ఒత్తిడిని దూరం చేసే యోగాసనాలు

రోజుకు కేవలం 15 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు దీన్ని ఇంట్లో మరియు మీ కుర్చీలో చేయవచ్చు. వాటి గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చదవండి. సుఖ పూర్వక ప్రాణాయామం “సుఖ పూర్వక ప్రాణాయామం” అనే ఆసనం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అవి ఏమిటో చాలా మందికి తెలియదు. అయితే ఆ ప్రయోజనాలు ఏమిటి? ఆ ఆసనం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. […]

Share:

రోజుకు కేవలం 15 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు దీన్ని ఇంట్లో మరియు మీ కుర్చీలో చేయవచ్చు. వాటి గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చదవండి.

సుఖ పూర్వక ప్రాణాయామం

“సుఖ పూర్వక ప్రాణాయామం” అనే ఆసనం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అవి ఏమిటో చాలా మందికి తెలియదు.

అయితే ఆ ప్రయోజనాలు ఏమిటి? ఆ ఆసనం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. యోగ ఆసనాలలో సుఖ పూర్వ ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ ఈ ఆసనం సాధన చేయడం వల్ల మనం రోజూ ఎదుర్కొనే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. మన శరీరంలోని ప్రతి ఒక్క నాడి ఉత్తేజితమవుతుంది.

దీంతో అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ సుఖ పూర్వ ప్రాణాయామం అనే ఆసనాన్ని రోజూ వేయడం వల్ల మన శరీరంలోని ప్రతి కణానికి శక్తి లభిస్తుంది. దీని ద్వారా.. మీరు రోజంతా చాలా చురుకుగా పని చేయవచ్చు.ఈ ప్రాణాయామ ఆసనం శ్వాసక్రియ రేటును పెంచడమే కాకుండా మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా చేయడంలో సహాయపడుతుంది.

మానసికంగా ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారు రోజూ ఈ ఆసనం వేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కూర్చొనే గరుడాసనం

దీనిని ఈగిల్ స్టాన్స్, చైర్ గరుడాసన అని కూడా అంటారు. ఇది బ్యాలెన్సింగ్ పోజ్. మీరు మీ ఆఫీసు కుర్చీలో కూర్చొని ఇలా చేయడం వలన, మీ భుజాలు, లోయర్ బ్యాక్, తొడలు స్ట్రెచ్ అయినట్లు అనుభూతి చెందుతారు. ఈ స్ట్రెచ్ మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది.

ఈ ఆసనం చేసే విధానం:

నేలపై పాదాలు ఆనించి కుర్చీ అంచున కూర్చోండి.

మోచేతులు వంచి, మీ చేతులు తెరవడం ద్వారా పీల్చుకోండి.

శ్వాస వదులుతూ, కుడి మోకాలిని ఎడమ వైపుకు తీసుకురండి.

ఈ భంగిమలో ఉన్నప్పుడు, 3 నుండి 5 సార్లు బలంగా శ్వాస తీసుకొని వదలండి. 

ప్రయోజనాలు:

ఈ ఆసనం ట్రైసెప్స్‌తో పాటు శరీరం వెనుక భాగాన్ని స్ట్రెచ్ చేయడంపై పనిచేస్తుంది. 

ఏకాగ్రతను పెంచడానికి, ఆందోళనను తొలగించడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. 

సిట్టింగ్ పవన ముక్తాసనం

యోగాలో పవన ముక్తాసనం ఒక రకమైన ఆసనం. ఇలా ఆసనం వేయడం వల్ల పొట్టలోని గ్యాస్ బయటకు వస్తుంది. అందుకే ఈ ఆసనానికి పవన ముక్తాసనం అని పేరు పెట్టారు. పవన ముక్తాసనం అనేది సంస్కృత పదం. ఇది మూడు పదాల కలయిక. ఇందులో పవన్ అంటే గాలి. ముక్త అంటే ముక్తి. ఆసనం అంటే యోగాలో శరీరం యొక్క స్థానం. ఈ మూడు పదాల మొత్తాన్ని పవన ముక్తాసనం అంటారు.

ఈ ఆసనం చేసే విధానం:

నేలపై వెల్లకిలా పడుకోవాలి. మీ భుజాలు నేలపై స్ట్రెచ్ చేయాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. కాళ్ళను మెల్లగా వెనక్కు మడవాలి. పాదాలు నేలను తాకేటట్టు ఉంచాలి. తరువాత మెల్లగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోవాలి. ఈ పొజిషన్లో కింది విధంగా చేయాలి.

ప్రయోజనాలు

వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఈ ఆసనం వేయవచ్చు. కడుపు ఉబ్బరం ఉన్నవారు ఈ ఆసనం నుండి ఉపశమనం పొందుతారు. అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనంతో పొట్ట, పేగుల్లోని అదనపు గాలి బయటకు వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

యోగా చాలా ఉపయోగకరమైన వ్యాయామం. దీనివల్ల శరీరానికి, మనసుకు ఎంతో మేలు జరుగుతుంది. యోగా శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. ఈ యోగా వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే.. ప్రతి యోగా భంగిమకు ప్రత్యేక ప్రాధాన్యత, ప్రయోజనాలు ఉన్నాయి.