Suicide: విద్యార్థుల ఆత్మహత్యలను అరికడదాం 

ప్రపంచంలో ఉన్న కోట్ల జనంలో ఎవరో ఒకరికి ఏదో ఒక క్షణంలో ఆత్మహత్య (suicide) చేసుకోవాలి అనే ఆలోచన రావడం కామన్. ఎక్కువగా విద్యార్థుల (Students) లో ఈ మధ్య ఆత్మహత్య (suicide)లు ఎక్కువైపోతున్నాయి. అటువంటి ఆలోచనలు వచ్చినంత మాత్రాన మనిషి బలహీన పడినట్లు కాదు, నిరంతరంగా ఆలోచించడం వల్ల, అనవసరమైన ఆలోచనలు కారణంగా, మనిషి ఆలోచన విధానం పక్కదారి పట్టి ఆత్మహత్య (suicide) అనే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు మాకే ఎందుకు […]

Share:

ప్రపంచంలో ఉన్న కోట్ల జనంలో ఎవరో ఒకరికి ఏదో ఒక క్షణంలో ఆత్మహత్య (suicide) చేసుకోవాలి అనే ఆలోచన రావడం కామన్. ఎక్కువగా విద్యార్థుల (Students) లో ఈ మధ్య ఆత్మహత్య (suicide)లు ఎక్కువైపోతున్నాయి. అటువంటి ఆలోచనలు వచ్చినంత మాత్రాన మనిషి బలహీన పడినట్లు కాదు, నిరంతరంగా ఆలోచించడం వల్ల, అనవసరమైన ఆలోచనలు కారణంగా, మనిషి ఆలోచన విధానం పక్కదారి పట్టి ఆత్మహత్య (suicide) అనే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు మాకే ఎందుకు వస్తున్నాయి అని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఇటువంటి ఆలోచనలు చేయడం సహజం. కానీ ఇటువంటి ఆలోచనలు మరింత ముందుకు వెళ్లకుండా చూసుకోవాలి. అయితే ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇటువంటి ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి? ఈరోజు తెలుసుకుందాం.. 

మాట్లాడాలి: 

రోజువారి చదువులు (Studies) ఒత్తిడి (Stress) కారణంగా, మీకు ఇటువంటి ఆత్మహత్య (suicide) చేసుకోవాలి అని ఆలోచనలు వచ్చినప్పుడు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను ఆశ్రయించడం మంచిది. మీకు బాగా కావాల్సిన వారిని, మీరు నమ్మిన వారిని సంప్రదించి మీకు వస్తున్న ఆలోచనల గురించి మాట్లాడండి. ఒకవేళ మీరు ఎవరుని సంప్రదించాలో తెలియని క్రమంలో, కౌన్సెలర్ ను సంప్రదించడం ఎంతో మొత్తం. వారు దయతో వింటారు.. సలహా ఇస్తారు. అదేవిధంగా పెద్దవాళ్లు కూడా తరచుగా పిల్లల (Students)తో మాట్లాడుతూ గడపడం మంచిది.

మంచి ప్లేస్ కి వెళ్ళండి: 

కంబైన్డ్ స్టడీస్ చేయడానికి స్నేహితుని ఇల్లకి, లైబ్రరీ లేదా ఇతర పబ్లిక్ ఏరియా వంటి సురక్షితమైన, సంతోషకరమైన ప్రదేశం ఆత్మహత్య (suicide) ఆలోచనలను నిరోధించడంలో సహాయపడుతుంది. తల్లిదండ్రులతో కలిసి పిక్నిక్ ప్లేసులకు వెళ్లడం వంటివి చేయడం ఉత్తమం.

ప్రేరేపించే వస్తువులకు దూరంగా ఉండండి: 

కత్తులకు, తుపాకులు మరియు ఇతర ఆత్మహత్య (suicide) విషయాలకు ఎంతవరకు దూరంగా ఉంటే అంత ఉత్తమం. అంతేకాకుండా ఎక్కువగా మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయాన్ని గడపడానికి చూడండి. ఒంటరిగా ఉండడాన్ని నిరోధించండి. ఒకవేళ మీరు ఏదైనా మెడిసిన్ వాడుతున్నట్లయితే, వాటిని క్రమం తప్పకుండా వాడేందుకు చూడండి.

కొన్ని ప్రణాళికలు వేసుకోండి: 

మీకు మీరుగా ఆత్మహత్య (suicide) చేసుకోవాలి అని అటువంటి ఆలోచనల నుంచి బయటికి రావాలని పదేపదే అనుకోండి. అటువంటి ఆలోచనల నుంచి పక్కదారి పట్టించే మరెన్నో విషయాలు ఉన్నాయని గ్రహించండి. ముఖ్యంగా చెప్పాలంటే, మీరు ఒక పెంపుడు జంతువుని పెంచుకుంటూ.. దానితో సమయం గడపొచ్చు. శ్వాసను అనుసరిస్తూ ప్రశాంతంగా మారొచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మీ ఒత్తిడి (Stress)ని దూరం చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు చదువుకోవాలి (Studies), ఎప్పుడు ఏం చేయాలనే ప్రణాళిక తప్పకుండా వేసుకోవాలి.. దీనివల్ల సగటు విద్యార్థి (Students)కి ఒత్తిడి (Stress) తగ్గుతుంది.

విరామం: 

జీవితం (Life)లో విరామం అనేది చాలా అవసరం. చదువుకునే (Studies) సమయాలలో ఎక్కువగా ఒత్తిడి (Stress)కి గురవుతున్నప్పుడు విరామం తప్పనిసరి. ఇలా విరామం తీసుకుంటూ చదవడం (Studies) వల్ల, మనం బాగా చదవగలుగుతాం (Studies). అదే విధంగా పరీక్షల ముందు ఒత్తిడి (Stress) అనేది ఉండదు. అదేవిధంగా విరామం తీసుకోవడానికి మీకు ఇష్టమైన ఆహారం ఆస్వాదించడం, సంగీతం వినడం లేదా వాకింగ్ కి వెళ్లడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల  ప్రశాంతంగా మారడమే కాకుండా, తక్కువ ఆందోళన చెందుతారు.

టీచర్లు అవగాహన కల్పించాలి: 

ముఖ్యంగా చాలామంది తమ స్కూళ్లలో చదువుతున్న (Studies) రోజుల్లోనే ఎక్కువ ఒత్తిడి (Stress)కి గురవుతూ ఉంటారు. అటువంటి పిల్లల (Students)ను టీచర్లు గమనించి వారికి తగిన శిక్షణ అందించాలి. అదేవిధంగా చదువు (Studies) గురించి, జీవితం (Life) గురించిన పాఠాలను నేర్పించాలి. ఆత్మహత్య (suicide) ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనే దాని గురించి అవగాహనకు సంబంధించి క్లాసులు కండక్ట్ చేస్తూ ఉండాలి. స్కూలు వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడం ద్వారా కూడా చాలామంది పిల్లల (Students)ు ఒత్తిడి (Stress)కి గురవకుండా ఉంటారు.