ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ బ్యాంకులు గృహ ఋణ వడ్డీ రేట్లపై మహిళలకు రాయితీలు అందిస్తున్నాయి

ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ బ్యాంకులు గృహ ఋణ వడ్డీ రేట్లపై మహిళలకు రాయితీలు అందిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ విధానాల ప్రకారం.. హోమ్ లోన్ తీసుకునే ఆడవాళ్లు.. స్టాంప్ డ్యూటీపై 1 శాతం నుండి 2 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ విధంగా, రూ. 50 లక్షల విలువైన ఆస్తిపై, దాదాపు రూ. 50,000 – రూ. 1,00,000 ఆదా చేయవచ్చు.  మహిళలు హోమ్ లోన్ […]

Share:

ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ బ్యాంకులు గృహ ఋణ వడ్డీ రేట్లపై మహిళలకు రాయితీలు అందిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ విధానాల ప్రకారం.. హోమ్ లోన్ తీసుకునే ఆడవాళ్లు.. స్టాంప్ డ్యూటీపై 1 శాతం నుండి 2 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ విధంగా, రూ. 50 లక్షల విలువైన ఆస్తిపై, దాదాపు రూ. 50,000 – రూ. 1,00,000 ఆదా చేయవచ్చు. 

మహిళలు హోమ్ లోన్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు: 

ఆస్తిని సొంతం చేసుకోవడం భద్రతను మాత్రమే కాదు, దీర్ఘకాలిక విలువను సృష్టించే పెట్టుబడులలో ఒకటిగా కూడా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్‌లో సాధారణంగా పురుషులే పెట్టుబడి పెడతారు. ఇటీవలి కాలంలో మహిళలు ఆస్తులపై పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటున్నారు. అయితే.. దాని కోసం డబ్బు ఏర్పాటు చేయడం అంత సులువేమీ కాదు. ఇటువంటప్పుడే హోమ్ లోన్ తీసుకుంటారు. అందువల్ల.. వివిధ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (NBFIలు), తనఖా ఋణదాతలు.. హోమ్ లోన్ తీసుకొనే మహిళలకు పోటీ పడి మరీ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, హోమ్ లోన్ తీసుకునే మహిళలకు స్టాంప్ డ్యూటీపై ఒక శాతం నుండి రెండు శాతం వరకు తగ్గింపు వస్తుంది. 

హోమ్ లోన్ తీసుకొనే మహిళలకు రాయితీలు అందించే బ్యాంకులు

SBI వెబ్‌సైట్ లో.. హోమ్ లోన్ తీసుకొనే మహిళలకు 5 బేసిస్ పాయింట్ల రాయితీని అందిస్తుంది. క్రెడిట్ స్కోర్ ను బట్టి మహిళలకు వడ్డీ రేటు 9.15 నుండి 10.15% వరకు ఉంటుంది.

HDFC హెచ్‌డిఎఫ్‌సి కూడా హోమ్ లోన్ తీసుకొనే మహిళలకు 5 బేసిస్ పాయింట్ల తగ్గింపునిస్తుంది. హోమ్ లోన్ తీసుకొనే మహిళలకు వడ్డీ రేటు 8.95% నుండి ప్రారంభమవుతుంది. క్రెడిట్ స్కోర్, లోన్ అమౌంట్ ని బట్టి 9.85% వరకు ఉండవచ్చు.

హోమ్ లోన్ తీసుకొనే మహిళలకు, 5 బేసిస్ పాయింట్లకు రాయితీ లభిస్తుంది. కెనరా బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.85% నుండి ప్రారంభమవుతాయి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ తీసుకొనే మహిళలకు 5 బేసిస్ పాయింట్ల రాయితీని ఇస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్ లో ఇలా ఉంది, “యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటులో 0.05% రాయితీని అందిస్తోంది, హోమ్ లోన్ తీసుకొనే మహిళలు అంటే కో అప్లికెంట్స్ లేదా డైరెక్ట్ అప్లికెంట్స్ కి ఈ అవకాశం ఉంటుంది”

పంజాబ్ నేషనల్ బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేక రకాల హౌసింగ్ లోన్‌లను అందజేస్తుంది. ఇది మహిళలకు, జీతభత్యాల స్త్రీలకు, వ్యాపారవేత్తలకు లేదా గృహిణులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకాలు క్రింది లక్షణాలను కలిగి ఉన్నాయి. హోమ్ లోన్ తీసుకొనే మహిళలకు ఏడాదికి వడ్డీ రేటు 0.05% తక్కువ ఉంటుంది, గృహోపకరణాల ఖర్చు గరిష్టంగా రూ.25 లక్షల వరకు, హౌసింగ్ లోన్‌లో 10% వరకు చేర్చబడవచ్చు. అడ్వాన్స్ తేదీ నుండి లేదా స్వాధీనం చేసుకున్న తేదీ వరకు.. 3 నెలల వరకు మారటోరియం, ఏది ముందుగా ఉంటే అది.

లోన్ తీసుకునే మహిళలకు కలిగే ఇతర ప్రయోజనాలు

మహిళలకు స్టాంపు డ్యూటీ తక్కువ 

స్టాంప్ డ్యూటీ అనేది ఆస్తి ధరను పెంచే అదనపు ఖర్చు. ఆడవాళ్ళు ఆస్తులు కొనేలా ప్రోత్సహించడానికి ఎన్నో రాష్ట్రాలలో స్టాంప్ డ్యూటీలో 1% నుండి 2% తగ్గింపును ఇస్తున్నాయి. దీనివల్ల ఎంతో డబ్బు ఆదా అవుతుంది.

పన్ను ప్రయోజనాలు

మహిళలకు హోమ్ లోన్ పేమెంట్ విషయంలో ప్రత్యేక పన్ను మినహాయింపులు లభించవు. అసలు రీపేమెంట్, వడ్డీ చెల్లింపులకు, గరిష్టంగా రూ. 1.5 లక్షలు, రూ. 2 లక్షలు పన్ను మినహాయింపు ఉంటుంది. భార్యా భర్తలు ఉమ్మడిగా ఆస్తిని కలిగి ఉండి, వేర్వేరు ఆదాయ వనరులు ఉంటే ఇద్దరూ పన్ను మినహాయింపులకు అర్హులే.