ఈ ఎక్సర్సైజులతో గుండె పదిలం

ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా ముఖ్య ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు అంతేనా ఉంది. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది వ్యాయామం చేయాలని కొంత సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాను. అయితే వ్యాయామం చేయకపోవడం అనేది గుండెకు సంబంధించిన వ్యాధులను అధికం చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ ఎవరైనా చేయగలిగే సాధారణ వ్యాయామాలు చేయగలిగితే తమ గుండె ఆరోగ్యాన్ని అధికంగా చూసుకోవడం అవుతుంది. అంతేకాకుండా ఈరోజు […]

Share:

ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా ముఖ్య ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు అంతేనా ఉంది. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది వ్యాయామం చేయాలని కొంత సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాను. అయితే వ్యాయామం చేయకపోవడం అనేది గుండెకు సంబంధించిన వ్యాధులను అధికం చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ ఎవరైనా చేయగలిగే సాధారణ వ్యాయామాలు చేయగలిగితే తమ గుండె ఆరోగ్యాన్ని అధికంగా చూసుకోవడం అవుతుంది. అంతేకాకుండా ఈరోజు మీరు కొన్ని ఈజీగా చేసే వ్యాయామాలు, ఏ సమయాలలో వ్యాయామం చేస్తే మంచిది అన్న వాటి కోసం తెలుసుకుందాం..

మోకాలి పుష్-అప్‌లు: 

సాధారణ పుష్-అప్‌ల కంటే మోకాలి పుష్-అప్‌లు చేయడం చాలా సులభం. ఇది శరీరం యొక్క సొంత బరువును ఒకేసారి ఎత్తే ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీర బరువుని తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే, మీకు మోచేయి, మోకాలి, భుజం లేదా మణికట్టు మీద ఇంతకుముందు ఏవైనా దెబ్బలు వంటివి తగిలి ఉంటే, మోకాలి పుష్-అప్‌లను ప్రయత్నించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఏరోబిక్ వ్యాయామం: 

నిజానికి ఒత్తిడి లేకుండా చేసే ఒక రకమైన వ్యాయామం. ఇటువంటివి వ్యాయమం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, దీని ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది, స్టీవర్ట్ చెప్పారు. అంతేకాకుండా, ఇది మీ ఏరోబిక్ ఫిట్‌నెస్‌ని పెంచుతుంది. ఏరోబిక్ వ్యాయామం కూడా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు మీరు ఇప్పటికే మధుమేహంతో జీవిస్తున్నట్లయితే, మీ రక్తంలో గ్లూకోజ్‌ని నియంత్రించడంలో ఈ ఆరోబిక్ వ్యాయామం అనేది చాలా బాగా సహాయపడుతుంది. 

కార్డియో ఎక్సర్సైజ్: 

చాలామంది ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంత మంచి పద్ధతితో అందరికీ తెలుసు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ నిలువలు తగ్గేందుకు ఎక్ససైజ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్డియో ఎక్సర్సైజ్ అనేది ముఖ్యంగా గుండెను పదిలంగా ఉంచేందుకు చేసే ఎక్ససైజ్. 

ఏ సమయంలో ఎక్సర్సైజ్ చేయడం మంచిది: 

ఎక్ససైజ్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి అనే డౌట్ అందరికీ వస్తూనే ఉంటుంది. అయితే నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, ఉదయం లేచిన తర్వాత అంటే బ్రేక్ ఫాస్ట్ చేయకముందు ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా మంచిదే అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఒక రకమైన సైన్స్ కూడా ఉందంటున్నారు నిపుణులు. 

మనం రోజంతా పనిచేసి, రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తరువాత, మన శరీరంలో కొంత భాగం పేరుకున్న కొవ్వును కరిగించేందుకు, అదే విధంగా ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినక ముందు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన శరీరంలో ఎటువంటి ఆహారం ఉండదు కాబట్టి, శరీరంలో పేరుకున్న కొవ్వును మాత్రమే ఉపయోగించుకుని మన శరీరానికి బలం చేకూరుతుంది. అంటే ఈ ప్రక్రియలో, శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడమే కాకుండా, ముఖ్యంగా శరీర బరువు అధికంగా తగ్గే ఆకాశాలుంటాయి. అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి. అందుకోసమే ముఖ్యంగా, ఉదయం లేచిన తర్వాత, బ్రేక్ ఫాస్ట్ చేయకముందు కార్డియో ఎక్ససైజ్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు. 

లేట్ మార్నింగ్ (10-11 AM) : కొంచెం ఆలస్యంగా రోజుని ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం. ఈ సమయానికి, శరీరం వేడెక్కుతుంది, ఫ్లెక్సిబిల్ అయ్యి మజిల్ బలం పెరుగుతుంది. 

సాయంత్రం (5-7 PM) :చాలా మందికి, సాయంత్రం ప్రారంభం అయ్యే సమయం అనుకూలం. రోజంతా పని చేసిన తర్వాత, రోజు ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదనంగా, ఈ టైమ్ స్లాట్ లో పార్టనర్స్ తో వ్యాయామం చేయడానికి బాగుంటుంది లేదా ఆఫీస్ అయ్యాక గ్రూప్ ఫిట్‌నెస్ క్లాసులకు వెళ్లే అవకాశాన్ని ఇస్తుంది.