పాలిచ్చే త‌ల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. ఈ పాలలో విటమిన్లు, మినరల్స్‌, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు.. వంటి ఎన్నో పోషకాలతో పాటు చిన్నారి శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా పుష్కలంగా లభిస్తాయి.  అయితే పాలిచ్చే తల్లులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎలాంటి ఆహారాలు తినకూడదో తెలుసుకుందాం.  బిడ్డకు పాలిచ్చే తల్లులు తాము తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భం దాల్చిన నుండి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఎలాగైతే కొన్ని […]

Share:

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. ఈ పాలలో విటమిన్లు, మినరల్స్‌, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు.. వంటి ఎన్నో పోషకాలతో పాటు చిన్నారి శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా పుష్కలంగా లభిస్తాయి.  అయితే పాలిచ్చే తల్లులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎలాంటి ఆహారాలు తినకూడదో తెలుసుకుందాం. 

బిడ్డకు పాలిచ్చే తల్లులు తాము తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భం దాల్చిన నుండి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఎలాగైతే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలో, బిడ్డకు పాలు ఇచ్చే సమయంలోనూ తల్లి కొన్ని ఆహారాలు తీసుకోకూడదు. ఎందుకంటే తల్లి ఏ ఆహారం అయితే తీసుకుంటుందో, అదే ఆహారం బిడ్డకు పాల రూపంలో చేరుతుంది. కాబట్టి సరైన  పోషకాహారం తీసుకుంటే మంచి పోషకాలు బిడ్డకు అందుతాయి. తల్లి తీసుకున్న ఆహారంలో ఏవైనా అలెర్జీ కారకాలు, హానికర సమ్మేళనాలు ఉంటే, పాలు ఇచ్చినపుడు అవి బిడ్డకూ చేరతాయి. అది బిడ్డ ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేయవచ్చు. కాబట్టి తల్లులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటమే మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

 తల్లి తినకూడని కొన్ని ఆహారాలు... 

బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడు.. క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, బ్రోకలీ వంటి పచ్చి కూరగాయలను తీసుకోవడం వల్ల తల్లి ప్రేగులో గ్యాస్ ఏర్పడే ప్రమాదం ఉంది. దీని కారణంగా తల్లికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది కనుక ఇవి తినకుండా జాగ్రత్త పదండి 

చాల  మందికి, ఉదయం, సాయంత్రం కాఫీ తీసుకోవడం ఇష్టం. కానీ, డెలివరీ అయ్యాక కొన్ని నెలల పాటు కాఫీ తాగకపోవడమే మంచిది. పాలిచ్చే తల్లులు ఒకటి, రెండు సార్లు కాఫీ తాగొచ్చు. అంతకు మించి తాగొద్దు. దీని వల్ల అజీర్ణ సమస్యలు వస్తాయి. ఇది వారిలో చిరాకు, అశాంతికి కారణం అవుతుంది. నిద్ర లేకుండా చేస్తుంది. అధిక కెఫీన్ తీసుకోవడం వల్ల తల్లీ బిడ్డల్లో డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. తల్లిపాలు ఇస్తున్నప్పుడు కాఫీ, టీలు, ఎనర్జీ డ్రింక్స్ వంటివి తాగడం మానేయాలి. వీటి బదులుగా పండ్ల రసాలను, నీళ్లను తాగడం మంచిది. కొబ్బరి నీళ్ళు తాగితే ఇంకా మేలు.

వెల్లుల్లి తింటే పాలు బాగా ప‌డ‌తాయ‌ని పెద్ద‌లు చెబుతుంటారు.ఈ క్ర‌మంలోనే పాలిచ్చే త‌ల్లుల‌కు వెల్లుల్లి పెడుతుంటారు.కానీ, త‌ల్లులు వెల్లుల్లి తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే అల్లిసిన్ అనే కంటెంట్ పాల వాస‌న‌ను మార్చేస్తుంది.అలా వాసన వచ్చే పాలను పిల్లలు తాగేందుకు నిరాక‌రిస్తుంటారు.అందుకే త‌ల్లులు వెల్లుల్లికి దూరంగా ఉండ‌టం మంచిది

చేపలను కూడా తక్కువగా తింటే మంచిది. ఎందుకంటే చేపల్లో పాదరసం స్థాయిలు ఎక్కువవుతున్నాయి. పాదరసం అనేది మానవ ఆరోగ్యానికి హానికరమైన ఒక విషపూరిత లోహం. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు పాదరసం అధికంగా చేపలను తినకూడదు. సముద్రం, నదులు కలుషితం అయిపోయి… పాదరసం అధికంగా చేరుతుంది. ఆ పాదరసం చేపల్లోకి ఇంకిపోతుంది. ఈ పాదరసం శరీరంలో  చేరితే నాడీ వ్యవస్థ, మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం తప్పదు. ఆరోగ్యకరమైన ఆహారం కోసం సాల్మన్, తిలాపియా, రొయ్యలు వంటివి తినడం ఉత్తమం. వీటిలో పాదరసం చాలా తక్కువగా ఉంటుంది.

పాలిచ్చే తల్లలు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ మీ మిల్క్ ఎజెక్షన్‌ను నిరోధిస్తుంది. ఇది పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఆల్కహాల్‌ తాగడం వల్ల పిల్లలు పాలు తాగడం 20 నుంచి 23 శాతం తగ్గుతుంది. పాపాయి నిద్ర భంగం, చికాకు కలుగుతుంది అని వివరించారు  చాక్లెట్లు, బిస్కట్లు, స్వీట్లు, కూల్‌ డ్రింక్స్‌ మొదలైన వాటిని బాగా తగ్గించాలి. ఎందుకంటే వీటిలో ఉండే కెఫీన్, చక్కెరలు తల్లుల్లో పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి.

పాలిచ్చే త‌ల్లులు ఆహారం విష‌యంలో అనేక నియ‌మాలు పాటించాల్సి ఉంటుంది.లేదంటే త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రూ ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంది.అందుకే పాలిచ్చే త‌ల్లులు స‌రైన ఫుడ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది