ప్లాంక్‌తో ఈ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇది మీ కోర్‌ని బలంగా చేస్తుంది.

ప్లాంక్స్ సులువుగా చేయగలిగే వ్యాయామం. దీంతో శరీరం దృఢంగా మారుతుంది.  ప్లాంక్స్  చేయడం మొదట్లో కష్టంగా అనిపించినప్పటికీ.. రోజూ సాధన చేయటం వల్ల కలిగే లాభాలు చాలానే ఉంటాయి.  భుజాలు,  చేతులు బలంగా తయారవుతాయి.  చక్కని ఆకృతిని పొందుతాము. ఎముకలు, కండరాల స్థానంలో మార్పు రాదు. ప్లాంక్ చేస్తే వెన్ను కండరాలు బలోపేతం అవుతాయి. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజూ ప్లాంక్స్ చేస్తే అదనపు కేలరీలు ఖర్చు అవుతాయి. జీవక్రియ రేటు పెరుగుతుంది. కండరాల […]

Share:

ప్లాంక్స్ సులువుగా చేయగలిగే వ్యాయామం. దీంతో శరీరం దృఢంగా మారుతుంది.  ప్లాంక్స్  చేయడం మొదట్లో కష్టంగా అనిపించినప్పటికీ.. రోజూ సాధన చేయటం వల్ల కలిగే లాభాలు చాలానే ఉంటాయి.  భుజాలు,  చేతులు బలంగా తయారవుతాయి.  చక్కని ఆకృతిని పొందుతాము. ఎముకలు, కండరాల స్థానంలో మార్పు రాదు. ప్లాంక్ చేస్తే వెన్ను కండరాలు బలోపేతం అవుతాయి. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజూ ప్లాంక్స్ చేస్తే అదనపు కేలరీలు ఖర్చు అవుతాయి. జీవక్రియ రేటు పెరుగుతుంది. కండరాల అలసట ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది

లోయర్ బ్యాక్ పెయిన్

ఎక్కువ సమయం పాటు కూర్చోవడం వల్ల, సరైన భంగిమల్లో కూర్చోకపోవడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ సమస్య వస్తుంది. అందుకే నిటారుగా కూర్చునేందుకు ప్రయత్నించాలి. అయితే ఇలా కూర్చోడానికి తగినంత సాధన చేయాలి.  ప్లాంక్ వేయడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ నుంచి విముక్తి కలుగుతుంది. ప్లాంక్ వేయడం వల్ల వెన్నుపాము దృఢంగా మారుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్‌ని తగ్గించడంలో ప్లాంక్ కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

బాడీని ప్లాంక్ పొజిషన్లో పెట్టడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. భుజాలు, ఆబ్స్  మీద చాలా మంచి ప్రభావం ఉంటుంది. ఎంతసేపు ఈ ఆసనం వేస్తే అంత బెనిఫిట్ పొందవచ్చు. అయితే మొదట్లో కాస్త కష్టంగా ఉంటుంది. కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. ఈ ప్లాంక్ పొజిషన్ ఈజీగా ఉంటుంది.  మొత్తంగా శరీరంలోని కొవ్వును తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. శరీర తీరును కూడా సరిచేస్తుంది. నొప్పులు కలిగే అవకాశాన్ని తగ్గిస్తుంది.  స్టామినా పెంచుతుంది.

ప్లాంక్స్ చేయడం వల్ల కోర్ బలంగా మారుతుంది.  ఈ వర్క్ అవుట్, మిగతా వర్క్ అవుట్  సరిగ్గా చేసేందుకు మీకు సహాయపడుతుంది.  కీళ్ల నొప్పులను తగ్గించి మంచి శరీర తీరు ఉండేలా చేస్తుంది.  కార్డియో కంటే ఎక్కువ బలాన్ని ఇచ్చే వర్కౌట్ ప్లాంక్ వర్కౌట్. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మీ కండరాలన్నీ పనిచేస్తాయి. కాబట్టి క్యాలరీలు కూడా ఖర్చవుతాయి. ప్లాంక్ చేయడం వల్ల మీ అప్పర్ బాడీ లోయర్ బాడీని కలిపే కండరాలు, భుజాలు, చేతులు  బలంగా మారతాయి. దీనిని చేయడం వల్ల స్టెబిలిటీ , ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. చాలా ఎఫెక్టివ్ వర్కౌట్. ఇది  కోర్ ని మెరుగ్గా మారుస్తుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల కాలరీలు బాగా ఖర్చవుతాయి. ప్లాంక్ చేస్తున్నప్పుడు మీ భంగిమ సరిగ్గా ఉండాలి. కాళ్లు నిటారుగా నేలకి సమాంతరంగా, మోకాళ్ళని వంచకుండా, వీపుని పైకి ఎత్తకుండా ఇందులో మీ బ్యాక్ కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. 

హిప్ ఎక్సర్‌ సైజ్ కూడా వెన్నుపాము ఆరోగ్యానికి ముఖ్యమైనదే. హిప్‌ (తుంటి భాగం) ని స్టిఫ్‌గా ఉంచడం వల్ల తగిన రిజల్ట్ వస్తుంది. పడుకుని ఎడమ, కుడి మోకాళ్లని శరీరానికి దగ్గరగా తీసుకురావడం, అనంతరం దూరంగా చాచడం వల్ల తుంటి భాగం దృఢంగా మారేందుకు అవకాశం ఉంది. తద్వారా వెన్నునొప్పి సమస్య తగ్గుతుంది. వెన్నుపాముకు పొత్తికడుపు కండరాలు బాసటగా నిలుస్తాయి. వీటిని వీలైనంత మేర యాక్టివ్‌గా ఉంచాలి. కాళ్లని ముందుకు లేదా వెనక్కి కదపడం, మోకాళ్లని దగ్గరగా తెచ్చి పడుకుని ఎక్సర్‌ సైజులు చేయడం వల్ల వెన్నునొప్పిపై భారం తగ్గే అవకాశం ఉంది. చేతులను తల పైకి నిటారుగా పెట్టి పైకి లేస్తూ స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల పొత్తికడుపు కండరాలతో పాటు, వెన్నుపాము స్టెబిలైజ్ కావడానికి అవకాశం ఉంది.