పేరెంటింగ్ టిప్స్: ఎదిగే పిల్లలకు ఈ విలువలు నేర్పుతున్నారా.!?

పిల్లలు ఏదైనా సాయం పొందితే వెంటనే ఆ సాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసే అలవాటు చేయాలి . ఎందుకంటే మనం సాయం పొందిన వెంటనే ఎదుటి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం కనీస ధర్మం. సాయం పొందడమే కాదు సాయం చేయడం కూడా అలవాటు చేసుకోవాలని చిన్నప్పటి నుంచే పిల్లలకు చెప్పాలి. సాయం పొందడంలో ఉండే ఆనందం కంటే కూడా సాయం చేసినప్పుడు పొందే ఆనందం రెట్టింపు అనే విషయాన్ని వారికి చిన్న వయసు నుంచే తెలియజేయాలి. […]

Share:

పిల్లలు ఏదైనా సాయం పొందితే వెంటనే ఆ సాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసే అలవాటు చేయాలి . ఎందుకంటే మనం సాయం పొందిన వెంటనే ఎదుటి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం కనీస ధర్మం. సాయం పొందడమే కాదు సాయం చేయడం కూడా అలవాటు చేసుకోవాలని చిన్నప్పటి నుంచే పిల్లలకు చెప్పాలి. సాయం పొందడంలో ఉండే ఆనందం కంటే కూడా సాయం చేసినప్పుడు పొందే ఆనందం రెట్టింపు అనే విషయాన్ని వారికి చిన్న వయసు నుంచే తెలియజేయాలి.

పిల్లలు తమ అవసరాలను , వారి భావాలను ఇతరులతో పంచుకునేలా ముందు నుంచి అలవాటు చేయాలి .వారికి ఎవరైనా ప్రాముఖ్యత ఇవ్వకపోతే వారిలో నిరాశ హింసాత్మకంగా మారవచ్చు. అలా జరగకుండా ఆపడానికి వారి భావోద్వేగాలు భావాలను మరియు వారి అవసరాలను గుర్తించి సక్రమమైన విధానంలో ఎలా వ్యక్తపరచాలో కూడా నేర్పించాలి. 

పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎక్కువమందితో పిల్లలు కలిసి పోయేలాగా వారికి కొన్ని మంచి విషయాలు తెలపాలి. పిల్లల్లో ఎవరైనా బాధపడుతుంటే వారికి ఓదార్పు అందించే మాటలను ఏ విధంగా మాట్లాడితే వారిని అక్కున చేర్చుకోవచ్చో, వారిలో ఉన్న నిరాశను ఎందుకు వారదోలేలా మాట్లాడాలో కూడా వారికి కొన్ని నైతిక విలువలను నేర్పించాలి . పక్కవారి బాధలో పాలుపంచుకుంటే కలిగే ఆనందాన్ని, వచ్చే సంతృప్తిని వారికి తెలపాలి. మన కోసమే మనం కాకుండా పక్క వారి కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం మనం బ్రతికేలాగా, మన బ్రతుకు ఒక విలువ తీసుకువచ్చేలాగా ఉండాలని ప్రాముఖ్యతను వారికి చిన్న వయసు నుంచే నేర్పించాలి. దేశ సేవ కు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలాగా చక్కటి నడవడికను అలవరచాలి.

ఏదైనా వస్తువును ఇతరుల దగ్గర నుంచి తీసుకునే ముందు వారి అనుమతిని తీసుకోవాలని అలవాటు చేయాలి. 

తుమ్ములు దగ్గు ఆవలించే సమయంలో నోరు కప్పుకోవటం అలవాటు చేయాలి.

పని ప్రారంభించే ముందు ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తించాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవాటు చేయాలి నాయకత్వం అంటే కేవలం అధికారం చాలాయించడం కాదని అందరినీ కలుపుకుంటూ వెళ్లాలని , అందులో కూడా మంచిని ఎలా చూడాలో వారికి అలవాటు చేయాలి. 

వ్యక్తుల పట్ల ఉదారంగా ఉండాలి. వారి మనసులోని భావాలను పంచుకునే అవకాశం ఇవ్వాలి. బాధ్యతగల మనిషిగా ఉండటం పిల్లలకు నేర్పించాలి. హ్యాండ్ షేక్, ఐ కాంటాక్ట్ పదాల ప్రాముఖ్యం వారికి తెలియ చెప్పాలి . సేవ చేసే వ్యక్తులతో మర్యాదగా ప్రవర్తించడం తెలియాలి. సేవ చేయడంలో ఉండే తృప్తిని వారికి చిన్నప్పటినుంచి రుచి చూపించాలి . సేవాభావం కలిగి ఉన్న వారి విలువలను వారికి తెలపాలి  నన్ను క్షమించు, క్షమించండి అనే పదాల ఉపయోగం గురించి వారికి తెలియజేయడమే కాకుండా ఎలాంటి సందర్భాలలో ఉపయోగపడతాయా కూడా తెలపాలి. ఇతరులను ఎప్పుడూ ఎగతాళి చేయకూడదని ఎగతాళి చేయడం వలన వారి మానసిక వేదను బాధను తెలపాలి ఆ బాధలో ఆనందాన్ని వెతకకుండా వారికి ఓదార్పు కలిగించే మాటలను ఏ విధంగా మాట్లాడాలో కూడా అలవాటు చేయాలి పెద్దలకు గౌరవం ఇవ్వడం నేర్పించాలి. పెద్దలకు పట్ల వినయంగా ఎలా మసులుకోవాలో కూడా చెప్పాలి. 

మీరు మీ పిల్లలకు డబ్బు నిర్వహణ గురించి ఎంత త్వరగా నేర్పడం ప్రారంభిస్తే అంత మంచిది. మూడు సంవత్సరాల వయసున్న పిల్లలు డబ్బును లెక్కించడం ఏదైనా కొనుక్కోవడం వంటి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోగలరు. మీ బిడ్డ పెరిగే కొద్దీ బడ్జెట్ పొదుపు పెట్టుబడి వంటి మరింత లోతైన ఆర్థిక అంశాలను క్రమంగా వారికి పరిచయం చేయాలి.