Heart attack: పరుగు పెడుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

ఇటీవల చాలా సందర్భాలలో మారథాన్ (marathon) లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు 50 మీటర్ల పరువు లో పాల్గొని అకస్మాత్తుగా గుండెపోటు (Heart attack)తో కుప్పకూలడం జరిగింది. అయితే హఠాత్తుగా సంభవించిన ఈ పరిణామానికి కారణం ఎక్కువ సేపు పరిగెట్టడం అంటూ డాక్టర్లు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతోంది. ఎక్కువ సేపు పరిగెట్టడం కూడా గుండెపోటు (Heart attack)కు కారణం అంటున్నారు నిపుణులు. అయితే ఇలా జరగకుండా ఉండాలి అంటే గమనించాల్సిన సంకేతాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు (Precautions) […]

Share:

ఇటీవల చాలా సందర్భాలలో మారథాన్ (marathon) లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు 50 మీటర్ల పరువు లో పాల్గొని అకస్మాత్తుగా గుండెపోటు (Heart attack)తో కుప్పకూలడం జరిగింది. అయితే హఠాత్తుగా సంభవించిన ఈ పరిణామానికి కారణం ఎక్కువ సేపు పరిగెట్టడం అంటూ డాక్టర్లు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతోంది. ఎక్కువ సేపు పరిగెట్టడం కూడా గుండెపోటు (Heart attack)కు కారణం అంటున్నారు నిపుణులు. అయితే ఇలా జరగకుండా ఉండాలి అంటే గమనించాల్సిన సంకేతాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు (Precautions) ఏమిటో తెలుసుకుందాం.. 

లేకుంటే గుండెకు దెబ్బ అంటున్నారు నిపుణులు: 

గుండెపోటు (Heart attack)కు సంబంధించిన కేసులు రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం ముఖ్యంగా గుండె పోటు (Heart attack)కు ముఖ్య కారణం అయినప్పటికీ మరిన్ని కారణాల వల్ల కూడా గుండెపోటు (Heart attack) వచ్చే అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్లు. 

కార్డియోవాస్కులర్ సమస్యలు: గుండెపోటు (Heart attack) లేదా అరిథ్మియా వంటి ఆకస్మిక కార్డియాక్ సంఘటనలు, సగటు మనిషి పరుగు (Run) పెడుతున్న సమయంలో లేదా తర్వాత సంభవించవచ్చు, ముఖ్యంగా గుండె (Heart) జబ్బులు ఉన్నవారిలో లేదా జెనిటికల్గా ఫ్యామిలీ లో ఉన్న ఇష్యూ వల్ల కూడా అవ్వచ్చు.

వేడి-సంబంధిత అనారోగ్యాలు: ముఖ్యంగా మనిషి ఉన్న వాతావరణం కూడా గుండెపోటు (Heart attack) రావడానికి గల కారణం కావచ్చు. ముఖ్యంగా శరీరం (Body)లో సరైన మోతాదులో నీళ్లు (Water) లేకపోవడం వల్ల, బాడీ డిహైడ్రేట్ అయ్యి, నడుస్తున్నప్పుడు ఎక్కువగా వేడి వాతావరణం ఏర్పడడం వల్ల కూడా, గుండెపోటు (Heart attack) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అధిక శ్రమ: శరీరాన్ని ఒక్కసారిగా ఒత్తిడిలోకి తీసుకొని వెళ్లడం, ముఖ్యంగా తగిన శిక్షణ లేకుండా, అలసట, అదే విధంగా శరీరానికి అధిక శ్రమ కలిగిన సందర్భాల్లో, అవయవ వైఫల్యానికి దారితీస్తుంది.

ఆరోగ్య పరిస్థితులు తీవ్రతరం అవ్వడం: ఉబ్బసం, మధుమేహం, కొన్ని కండరాల సమస్యలు వంటి ముందుగా ఉన్న వ్యక్తులు పరిగెత్తేటప్పుడు వారి పరిస్థితులను సరిగ్గా నిర్వహించకపోతే, ప్రమాదంలో పడే అవకాశం చాలా ఉంటుంది.

ప్రమాదాలు-గాయాలు: ఎత్తు పల్లాలు ఉన్న రోడ్డుమీద లేదా ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో రన్నర్‌లు పడిపోవడం, ఢీకొనడం లేదా ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి సమయాల్లో కూడా గుండె (Heart)కు సంబంధించి ప్రమాదాలు సంభవించే అవకాశం లేకపోలేదు.

ఎక్కువసేపు పరుగు పెడుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: 

మీ శరీరం (Body)పై శ్రద్ధ వహించండి: మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా శిక్షణ చేస్తున్నప్పుడు తలనొప్పి, ఎగువ శరీర అసౌకర్యం, శ్వాసలోపం లేదా ఛాతీ నొప్పి వంటి సంకేతాలు చూసినట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించడం ఎంతో ఉత్తమం.

మీ కుటుంబ చరిత్ర: మీ కుటుంబంలో అనుకోని గుండె (Heart) సంబంధిత మరణాలు సంభవించినట్లయితే, దాని గురించి తెలుసుకోండి, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. 

కొలెస్ట్రాల్:  శరీరం (Body)లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆరోగ్యకరమైన (Health) లిమిట్స్ లో ఉంచుకోవడం ఎంతో మంచిది. మీ కరోనరీలను స్పష్టంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. 

వార్మ్-అప్, కూల్-డౌన్: పరిగెత్తడానికి కన్నా ముందు వార్మ్-అప్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ శరీరాన్ని శారీరక శ్రమకు సిద్ధం చేస్తుంది. అదేవిధంగా పరిగెడుతున్నప్పుడు మీ హార్ట్ బీట్ రేట్ గమనిస్తూ ఉండండి.

హైడ్రేటెడ్ గా ఉండండి: మీ పరుగు (Run)కు ముందు, పరిగెడుతున్న సమయంలో అదే విధంగా తర్వాత కూడా, తగినంత నీరు (Water) త్రాగాలని నిర్ధారించుకోండి.

గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.