మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా?

చర్మంలో మెలనిన్ పెరగడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. మెలనిన్ పరిమాణం పెరిగే ప్రదేశంలో, అక్కడ ముఖం రంగు మారిపోతుంది. సూర్య కిరణాలకు నేరుగా గురికావడం వల్ల చాలా మందికి పిగ్మెంటేషన్ వస్తుంది. ఇది కాకుండా, హార్మోన్ల మార్పుల వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. దీన్ని వదిలించుకోవడానికి, మీరు అనేక ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. ఈ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. ఈ 5 చిట్కాలను ప్రయత్నించండి, కొన్ని వారాల్లోనే పిగ్మెంటేషన్ మచ్చలు మాయం పిగ్మెంటేషన్ లేదా చిన్న […]

Share:

చర్మంలో మెలనిన్ పెరగడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. మెలనిన్ పరిమాణం పెరిగే ప్రదేశంలో, అక్కడ ముఖం రంగు మారిపోతుంది. సూర్య కిరణాలకు నేరుగా గురికావడం వల్ల చాలా మందికి పిగ్మెంటేషన్ వస్తుంది. ఇది కాకుండా, హార్మోన్ల మార్పుల వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. దీన్ని వదిలించుకోవడానికి, మీరు అనేక ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. ఈ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం.

ఈ 5 చిట్కాలను ప్రయత్నించండి, కొన్ని వారాల్లోనే పిగ్మెంటేషన్ మచ్చలు మాయం

పిగ్మెంటేషన్ లేదా చిన్న మచ్చలు ఏర్పడటం వల్ల ముఖం సహజత్వాన్ని కోల్పోతుంది. కాలుష్యం, పోషకాహార లోపం, అజాగ్రత్త, చలిగాలులు వంటి వివిధ కారణాల వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. ఇలా మచ్చలు ఏర్పడడం వలన ముఖారవిందం దెబ్బతింటుంది. చాలా మందికి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. కాబట్టే మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. కానీ జేబులోని డబ్బులన్నీ వృథా అయ్యాక అరెరే.. ఈ క్రీమ్స్ సరిగా పని చేయలేదే.. వీటికి బదులు హోం రెమిడీస్ వాడితే సరిపోయేదే అని అనుకుంటారు. అటువంటి వారి కోసం ఇంట్లోనే తయారు చేసే హోం రెమిడీస్..

నల్లటి ముడతలు, చిన్న మచ్చలు ముఖాన్ని భయంకరంగా కనిపించేలా చేస్తాయి. దీంతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వీటిని తగ్గించుకునేందుకు ఖరిదైన కెమికల్ ట్రీట్‌మెంట్ల కంటే కొన్ని నేచురల్ హోం రెమెడీలను ఉపయోగించడం ద్వారా సహజ సౌందర్యాన్ని పునరుద్ధరించవచ్చు.

మచ్చలను తగ్గించడానికి ఉపయోగించే కొన్ని గృహ చికిత్సలు 

తులసి ఆకులు మరియు నిమ్మరసం

ముఖంపై మచ్చలు రావడం ప్రారంభించినట్లయితే తులసి ఆకులను మెత్తగా చేసి, అందులో రెండు చుక్కల నిమ్మరసం కలపండి. ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెంటనే మచ్చలు తొలగిపోతాయి.

చందనం పొడి

గంధపు పొడిని ఉపయోగించడం ద్వారా మచ్చల బాధను తొలగించుకోవచ్చు. గంధపు పొడిలో కొంచెం రోజ్ వాటర్ వేసి చక్కటి పేస్ట్‌‌‌‌‌లా చేసుకోవాలి. చిన్న మచ్చలు, నల్లగా మారిన చోట అప్లయి చేసుకుని 15 నిమిషాలు వదిలివేయాలి. తర్వాత బాగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చిన్నచిన్న మచ్చలు వెంటనే తగ్గటం ప్రారంభిస్తాయి.

మజ్జిగ

మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్ చిన్న మచ్చలు & పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికోసం మీరు పుల్లని పెరుగు లేదా మజ్జిగను మచ్చలు ఉన్న చోట అప్లయి చేసుకోవాలి. కాసేపటి తర్వాత కడగాలి. ఈ విధంగా వారానికి 3 సార్లు చేయడం ద్వార చిన్న చిన్న మచ్చలు క్షీణించడం ప్రారంభించి కొన్ని రోజుల్లో మాయమవుతాయి.

నిమ్మ మరియు తేనె

నిమ్మకాయ ఒక సహజ బ్లీచింగ్ ఏజెంట్. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. తేనె చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా చేస్తుంది. కాబట్టి నిమ్మరసంలో కొంత స్వచ్ఛమైన తేనె కలిపి మచ్చలపై అప్లై చేయండి. మీ చిన్న మచ్చలు కొన్ని రోజుల్లో తేలికగా మాయమైపోతాయి.

బంగాళదుంప రసం

బంగాళాదుంపలో విటమిన్ సీ, పొటాషియం, ఇతర ప్రకాశవంతమైన ఏజెంట్లు ఉన్నాయి. ఇవి నల్ల మచ్చలు తొలగించడంలో సహాయపడతాయి. పచ్చి బంగాళాదుంపను పిండి రసం తీసుకోవాలి. అందులో కొంత తేనె మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అది ఆరిపోయినప్పుడు కడగాలి. దీని వల్ల ముఖం కాంతివంతంగా మారి కొన్ని రోజుల్లోనే మచ్చలు మాయమవుతాయి.