గర్భవతిగా ఉన్నారా.. నోటి శుభ్రత విషయంలో జాగ్రత్త సుమీ..

గర్భం దాల్చడం అనేది ఒక మహిళ జీవితంలో అత్యంత ఆనందదాయకమైన సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఆ మహిళ మాత్రమే కాకుండా కుటుంబం మొత్తం కూడా ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. మనం సాధారణ సమయంలో తీసుకునే జాగ్రత్తలతో కంపేర్ చేసుకుంటే గర్భవతిగా ఉన్న సమయంలో స్త్రీలు కానీ, వారి ఇంట్లో వారు కానీ అధిక జాగ్రత్తలు తీసుకుంటారు.  నోటిని మరవొద్దు సుమీ..  గర్భధారణ సమయంలో అన్ని విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకునే […]

Share:

గర్భం దాల్చడం అనేది ఒక మహిళ జీవితంలో అత్యంత ఆనందదాయకమైన సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఆ మహిళ మాత్రమే కాకుండా కుటుంబం మొత్తం కూడా ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. మనం సాధారణ సమయంలో తీసుకునే జాగ్రత్తలతో కంపేర్ చేసుకుంటే గర్భవతిగా ఉన్న సమయంలో స్త్రీలు కానీ, వారి ఇంట్లో వారు కానీ అధిక జాగ్రత్తలు తీసుకుంటారు. 

నోటిని మరవొద్దు సుమీ.. 

గర్భధారణ సమయంలో అన్ని విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకునే కొంత మంది మాత్రం నోటి విషయాన్ని మర్చిపోతారు. హే.. నోటి విషయంలో ఎలా ఉన్నా ఏం కాదని భ్రమ పడుతుంటారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా లైట్ తీసుకుంటారు. కానీ ఇలా లైట్ తీసుకోవడం మంచిది కాదట.

గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన నోటి అలవాట్లను అవలంబించడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. మీ సొంత శ్రేయస్సు కోసం మాత్రమే కాకుండా, మీలో అభివృద్ధి చెందుతున్న శిశువు ఆరోగ్యం కోసం కూడా నోటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో మంచి నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి కొన్ని సులభమైన ఇంకా ప్రభావవంతమైన చిట్కాలను మనం పరిశీలిద్దాం.

చిన్న మనిషి ఎదగడం ఒక అందమైన ప్రయాణం, కానీ గర్భధారణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కేవలం మీ బొడ్డు మీద మాత్రమే కాకుండా.. నోటి విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ప్రెగ్నెన్సీ టైం అనేది ఒక మహిళ జీవితంలో ఆనందం మరియు నిరీక్షణతో నిండిన విలువైన సమయం. అయినప్పటికీ ఇది శారీరక మరియు భావోద్వేగ సవాళ్లను కూడా తీసుకువస్తుంది. మంచి నోటి పరిశుభ్రత పాటించడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మరియు మీ శిశువు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. 

చాలా మంది కాబోయే తల్లులు గర్భం వారి దంత ఆరోగ్యాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుందని గ్రహించలేరు. కావున వారు నోటి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టరు. చిగుళ్ళ వ్యాధి వచ్చే ప్రమాదం నుంచి రుచి మరియు లాలాజల ప్రవాహంలో మార్పుల వరకు ప్రతి ఒక్క దాని గురించి గమనిస్తూ వైద్యుల సహాయం తీసుకోవడం చాలా అవసరం. ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. మీలో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. 

అప్పుడు పంటి నొప్పి వచ్చిందో.. 

ప్రముఖ ప్రోస్టోడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్, స్మైల్ డిజైన్ స్పెషలిస్ట్ దీక్షా తహిల్ రమణి బాత్రా మాట్లాడుతూ.. గర్భధారణ కాలం శారీరకంగా మరియు మానసికంగా డిమాండ్‌తో కూడుకున్నదని, మరియు ముఖ్యంగా ఆశించిన నొప్పి మరియు అత్యవసర పరిస్థితులకు సంబంధించి బాగా మేనేజ్ చేయాలని తెలిపారు. మొదటి త్రైమాసికానికి ముందు కూడా దంత నొప్పిపై త్వరిత చర్య తీసుకోవడానికి కొన్ని పరిమితుల గురించి తెలుసుకోవాలని ఆమె పేర్కొన్నారు. 

కాబోయే తల్లులకు చికిత్స చేయడానికి మేము ఉపయోగించే మార్గదర్శకాలు క్రింది విధంగా ఉన్నాయని  సూచించారు. 

– అనవసరమైన ఒత్తిడికి గురికాకూడదు.

– శిశువుకు ఎటువంటి రేడియేషన్ రాకుండా ఉండటానికి ఎక్స్-రేలకు దూరంగా ఉండాలి. 

– గర్భం, ప్రసవం మరియు చనుబాలివ్వడం వరకు మందులను జాగ్రత్తగా మరియు సాధ్యమైనంత వరకు పరిమితం చేయాలి.

ఇవి మాత్రమే కాకుండా డాక్టర్ దీక్షా ఇంకా కొన్ని ఆరోగ్యకరమైన నోటి అలవాట్లను తెలియజేసింది. ప్రతి కాబోయే తల్లి సంతోషంగా మరియు ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం వీటిని తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంది. 

1.దంత తనిఖీని పొందండి

గర్భం దాల్చే సమయంలో లేదా గర్భం ప్లాన్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దంత పరీక్ష చేయించుకోవడం ఎల్లప్పుడూ వివేకంతో కూడిన పని అని తెలియజేసింది. 

2. క్షయంతో పోరాడడం

మంచి నోటి పరిశుభ్రతతో పాటు.. మీ దంతాలు కుళ్ళిపోకుండా నిరోధించడానికి ఫ్లోరైడ్ అప్లికేషన్ వంటి చికిత్సలను జోడించడం ద్వారా అదనపు రక్షణ పొరను జోడించడం చాలా ముఖ్యని పేర్కొంది. గర్భధారణ సమయంలో షుగర్ ఎక్కువగా తీసుకోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల దంతాలు కుళ్లిపోయే అవకాశం ఉందని ఆమె హెచ్చరించింది. 

3. మీ రక్షణకు ప్రినేటల్ విటమిన్లు

విటమిన్‌లను ఉపయోగించడం ద్వారా అనేక చిగుళ్ల పరిస్థితులను నియంత్రించవచ్చునని, ముఖ్యంగా విటమిన్ సీ, విటమిన్ బీ 12 మరియు ఫోలిక్ యాసిడ్ వంటివి మంచి చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపింది. 

గర్భం మరియు మాతృత్వం అనేది స్త్రీకి బిజీగా ఉండే సమయాలు.. ఈ సమయాన్ని సరైన విధంగా స్టార్ట్ చేసేందుకు ప్రిపరేషన్ అవసరం. ఈ సమయంలో తీసుకునే అదనపు జాగ్రత్తలతో పాటు దంతాల ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలని డాక్టర్ తెలియజేసింది.