పెంపుడు జంతువుల కోసం ఐడియాలు

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ పెంపుడు జంతువులు ఉంటున్నాయి. కొంత మందికి పెద్ద ఇల్లు లేకపోవడంతో వాటికి ఇబ్బందిగా మారుతోంది. మరికొంత మందికి సరిపడా స్థలం ఉన్నా కానీ వాటికోసం ఎలా డెకరేట్ చేయాలో తెలియక లైట్ తీసుకుంటున్నారు. స్థలం ఉన్నా కానీ వారు వినియోగించుకోలేకపోతున్నారు. పెంపుడు జంతువులను తీసుకొచ్చినపుడు మన ఇంటిని ఈ ఐడియాలతో అలంకరిస్తే చాలా అందంగా ఉండడమే కాకుండా ఆ పెంపుడు జంతువులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ఐడియాలను […]

Share:

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ పెంపుడు జంతువులు ఉంటున్నాయి. కొంత మందికి పెద్ద ఇల్లు లేకపోవడంతో వాటికి ఇబ్బందిగా మారుతోంది. మరికొంత మందికి సరిపడా స్థలం ఉన్నా కానీ వాటికోసం ఎలా డెకరేట్ చేయాలో తెలియక లైట్ తీసుకుంటున్నారు. స్థలం ఉన్నా కానీ వారు వినియోగించుకోలేకపోతున్నారు. పెంపుడు జంతువులను తీసుకొచ్చినపుడు మన ఇంటిని ఈ ఐడియాలతో అలంకరిస్తే చాలా అందంగా ఉండడమే కాకుండా ఆ పెంపుడు జంతువులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ఐడియాలను మీరు కూడా ఫాలో అవండి..  

కారణం అదే.. 

ప్రస్తుత రోజుల్లో లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అవుతుంది. అందుకోసమే అందరూ పెంపుడు జంతువులను పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక అంతే కాకుండా మోడ్రన్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడుతున్న అనేక మంది పెట్స్ పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇరుగ్గా ఉన్న ప్రదేశాల్లో మన పెట్స్ కు చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందుకోసమే వాటికి సెపరేట్ గా ఏదో ఒకటి చేయాలని చాలా మంది భావిస్తుంటారు. కొంత మందికి విశాలమైన స్థలం ఉన్నా కానీ సరైన ఐడియా లేక వారు సరిగ్గా డిజైన్ చేయలేకపోతారు. పెంపుడు జంతువులతో కొద్ది రోజుల్లోనే ప్రజలకు స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది. అపార్ట్ మెంట్లలో పెట్స్ ను పెంచుకోవడం చాలా కష్టం అవుతుంది. పెంపుడు జంతువులను చూసుకునే పద్ధతి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు ఏదో పెంచామా అన్నట్లు పెంచేవారు కానీ ఇప్పుడు వాటి గురించి తీసుకుంటున్న కేర్ అమోఘం. ఇప్పుడు వాటి కోసం స్ఫెషల్ ఫుడ్ మాత్రమే కాకుండా వాటికి స్పెషల్ గా ఉండే స్థలాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు అందరూ ముందుకొస్తున్నారు. మనకు ఉన్న ప్లేస్ లోనే వాటికోసం బెస్ట్ గా ఎలా తయారు చేయాలో ఈ కింది ఐడియాలను గమనించండి.  

దానికి అనుకూల ప్రాంతం: మీ ఇంట్లో మీ పెట్ కు ఏదో ఒక అనుకూల ప్రాంతం ఉంటుంది. ముందుగా మీరు దానిని గుర్తించండి. అక్కడే దానికి వసతి ఏర్పాటు చేయండి. అందమైన బొమ్మలు ఏర్పాటు చేసి అక్కడ అది పడుకునేందుకు ఏర్పాట్లు చేయండి. అప్పుడు మీ పెట్ చాలా సంతోషం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. 

డ్యూయల్-పర్పస్ డిలైట్స్: మీరు ఫర్నీచర్ కొనుగోలు చేసేటపుడు ఒక విషయం గుర్తుంచుకోండి. డ్యూయల్ రోల్స్‌తో ఉండే ఫర్నీచర్‌ను ఎంచుకోండి. ఇలా మీరు చేయడం వల్ల మీ పెట్స్ చాలా సంతోషంతో ఉంటాయి. అందుకోసమే దీనినే చేయండి. 

స్టైలిష్ కంటైన్‌మెంట్: స్టైలిష్ పెట్ గేట్‌లను ఉపయోగించి మంచి ఆట స్థలాన్ని సృష్టించండి. మీరు ఏదైనా సమయంలో బిజీగా ఉన్నప్పుడు మీ పెట్స్ ను ఇది సురక్షితంగా ఉంచుతుంది. మీరు బిజీగా ఉండే సమయంలో మీ పెట్స్ ఇక్కడే గడుతాయి.. కాబట్టి ఈ ప్లేస్ ను చాలా అందంగా అలంకరించండి. ఈ ప్లేస్ ను చూడగానే మీ పెట్స్ అట్రాక్ట్ అయ్యేలా చేయండి. 

తక్కువ స్థలంలో కూడా… మీరు మీ పెట్స్ కోసం కొంత ప్లేస్ ను డెకరేట్ చేస్తున్నపుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు తక్కువ స్పేస్ లో మీ డిజైన్ ను కంప్లీట్ చేసేలా చూసుకోవాలి. అలా కాకుండా వెళ్తే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకోసమే మినిమలిజంను ఎంచుకుని గది డెకరేషన్ ను కంప్లీట్ చేసేందుకు ట్రై చేయండి. 

ఒకప్పుడు పెంపుడు జంతువులను ట్రీట్ చేసే విధానానికి ఇప్పుడు వాటిని ట్రీట్ చేసే విధానానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అందుకోసం మీరు వాటి కోసం సెపరేట్ స్పేస్ తయారు చేస్తున్నపుడు చాలా కేర్ గా ఉండాలి. ఏదో చేస్తున్నామా అని కాకుండా కాస్త ఇంటెన్సివ్ గా చేయాలి.