర్చె ప్పాడు,ఇది రిస్క్ ఫ్యాక్టర్ అసోసియేషన్‌ను కనిపెట్టడానికి ముఖ్యమైన రీసెర్చ్ అని కూడా చెప్పారు.