జుట్టు సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెయిర్‌కి ఆయిల్ పెట్టుకోవడం అనేది జుట్టు సంరక్షణ దినచర్యలో అంతర్భాగం. ఇది జుట్టు ఆరోగ్యం, షైన్, తేమను అలాగే ఉంచడానికి సహాయపడుతుంది. తలకు, జుట్టుకు నూనెను రాసుకుని లోతైన మసాజ్ చేయడం ద్వారా జుట్టు కుదుళ్లు, స్కాల్ప్‌లోకి ఆయిల్ చేరుతుంది.  నేటి రోజుల్లో చాలా మంది యువత జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. మార్కెట్లో లభించే ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా కానీ సరైన రిజల్ట్ ఉండడం లేదంటూ వాపోతున్నారు. హెయిర్‌కి ఆయిల్ పెట్టుకోవడం అనేది జుట్టు సంరక్షణ దినచర్యలో […]

Share:

హెయిర్‌కి ఆయిల్ పెట్టుకోవడం అనేది జుట్టు సంరక్షణ దినచర్యలో అంతర్భాగం. ఇది జుట్టు ఆరోగ్యం, షైన్, తేమను అలాగే ఉంచడానికి సహాయపడుతుంది. తలకు, జుట్టుకు నూనెను రాసుకుని లోతైన మసాజ్ చేయడం ద్వారా జుట్టు కుదుళ్లు, స్కాల్ప్‌లోకి ఆయిల్ చేరుతుంది. 

నేటి రోజుల్లో చాలా మంది యువత జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. మార్కెట్లో లభించే ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా కానీ సరైన రిజల్ట్ ఉండడం లేదంటూ వాపోతున్నారు. హెయిర్‌కి ఆయిల్ పెట్టుకోవడం అనేది జుట్టు సంరక్షణ దినచర్యలో అంతర్భాగం. ఇది జుట్టు ఆరోగ్యం, షైన్, తేమను అలాగే ఉంచడానికి సహాయపడుతుంది. తలకు, జుట్టుకు నూనెను రాసుకుని లోతైన మసాజ్ చేయడం ద్వారా జుట్టు కుదుళ్లు, స్కాల్ప్‌లోకి ఆయిల్ చేరుతుంది. జుట్టుకు సమయానికి నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారి విరిగిపోతుంది. కావున మనం ఎంత విశ్రాంతి లేకుండా పని చేస్తున్నా కానీ ఆయిల్ రాయాలి. నేటి రోజుల్లో ఇండియాలో ఉన్న అనేక మందిలో, ఏదైనా చర్మ సమస్యతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుకుంటూ పోతుంది. జట్టు సంరక్షణ సరిగ్గా చేయకపోతే మాత్రం నష్టపోవాల్సి వచ్చేది. వాస్తవానికి, జుట్టు పొడిబారడం, చుండ్రు మరియు ఇతర సమస్యల నుండి రక్షించడంలో నూనె సహాయపడుతుంది. కావున జట్టు సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. 

సరైన హెయిర్ ఆయిల్ ఎంచుకోవడం

మీ జుట్టుకు ఎలాంటి హెయిర్ ఆయిల్ ఎంచుకోవడం అనేది మీ జుట్టు రకంపై ఆధారపడి ఉంటుంది. పొడిగా, జిడ్డుగా ఇలా జుట్టు రకాన్ని బట్టి  మీరు తగిన హెయిర్ ఆయిల్‌ని ఎంచుకోవాలి. ఇందుకోసం కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్ నూనె, బాదం నూనె వంటి అనేక ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నూనెలలో ప్రతి ఒక్కటి విభిన్న ప్రయోజనాలు, లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి మీ జుట్టుకు సరైనదాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. కొబ్బరి నూనె స్కాల్ప్ మాయిశ్చరైజింగ్, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో అద్భుతమైనది. అయితే ఆముదం జుట్టు ఒత్తుగా రావడానికి ఉపయోగపడుతుంది, అదే విధంగా జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. మన జట్టు మీద హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత సన్నీళ్లతో స్నానం చేయాలి. వేడి నీటి స్నానాన్ని ఇగ్నోర్ చేయాలి. 

జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం ఎలా?

జుట్టుకు నూనె రాసుకోవడానికి ఉత్తమ సమయం రాత్రి అని నిపుణులు చెబుతున్నారు. హెయిర్ ఆయిలింగ్ ప్రక్రియ చాలా సులభం.ముందుగా జుట్టులో ఎలాంటి దుమ్ము లేకుండా శుభ్రపరుచుకోవాలి. తర్వాత మీ జుట్టును భాగాలుగా విభజించి నూనెను మీ మాడుకి, జుట్టుకు సమానంగా పూయాలి. అనంతరం రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరిచేందుకు, జుట్టు పెరుగుదల కోసం నూనెతో కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి. చివరగా మీరు మీ జుట్టును టవల్ లేదా షవర్ క్యాప్‌లో చుట్టి రాత్రంతా అలా వదిలివేయాలి. ఉదయం ఎప్పటిలాగే మీ జుట్టును కడుక్కోవాలి.

హెయిర్ ఆయిలింగ్ సమయంలో ఏం చేయకూడదు

ఉత్తమ ఫలితాల కోసం సాధారణంగా వారానికి ఒకసారి హెయిర్ ఆయిలింగ్ తప్పకుండా చేసుకోవాలి. అయితే ఎక్కువ నూనెను ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇది జుట్టు, మాడు జిడ్డుగా మారడానికి దారితీస్తుంది. 

చివరగా హెయిర్ ఆయిల్ అనేది మీ జుట్టును ఆరోగ్యంగా, అందంగా ఉంచడానికి సులభమైన, ప్రభావవంతమైన మార్గం. సరైన నూనెను ఎంచుకోవడం, సరైన విధంగా మసాజ్ చేసుకోవడం ద్వారా అందమైన, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు.