కండరాల ఒత్తిడిని తగ్గించే సులభమైన చిట్కాలు

కండరాలు పట్టేసినట్టుగా ఉండటం అనేది అన్ని వయసుల వారికి వచ్చే సమస్య. కండరాలలో బెణుకు కారణంగా ఒత్తిడి కారణంగా ఈ నొప్పి తరచుగా వస్తుంది. కండరాల కణజాలం దెబ్బ తినడం, వాటిలో వాపు కారణంగా కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. ఒత్తిడి కారణంగా, అనేక కారణాలవల్ల కండరాల నొప్పి మొదలవుతుంది. వ్యాయామం చేసేటప్పుడు జారడం వల్ల గానీ, నిద్రలో  గానీ, సరైన భంగిమలో కూర్చోలేకపోయినా కూడా కండరాలు పట్టేస్తుంటాయి. కాళ్ళ కండరాలు బలహీనం పడడం వల్ల పాదాలపై […]

Share:

కండరాలు పట్టేసినట్టుగా ఉండటం అనేది అన్ని వయసుల వారికి వచ్చే సమస్య. కండరాలలో బెణుకు కారణంగా ఒత్తిడి కారణంగా ఈ నొప్పి తరచుగా వస్తుంది. కండరాల కణజాలం దెబ్బ తినడం, వాటిలో వాపు కారణంగా కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. ఒత్తిడి కారణంగా, అనేక కారణాలవల్ల కండరాల నొప్పి మొదలవుతుంది. వ్యాయామం చేసేటప్పుడు జారడం వల్ల గానీ, నిద్రలో  గానీ, సరైన భంగిమలో కూర్చోలేకపోయినా కూడా కండరాలు పట్టేస్తుంటాయి. కాళ్ళ కండరాలు బలహీనం పడడం వల్ల పాదాలపై నిలబడటం కష్టమవుతుంది.  కాలి కండరాల బెణుకును తొలగించడానికి వివిధ రకాల నివారణలను అనుసరించవచ్చు. కండరాలు ఒత్తిడికి గురై నొప్పిగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

కండరాల నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. విటమిన్-డి, థైరాయిడ్ సమస్య, శరీరంలో సోడియం ఎక్కువ అవ్వడం, డీహైడ్రేషన్, స్టెరాయిడ్స్ అధికంగా తీసుకోవడం కూడా కండరాల నొప్పికి కారణం అవుతుంది.  దీనివల్ల కూర్చోవడం కూడా కష్టం అవుతుంది. కాళ్లల్లో నొప్పి, చేతుల బలహీనత వంటి సాధారణమైన సమస్యలు కూడా ఇందుకు కారణం. మీ పాదాల కండరాలలో నొప్పితో బాధపడుతున్నట్లయితే ఐస్ క్యూబ్స్ ను అప్లై చేయండి.‌ కండరాలు పట్టేసిన చోట లేదా ఒత్తిడికి గురైనట్లు అనిపించినా వెంటనే ఐస్ క్యూబ్స్ తీసుకుని ఒక కాటన్ క్లాత్ లో వేసుకుని నొప్పి ఉన్నచోట ఐస్‌క్యూబ్స్‌తో మర్దన చేస్తుంటే తక్షణ ఉపశమనం పొందవచ్చు. 

మీరు కనుక కండరాల నొప్పితో బాధపడుతుంటే వెంటనే మీ ఆహారంలో అల్లాన్ని తీసుకోవడం మొదలుపెట్టండి. అల్లంలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంకా అల్లం యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా కలిగి ఉంటుంది. ఇది కండరాల తిమ్మిరి, నొప్పి, దృఢత్వాన్ని తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.  కండరాల నొప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు మీ డైట్‌లో అల్లం యాడ్ చేసుకోండి.

రోజూ కాలికి ఆవనూనెతో మర్దనా చేయడం వలన కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.  ఆవనూనె తో పాదాల నొప్పిని తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ ఇలా మసాజ్ చేయడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు దృఢంగా తయారవుతాయి.

కండరాల నొప్పి వాపును తగ్గించాలనుకుంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల కండరాల దృఢత్వం పెరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల కాళ్లలో మొదలైన నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది. అంతేకాకుండా వాపు కూడా తగ్గుతుంది.  పడుకునే విధానం కూడా కాళ్లలో నొప్పిని కలిగిస్తుంది. మీ పాదాల కింద ఒక దిండు ఎత్తు పెట్టుకొని పడుకోవాలి.  ఇలా చేస్తే మీ కండరాల నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎక్కువగా నీటిని తాగాలి కనీసం 8 గ్లాసుల నీటిని తప్పకుండా తీసుకోవాలి. ఎప్సం సాల్ట్ వేసిన నీళ్లతో స్నానం చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.  ఆక్యుపెంచర్ లేదా మసాజ్ చేయడం వల్ల కండరాలు వదులై నొప్పి తగ్గుతుంది. 

కండరాల నొప్పులు తగ్గడానికి పాలకూర, పుచ్చకాయ, చేపలు ,అరటిపండు, సిట్రస్ పండ్లు, పసుపుతో చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కప్పింగ్ థెరపీ: 

నొప్పి , వాపు,  కండరాల ఒత్తిడితో సహా వివిధ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ థెరపీ వలన నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. కండరాలకు మెరుగైన రక్తప్రసరణ జరుగుతుంది. అలాగే శరీరంలో వచ్చే మంటను తగ్గిస్తుంది. ఫైబ్రోమయాల్జియా నుంచి బయటపడేందుకు కప్పింగ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది.