30 సంవత్సరాలకే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా..!

ఇప్పుడున్న కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడం చాలా మంది యువత కోరుకునేది. చాలామంది 30 సంవత్సరాల వయసులోనే తమ రిటైర్మెంట్ గురించి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ అయిన తర్వాత మన దగ్గర ఎంత మొత్తంలో డబ్బు ఉండాలి, మనం ఎటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ ప్లాన్స్ వంటివి తీసుకోవాలి, మనం ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, రిటైర్మెంట్ సమయానికి మన చేతిలో ఎంత ఉండాలి. ఇలాంటి విషయాలు మీద క్లారిటీ రావాలంటే ఒక్కసారి ఈ […]

Share:

ఇప్పుడున్న కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడం చాలా మంది యువత కోరుకునేది. చాలామంది 30 సంవత్సరాల వయసులోనే తమ రిటైర్మెంట్ గురించి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ అయిన తర్వాత మన దగ్గర ఎంత మొత్తంలో డబ్బు ఉండాలి, మనం ఎటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ ప్లాన్స్ వంటివి తీసుకోవాలి, మనం ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, రిటైర్మెంట్ సమయానికి మన చేతిలో ఎంత ఉండాలి. ఇలాంటి విషయాలు మీద క్లారిటీ రావాలంటే ఒక్కసారి ఈ ఆర్టికల్ చదివేయాల్సిందే.. 

రిటైర్మెంట్ సమయానికి ఎంత మొత్తంలో డబ్బులు ఉండాలి: 

ఇప్పుడు ఇంకా మాకు 30 సంవత్సరాలే కదా ఇంకో పది సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించొచ్చు, అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఇప్పటినుంచే రిటైర్మెంట్ కి సంబంధించిన కొన్ని ఆలోచనలు చేయడం ద్వారా, రిటైర్మెంట్ సమయానికి మనకి ఒత్తిడి లేకుండా, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో మనం సంపాదించగలుగుతాం. అదేవిధంగా సంతోషంగా జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ఇప్పుడున్న కాలంలో మన ఖర్చులు సాదాగా ఉన్నప్పటికీ, ఫ్యూచర్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ప్రతి సంవత్సరం రేట్లు ఎక్కువ అవుతూనే ఉన్నాయి కాబట్టి, వాటిని దృష్టిలో ఉంచుకొని మనం ఎంతవరకు సంపాదించాలి అని అంచనా వేయాలి. అయితే సగటు మనిషి తమ రిటైర్మెంట్ అయ్యే సమయానికి తమ చేతుల్లో 65 లక్షలు అనేది కచ్చితంగా ఉండాలి అని నియమం పెట్టుకోగలగాలి. ఎందుకంటే పెరుగుతున్న ధరలు, హెల్త్ కు సంబంధించిన ఖర్చులు, ఫ్యామిలీకి సంబంధించి కొంత మొత్తం.. ఇలా చూసుకుంటే సగటు మనిషి రిటైర్మెంట్ సమయానికి 65 లక్షలు తప్పనిసరిగా ఉండాలి. 

20X రూల్: 

ముఖ్యంగా, ఈ రూల్ కు సంబంధించిన ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, తప్పనిసరిగా మనం ప్రస్తుతం ఉన్న జీవితంలో మనం ఎంత అయితే ఖర్చు పెడుతున్నామో, దానికి 20 రెట్లు మనం సేవింగ్స్ అనేవి తప్పకుండా ఉండాలి. మన అంచనా ప్రకారం రాబోయే కాలంలో సాఫీగా జీవితం గడపాలన్నా, ఒత్తిడికి గురవకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండాలన్న, ఇప్పుడు మనం ఎంత అయితే ఖర్చు పెడుతున్నామో దానికి 20 రెట్లు సేవింగ్స్ అనేది తప్పకుండా ఉండేలా చూసుకోగలిగితే, రిటైర్మెంట్ సమయానికి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో మన చేతిలో డబ్బు ఉంటుంది. రిస్క్ లేకపోతే మిగిలేది రిస్క్ మాత్రమే అనేది మన లైఫ్ లో ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మనం ముందే ముందు చూపుతో రిటైర్మెంట్ కోసం ఆలోచించగలిగితే జీవితమంతా కూడా సాఫీగా  జరుగుతుంది.

HDFC లైఫ్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ ప్రయోజనాలు:

అనుకూలీకరించదగిన పరిష్కారాలు: ప్రీమియం చెల్లింపు వ్యవధి, పదవీ విరమణ వయస్సు మరియు రక్షణ స్థాయిని ఎంచుకోవడానికి ప్లాన్ మిమ్మల్ని అనుమతిస్తుంది, మీ రిటైర్‌మెంట్ ప్లాన్ మీ ప్రత్యేక అవసరాలు మరియు లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటుంది. 

గ్యారెంటీడ్ అడిషనల్ ప్రయోజనాలు: ప్రీమియం చెల్లింపు వ్యవధిలో ప్లాన్ హామీ జోడింపులను అందిస్తుంది, ఇది మీ రిటైర్మెంట్ కార్పస్‌ను మెరుగుపరుస్తుంది మరియు మీరు ద్రవ్యోల్బణం కంటే ముందు ఉండేందుకు సహాయపడుతుంది. 

సాధారణ ఆదాయం: మీ పదవీ విరమణ సంవత్సరాలలో, మీ జీవనశైలి మరియు ఆర్థిక బాధ్యతలకు మద్దతుగా ప్లాన్ అనేది తప్పకుండా సాధారణ ఆదాయాన్ని అందిస్తుంది. 

పన్ను ప్రయోజనాలు: మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10A) కింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు, తద్వారా HDFC లైఫ్ సిస్టమాటిక్ రిటైర్‌మెంట్ ప్లాన్‌ను పన్ను-సమర్థవంతమైన పెట్టుబడిగా మార్చవచ్చు.