వివాహానికి ముందు కౌన్సెలింగ్: వైవాహిక జీవితాన్ని ప్రారంభించడంలో మీకు సహాయపడే విషయాలు

మీకు, మీ భాగస్వామి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన సంబంధానికి బలమైన పునాదిని నిర్మించడంలో సహాయపడే విషయాలేమిటో చూడండి. చాలా మందికి తమ జీవితాల్లో పెళ్ళి ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది ఎంతో ఆనందకరమైన, సంతోషకరమైన సమయం అయినప్పటికీ, ఇది ఎంతో ఒత్తిడిని కలిగించేది, జీవితంలో పెనుమార్పు కలిగించే కాలం కూడా కావచ్చు. జంటలు పెళ్ళిలోని సవాళ్లను అధిగమించడంలో, బలమైన పునాదిపై కలిసి  జీవితాలను ప్రారంభించడంలో సహాయపడటానికి, చాలా మంది నిపుణులు వివాహానికి ముందు కౌన్సెలింగ్‌ తీసుకోమని సిఫార్సు […]

Share:

మీకు, మీ భాగస్వామి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన సంబంధానికి బలమైన పునాదిని నిర్మించడంలో సహాయపడే విషయాలేమిటో చూడండి.

చాలా మందికి తమ జీవితాల్లో పెళ్ళి ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది ఎంతో ఆనందకరమైన, సంతోషకరమైన సమయం అయినప్పటికీ, ఇది ఎంతో ఒత్తిడిని కలిగించేది, జీవితంలో పెనుమార్పు కలిగించే కాలం కూడా కావచ్చు. జంటలు పెళ్ళిలోని సవాళ్లను అధిగమించడంలో, బలమైన పునాదిపై కలిసి  జీవితాలను ప్రారంభించడంలో సహాయపడటానికి, చాలా మంది నిపుణులు వివాహానికి ముందు కౌన్సెలింగ్‌ తీసుకోమని సిఫార్సు చేస్తున్నారు. మీరు వివాహానికి ముందు కౌన్సెలింగ్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా లేదా, అది మీకు, మీ భాగస్వామికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోవాలనుకున్నా, ఈ కథనం మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడటానికి అవసరమయ్యే విలువైన సమాచారాన్ని అందిస్తుంది. వివాహానికి ముందు కౌన్సెలింగ్ విషయంలో వైవాహిక జీవితాన్ని బలంగా ప్రారంభించడంలో సహాయపడే ఐదు విషయాలేమిటో చూద్దాం. 

“ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ మీకు మీ భాగస్వామి యొక్క వ్యక్తిత్వం, విలువలు, కమ్యూనికేషన్ స్టైల్‌లపై లోతైన అవగాహనను ఇస్తుంది, పెళ్ళి వల్ల కలిగే మార్పులను, సంబంధాలలో కలిగే మార్పులను నావిగేట్ చేసే సాధనాలతో మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది” అని రిలేషన్ షిప్ కౌన్సెలర్, మ్యారేజ్ థెరపిస్టులు చెబుతుంటారు. 

మ్యారేజ్ థెరపిస్టులు తెలిపిన 5 ముఖ్య సలహాలు

1. పెళ్లి రోజును మాత్రమే కాదు. మీ వివాహాన్ని కూడా చక్కగా ప్లాన్ చేసుకోండి.

పెళ్ళి మీ సంబంధానికి కొత్త సవాళ్లను తెస్తుంది. సెక్స్, పిల్లలు, ఆర్థిక విషయాల విషయానికి వస్తే మీరు పెళ్లి చేసుకునే వ్యక్తితో అన్ని విషయాలలోనూ సమానంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

2. పెళ్ళి పట్ల మీకున్న అభిప్రాయాలు, అంచనాలేమిటో తెలుసుకోండి

చాలా మంది తల్లిదండ్రుల మధ్యనుండే సంబంధాలను బట్టి, పెళ్లి పట్ల కొన్ని అభిప్రాయాలను, కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. మీ భాగస్వామి అభిప్రాయాలు మీ అభిప్రాయాలతో సరిపోతాయా, లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి.

3. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోండి

మీకు కొత్తగా పెళ్ళయ్యి ఉంటే, పెద్ద పెద్ద గొడవలు, సమస్యలు సంఘర్షణలు ఏమీ జరగకపోయి ఉండవచ్చు. అభిప్రాయ భేదాలు రాకపోయి ఉండవచ్చు. కానీ ప్రతి ఇద్దరి మధ్యా ఏవో ఒక అభిప్రాయ భేదాలు రావడం సహజమే. ఎంతటి గొడవనైనా మన మాటతీరుతో, నేర్పుతో ఒక కొలిక్కి తేవచ్చు.

4. మీ రిలేషన్షిప్ డైనమిక్స్ ను పరిశీలించండి

ఏవైనా సమస్యలు లేదా సంఘర్షణలు తలెత్తే ముందు మీ సంబంధంలో స్పష్టమైన హద్దులు, ఆరోగ్యకరమైన నియమాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.

5. మీ భాగస్వామి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి

ఒకరినొకరు బాగా తెలుసుకోవడం మీ వైవాహిక జీవితంలో సంఘర్షణలను తగ్గించడానికి కీలకం. వివాహానికి ముందు కౌన్సెలింగ్ తీసుకోవడం సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. దీని సహాయంతో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, చక్కని వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడానికి సహాయపడుతుంది. 

చివరగా.. వివాహానికి ముందు కౌన్సెలింగ్ తీసుకోవడం జీవితకాలం పాటు కొనసాగే బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచడంలో సహాయపడే అనేక రకాల సాధనాలను, దృక్పథాలను అందిస్తుంది. కమ్యూనికేషన్, సంఘర్షణ పరిష్కారం, భాగస్వామ్య విలువల వంటి సమస్యలను అన్వేషించడం ద్వారా ఒకరినొకరు, వైవాహిక జీవితంలో వారు ఎదుర్కొనే సవాళ్ల గురించి లోతైన అవగాహన పొందవచ్చు.