పిల్లల ఆరోగ్యంపై జంక్ ఫుడ్ ప్రభావం ఎంతుందో మీకు తెలుసా?

మీ పిల్లల ఆహారం విషయానికి వస్తే బర్గర్లు, పిజ్జాలు, షుగరీ  డ్రింక్స్ మరియు ప్రాసెస్ చేసిన మాంసాలు వంటి అనారోగ్యకరమైన ఎంపికలను నివారించాలని న్యూట్రిషనిస్ట్స్ సిఫార్సు చేస్తున్నారు. కానీ జంక్ ఫుడ్స్ తినకుండా పిల్లలని ఆపడం చాల కష్టం, అసలు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే 10 రకాల ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి… పిజ్జా, బర్గర్లు మరియు చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ లో కీలకమైన విటమిన్లు, మినిరల్స్, ఫైబర్ మరియు ఇతర ముఖ్యమైన నూట్రిఎంట్స్ […]

Share:

మీ పిల్లల ఆహారం విషయానికి వస్తే బర్గర్లు, పిజ్జాలు, షుగరీ  డ్రింక్స్ మరియు ప్రాసెస్ చేసిన మాంసాలు వంటి అనారోగ్యకరమైన ఎంపికలను నివారించాలని న్యూట్రిషనిస్ట్స్ సిఫార్సు చేస్తున్నారు. కానీ జంక్ ఫుడ్స్ తినకుండా పిల్లలని ఆపడం చాల కష్టం, అసలు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే 10 రకాల ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి…

పిజ్జా, బర్గర్లు మరియు చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ లో కీలకమైన విటమిన్లు, మినిరల్స్, ఫైబర్ మరియు ఇతర ముఖ్యమైన నూట్రిఎంట్స్ కలిగి ఉండవు. ఇవి పిల్లల ఎదుగుదల ను  అడ్డుకుంటాయి, వారి శారీరక మరియు మానసిక ఎదుగుదలని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వారు తినే ఆహారంలో జంక్ ఫుడ్ ను తగ్గించే ప్రయత్నం చేయాలి. 

పిల్లలు జంక్ ఫుడ్స్ తినడానికి కారణాలు ఏమిటో తెలుసా? 

సాధారణంగా జంక్ ఫుడ్ రంగు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ మరియు తెలివైన మార్కెటింగ్ పిల్లలకు విజువల్ అప్పీలింగ్ గా  ఉంటాయి. అందుకే చిన్నపిల్లలకి  చుసిన వెంటనే వాటిని తినాలి అనిపిస్తాయి. అదనంగా జంక్ ఫుడ్స్ లో ఎక్కువగా షుగర్, సాల్ట్ మరియు ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి తిన్న వెంటనే మైండ్ లో ఒక రకమైన సంతృప్తిని ఇస్తాయి. అంతే కాకుండా పిల్లలు వీటి రుచికి త్వరగా అలవాటు పడిపోతారు. 

తల్లిదండ్రులకి జంక్ ఫుడ్స్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలిసినప్పటికీ పిల్లల కోరికల ముందు లొంగిపోతారు. తిన్న ఆనందం కొంతసేపు ఉన్నప్పటికీ అది దీర్ఘకాలం అనారోగ్యానికి దారితీస్తుంది. తల్లిదండ్రులు మీ పిల్లలకి పోషకాహారం ఇవ్వడం ముఖ్యం అది వారి ఆరోగ్యానికి చాలా మంచిది.

సరైన పోషకాహారం సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, శారీరక కదలికలలో  మరియు వివిధ వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు బలమైన ఎముకలు, చురుకుదనం మరియు శక్తికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తాయి. 

జంక్‌ఫుడ్‌ని అధికంగా తీసుకోవడం వల్ల కలిగే భయంకరమైన పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ కంటే కొంచెం దిగువన ఉన్న భారతదేశంలో పిల్లలలో ఊబకాయం సమస్య అధికంగా ఉంటుంది. స్థూలకాయంతో బాధపడే ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఇన్సులిన్ నిరోధకతను కూడా ఎదుర్కొంటారు, మధుమేహం, PCOS, ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు కొవ్వు కాలేయ వ్యాధి వంటి పరిస్థితులకు వారి శరీర రక్షణ వ్యవస్థ ఎదుర్కోలేదు కాబట్టి వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

క్రమం తప్పకుండా జంక్ ఫుడ్ తీసుకోవడం పిల్లల ఏకాగ్రత సామర్థ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది, ఇది పరధ్యానం పెరగడానికి మరియు దృష్టిని తగ్గించడానికి దారితీస్తుంది. మీ పిల్లల సరైన ఎదుగుదలను నిర్ధారించడానికి, వారు ఎలాంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు అనే విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. వారి పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం వారి ఎదుగుదలకు మరియు శక్తి సామర్థ్యాలకు బాగా తోడ్పడుతుంది. పిల్లలకు హాని చేసే జంక్ ఫుడ్ గురించి ఇక్కడ చూడండి.

పిజ్జా మరియు బర్గర్లు : ఫాస్ట్ ఫుడ్స్లో మొదట గుర్తొచ్చేది పిజ్జా & బర్గర్లు. వీటిలో శాతురేటెడ్ ఫ్యాట్స్ మరియు ఎక్కువగా సోడియం ఉంటుంది. ఇవి తరుచుగా, అధికంగా తీసుకోవడం వలన బరువు పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యాన్ని పెంచే లీన్ ప్రొటీన్స్ లేదా వెజిటబుల్స్తో, ఇంట్లో తయారు చేసిన బర్గర్‌లను తయారు చేసుకొని తినడం చాలా మంచిది. అవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి మరియు ఆరోగ్యాన్ని ఇస్తాయి మీ పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు.

ప్యాకింగ్ చేసిన స్నాక్స్ : మీ పిల్లలని శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా ఉంచే స్నాక్స్ మాత్రమే ఇవ్వండి. తరుచుగా అనారోగ్యాన్ని కలిగించే రకరకాల పిండి, చెక్కర, కొవ్వులతో ప్యాక్ చేయబడిన కుకీస్, క్రాకెర్స్ మరియు గ్రానోలా బార్స్ వంటి స్నాక్స్ నుంచి మీ పిల్లలని దూరంగా  ఉంచండి. ఈ ప్యాక్ చేసిన స్నాక్స్‌లో వారికి కావలసిన ముఖ్యమైన పోషకాలు ఏవి ఉండవు. వారికి వాటిని ఎక్కువగా తినాలి అనిపించేలా చేస్తాయి. వాటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు లేదా ఇంట్లో తయారుచేసిన ట్రయల్ మిక్స్ వంటి స్నాక్స్ ఎంచుకోవడం మీ పిల్లల ఆరోగ్యానికి చాల మంచిది

.

ప్రాసెస్ చేసిన మాంసాలు : వీటిని జాగ్రత్తగా ఎంచుకోవడం మీ పిల్లల ఆరోగ్యానికి చాల మంచిది. సాసేజ్‌లు, హాట్ డాగ్‌లు, రెడీ-టు-కుక్ మీట్స్ ఫ్రోజెన్ నగ్గెట్స్ ఇవన్నీ ప్రాసెస్ చేసిన మాంసాలకి చెందినవి. ఈ మాంసాలు అన్ని ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ మరియు అధిక మొత్తంలో సోడియం కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే చాల వరుకు గుండె జబ్బులు, కాన్సర్ మరియు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటికి బదులుగా చికెన్, మటన్, ఫిష్ మరియు ప్రాసెస్ చేయని తాజాగా కట్ చేసిన మాంసాలు తీసుకోవడం చాల మంచిది. ఇది ఆరోగ్యకరమైన ఆహారం మరియు మీ పిల్లల ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. 

షుగర్ కాండీస్ మరియు స్వీట్లు : క్యాండీలు మరియు చాక్లెట్లు వంటి స్వీట్లు మీ పిల్లలకి అధికంగా కేలరీస్ పెంచుతాయి. ఇవి బరువు పెరగడానికి మరియు దంత సమస్యలు పెరిగేలా చేస్తాయి. ఇవి అధికంగా తినడం వల్ల శక్తి క్షిణించి, చెక్కెర సంబంధిత రోగాలు వస్తాయి. తీపిని ఎక్కువగా ఇష్టపడే పిల్లల కోసం పోషక విలువలు కలిగిన తాజా పండ్లు ఇవ్వడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. 

ఫ్రై చేసిన పదార్దాలు : బంగాళాదుంప చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, మరికొన్ని వేయించిన ఆహార పదార్థాలలో అనారోగ్యాన్ని కలిగించే ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం మరియు కేలరీలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పదార్దాలు బరువు పెరగడానికి దారితీయడమే కాకుండా గుండె జబ్బులు మరియు రక్తపోటు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్-పొప్పేడ్ పాప్కార్న్, బకెడ్ స్వీట్ పొటాటో ఫ్రైస్, ఓర హోల్-గ్రైన్ క్రాకెర్స్ వంటి పదార్దాలని ఎంచుకోవడం మంచిది ఎందుకంటే అవి కర కరగా తినాలనిపించే మీ పిల్లల  కోరికను తీర్చుతాయి మరియు కొన్ని పోషకాలు కలిగి ఉంటాయి.

కూల్ డ్రింక్స్ : సోడాలు, పండ్ల రసాలు మరియు ఎనర్జీ డ్రింక్స్ వంటి అధిక మొత్తంలో చెక్కర ఉన్న పానీయాలు పిల్లలు తీసుకోవడం వలన అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ డ్రింక్స్ లో ఆరోగ్యానికి సంబందించిన పోషక విలువలు లేకపోవడమే కాకుండా బరువు పెరగడానికి మరియు టైప్ 2 డయాబెటిస్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అటువంటివి తగ్గించి నీళ్లు, పాలు మరియు సహజంగా కలిపిన ఫ్రూట్ జ్యూస్లు వంటి పానీయాలు మీ పిల్లలకి ఇవ్వండి. వారు డీప్ హైడ్రేషన్ మరియు వేరే ఇతర వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు సాయపడతాయి. 

చికెన్ నగ్గెట్స్ / చికెన్ ఫింగర్స్ : పిల్లలు చికెన్ బంబంధిత ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే చికెన్ నగ్గెట్‌లు మరియు చికెన్ ఫింగర్స్ ఎక్కువ సేపు నూనెలో వేయించుతారు. అలా ఎక్కువగా వేయించడం వలన అధిక స్థాయిలో సోడియం, ఫ్యాట్స్ వంటివి ఉంటాయి అవి వారి ఆరోగ్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. దానికి బదులుగా చికెన్నీ తక్కువ నూనెలో ఇంట్లో వేయించుకొని కొన్ని కూరగాయాలని జతచేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఎలా ఇస్తే వారికీ చికెన్ తినాలి అనే కోరిక తీరుతుంది, అటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. 

బంగాళదుంప చిప్స్ : పిల్లలు చిప్స్ వంటి స్నాక్స్ తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. వాటిని తినడంలో వారికి ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా కాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. అతిగా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు మరియు అధిక రక్తపోటు వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.

నూడిల్స్ : పిల్లలకి నూడిల్స్ వంటి పదార్దాలు ఎక్కువగా తినాలి అనిపిస్తాయి ఎందుకంటే అవి రంగు, రుచి, మంచి వాసన మరియు ఒక సౌకర్యవంతమైన భోజనంలా కనిపిస్తాయి. కానీ అవి అధిక మొత్తంలో సోడియం కలిగి ఉంటుంది. తెల్లని నూడిల్స్లో డైటరీ ఫైబర్ తక్కువగా ఉంటుంది మరియు మంచి సువాసన రావడం కోసం వాడే పదార్దాదాలలో హాని కలిగించే రసాయనాలు ఉంటాయి.

పేస్ట్రీలు మరియు కేకులు : పిల్లలకి ఇవి చూడటానికి ఆహ్లదకరంగా ఉండటం వల్ల వారు వెంటనే తినడానికి ఇష్టపడతారు, అయితే అవి తీసుకుంటే ఎన్నో రకాల రోగాలు తప్పవు. అధిక స్థాయిలో చక్కెర మరియు  క్రొవ్వులు వారు బరువు పెరిగేలా చెయ్యడమే కాకుండా దంత సంబంధిత సమస్యలు మరియు మధుమేహం వంటివి పెరిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు వారి పిల్లల ఎదుగుదల కోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని ఇవ్వడం చాల ముఖ్యం. 

తల్లిద్రండ్రులుగా మీ పిల్లల ఆహార అలవాట్లని క్రమ పద్దతిలో రూపొందించడం వారి ఎదుగుదలకి చాల ముఖ్యమైనది. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం, సంపూర్ణ ఆహారాలతో ఇవ్వడం మరియు సమతుల్య పోషణ యొక్క ప్రాముఖ్యత గురించి జ్ఞానాన్ని అందించడం మీ పిల్లల ఆరోగ్యాన్ని మరియు సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. మీ పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం ఎంతో అవసరమని గుర్తుంచుకోండి.