PCOS అంటే ఏమిటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆడవారి జీవన శైలిలో అనేకమైన మార్పులు వచ్చాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా కూర్చుని పని చేయడం, శరీర అలసట లేకపోవడం, ఆహార విషయాలలో మార్పులు కనిపించడం, నిద్రలేచే విషయంలో నిద్రపోయే విషయంలో సమయాలు మారడం, ఇవన్నీ కూడా PCOSకి కారణం కావచ్చు.  PCOS అంటే ఏమిటి?  ఇప్పుడున్న కాలంలో ఎక్కువ శాతం ఆడవారిలో PCOS ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అండాశ‌యాల్లో ఆండ్రోజెన్స్ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ పీసీఓఎస్ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఈ పీసీఓఎస్ తో […]

Share:

ఆడవారి జీవన శైలిలో అనేకమైన మార్పులు వచ్చాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా కూర్చుని పని చేయడం, శరీర అలసట లేకపోవడం, ఆహార విషయాలలో మార్పులు కనిపించడం, నిద్రలేచే విషయంలో నిద్రపోయే విషయంలో సమయాలు మారడం, ఇవన్నీ కూడా PCOSకి కారణం కావచ్చు. 

PCOS అంటే ఏమిటి? 

ఇప్పుడున్న కాలంలో ఎక్కువ శాతం ఆడవారిలో PCOS ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అండాశ‌యాల్లో ఆండ్రోజెన్స్ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ పీసీఓఎస్ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఈ పీసీఓఎస్ తో బాధపడుతున్న వారిలో ఋతు చక్రాన్ని అంటే మెన్స్ట్రల్ సైకిల్ ని దెబ్బతీస్తుంది. దాని వల్ల పీరియడ్స్ సక్రమంగా అవ్వకపోవడం, పీరియడ్స్ స్కిప్ అవ్వడం, కడుపునొప్పి, జుట్టు అధికంగా పెరగడం, బరువు ఎక్కువగా పెరగడం, డయాబెటిస్ వచ్చే అవకాశం, గుండెకు సంబంధించిన వ్యాధులు రావడం. ఇలా అనేకమైన బాధలకు కారణం అవుతుంది PCOS.

బరువు తగ్గడం, ఎక్సర్సైజ్ చేయడం: 

PCOS బారిన పడకుండా ఉండాలంటే ఆడవారు ముఖ్యంగా తమ శరీర బరువుని మేనేజ్ చేసుకోవడంలో ముందుండాలి. PCOS వచ్చిన వారిలో ముఖ్యంగా నార్మల్ బరువు కన్నా అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, శరీర బరువును నియంత్రించడానికి ప్రతి రోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం, యోగా వంటివి చేయడం తప్పనిసరి. దీనివల్ల హార్మోనల్ ఇమ్ బాలన్స్ అనేది తగ్గుముఖం పడుతుంది అంటున్నారు నిపుణులు. PCOS బారి నుండి బయటపడేందుకు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి. 

చాలామంది ఎన్నో రకాలైన శరీర సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్రెషన్, అలసట ఇలాంటివి ఎన్నో మొదలయ్యాయి. PCOS హార్మోనల్ ఇమ్ బ్యాలెన్స్ ను మనం కంట్రోల్ చేసేందుకు యోగ ఒక చక్కని అంశం. ఒత్తిడి లేకుండా మన శరీర బరువును మెయింటైన్ చేయడానికి, శరీరంలో ఉన్న అనారోగ్యాల నుంచి దూరం అవడానికి యోగ చక్కని చిట్కా అని చెప్పుకోవచ్చు. 

ఈ ఆహారాలు మీ డైట్ లో చేర్చండి: 

ఖర్జూరం: 

ఆడవారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క వయసు వారు కూడా ఖర్జూరం తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఖర్జూరాన్ని ఎండబెట్టి డ్రైఫ్రూట్ గా చేసుకునే, రాత్రి నానబెట్టుకుని ఉదయం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటున్నాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆడవారిలో పీరియడ్స్ సమయంలో శక్తిని పొంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ముఖ్యంగా ఈ ఖర్జూరం ఔషధంగా పనిచేస్తోంది. అంతేకాకుండా బ్లడ్ లెవెల్స్ తగ్గకుండా ఉండేందుకు, ఖర్జూరం లో ఉండే ఐరన్ ఎంతగానో సహాయపడుతుంది. 

అల్లం: 

ఈ అల్లం లో ముఖ్యంగా నొప్పి నివారణ శక్తి అనేది చాలా బాగుంటుంది, ఆడవారిలో నొప్పిని తట్టుకునే శక్తిని పెంపొందించడంలో అల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది.  అంతేకాకుండా ఆడవారిలో పీరియడ్స్ సమయంలో, జీర్ణశక్తి పెంపొందించడానికి కూడా ఈ అల్లం అనేది చక్కగా పనిచేస్తుంది. 

వాల్నట్: 

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. అయితే ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్ అనేది ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ తో నిండి ఉండే ఒక మంచి ఆహార పదార్థం. ఇందులో ఉండే ప్రోటీన్.. ఫైబర్.. మెగ్నీషియం వంటివి మనకి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ సేపు ఎనర్జిటిక్ గా ఉండడానికి కూడా వాల్నట్ సహాయపడుతుంది. ఆడవారి పీరియడ్స్ సమయంలో ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.