ఓస్టియో అర్థ్‌రైటిస్‌ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది?

వయసు మీద పడుతున్న కొద్ది చాలామందిలో కీళ్ల నొప్పులు సహజంగా వస్తూ ఉంటాయి. అయితే చాలామందిలో, ఓస్టియో అర్థ్‌రైటిస్‌ అనే వ్యాధి కనిపిస్తున్నట్లు రీసెర్చ్ ప్రకారం తేలింది. అంతేకాకుండా 2050 నాటికి సుమారు 10 కోట్ల మంది జనాభాకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. ఓస్టియో అర్థ్‌రైటిస్‌ అంటే ఏంటి? ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు పెరుగుతున్న జనాభా కారణంగా, మనిషిలో అనవసరమైన బరువు కారణంగా ఓస్టియో అర్థ్‌రైటిస్‌ వ్యాధి వచ్చే […]

Share:

వయసు మీద పడుతున్న కొద్ది చాలామందిలో కీళ్ల నొప్పులు సహజంగా వస్తూ ఉంటాయి. అయితే చాలామందిలో, ఓస్టియో అర్థ్‌రైటిస్‌ అనే వ్యాధి కనిపిస్తున్నట్లు రీసెర్చ్ ప్రకారం తేలింది. అంతేకాకుండా 2050 నాటికి సుమారు 10 కోట్ల మంది జనాభాకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.

ఓస్టియో అర్థ్‌రైటిస్‌ అంటే ఏంటి?

ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు పెరుగుతున్న జనాభా కారణంగా, మనిషిలో అనవసరమైన బరువు కారణంగా ఓస్టియో అర్థ్‌రైటిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అర్థ్‌రైటిస్‌ మాదిరిగానే, 30 సంవత్సరాలు పైబడిన మనుషులలో కీళ్ల నొప్పులు ఎక్కువగా మొదలవుతాయి.

అంతేకాకుండా, కాళ్లు మరియు చేతుల జాయింట్ లలో టిష్యూలు డ్యామేజ్ అవ్వడం కారణంగా ఈ ఓస్టియో అర్థ్‌రైటిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వయసుతో కూడా సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన ఎక్కువ మంది పడుతున్నట్లు తెలుస్తోంది. అధిక బరువు, అధిక జనాభా, వయసు మీద పడటం వంటివి ఈ వ్యాధికి సహజ కారణాలు.

ఈ వ్యాధి ఎలా గుర్తించాలి?

చాలామంది కూర్చున్నా లెగిసిన మోకాళ్ల జాయింట్లలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువసేపు నుంచున్న, ఎక్కువసేపు ఏదైనా పని చేస్తున్న, ఎక్కువసేపు కూర్చున్నా సరే, జాయింట్లలో విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఆత్రేటిస్ సంబంధించిన సింటమ్స్. అయితే ఈ ఓస్టియో అర్థ్‌రైటిస్‌ వ్యాధికి సంబంధించిన సరైన చికిత్స లేనప్పటికీ, మనం తీసుకునే జాగ్రత్తలు మీదే ఈ వ్యాధి తగ్గుముఖం అనేది చూడొచ్చు అంటున్నారు నిపుణులు.

ఇంకా చెప్పాలంటే కిచెన్ లో ఎక్కువగా నిలబడే ఆడవాళ్ళల్లో ఈ ఓస్టియో అర్థ్‌రైటిస్‌ వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నట్లు రీసెర్చ్ చెప్తోంది. 100 మందిలో రీసెర్చ్ చేయగా సుమారు 61 శాతం మంది ఆడవాళ్లు ఈ వ్యాధిన పడినట్లు తేలింది. అయితే ముందు నుంచి మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా కూడా, మన ఈ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు. అధిక బరువుని మనం అదుపులో పెట్టుకోగలిగితే, ఈ వ్యాధి భారీ నుంచి 90 శాతం తప్పించుకోవచ్చు.

బరువుని కంట్రోల్ చేసే చిట్కాలు.. 

బరువు పెరుగుతున్నారని దిగులుగా ఉన్నారా? వర్క్ అవుట్ చేస్తే సరి. మరి ఎప్పుడు చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా? వర్క్ అవుట్ చేయడానికి రోజులోని ఏ సమయాలు ఎలా ఉపయోగపడతాయో ఈరోజు బాగా తెలుసుకుందాం. మీరు వ్యాయామ చేసే సమయం అనేక విధాలుగా మీ రోజుని ప్రభావితం చేస్తుంది. అయితే అందరికీ ఒకే విధంగా ఉండదు, వ్యక్తిగత ప్రాధాన్యతలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సర్కాడియన్ రిథమ్‌, అంటే 24-గంటల రోజులో మనం అనుసరించే శారీరక, మానసిక ప్రవర్తన ఇంటిమేట్ చేసే ఒక సైకిల్ లాంటిది. సర్కాడియన్ రిథమ్‌, ఇంకా నిద్రపోయే విధానాలు వంటి కారణాల వల్ల మీ శరీర శక్తి ఆధారపడుతుంది. మీ దినచర్యకు సరిపోయే సాధ్యమయ్యే వ్యాయామ సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. 

సమయాన్ని షెడ్యూల్‌ చేసుకోవటం: 

మీ రోజు వారీ పనులు ఎలా షెడ్యూల్‌ చేయుకుంటారో అలాగే వర్క్ అవుట్ చేసుకునే సమయాన్ని కేటాయించి క్రమంగా ఫాలో అయితే, అనవసరం ఐన కొవ్వు తో పాటు టెన్షన్లు కూడా పోతాయి. ఈ షెడ్యూల్‌ చేసుకోవటం చెప్పినంత తేలిక కాదు అనేది ఎంత నిజమో, ప్రతి రోజు క్రమంగా, స్థిరంగా పాటించడం కూడా కొన్ని రోజులు కష్టంగా ఉండవచ్చు. దీర్ఘకాలంలో మాత్రం ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో ఇంప్రూవ్మెంట్ మనం రోజు చూడొచ్చు. మనం బరువు తగ్గించుకోవడంలో సక్సెస్ అయితే తప్పకుండా ఇటువంటి వ్యాధులు ఎన్ని చేరిన మనం తప్పించుకోవచ్చు.