ఆరోగ్యకరమైన చర్మం కోసం లైకోరైస్ (అతి మధురం) దుంప యొక్క పోషక ప్రయోజనాలు

లైకోరైస్ ఒక హెర్బ్, ఇది పొడి చెక్క వంటిది. దీని ఉపయోగం అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. లికోరైస్ అనేక వ్యాధులతో పాటు సౌందర్య ప్రయోజనాలను తెస్తుందని మీకు తెలుసా? అవును, లైకోరైస్‌లో చాలా బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ హెర్బ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మాన్ని మృదువుగా కూడా ఉంచుతుంది. ఈ రోజుల్లో లైకోరైస్ ను అనేక సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తున్నారు. లైకోరైస్ యొక్క ప్రయోజనాలు ఏమిటి మరియు చర్మాన్ని ఆరోగ్యవంతంగా […]

Share:

లైకోరైస్ ఒక హెర్బ్, ఇది పొడి చెక్క వంటిది. దీని ఉపయోగం అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. లికోరైస్ అనేక వ్యాధులతో పాటు సౌందర్య ప్రయోజనాలను తెస్తుందని మీకు తెలుసా?

అవును, లైకోరైస్‌లో చాలా బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ హెర్బ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మాన్ని మృదువుగా కూడా ఉంచుతుంది. ఈ రోజుల్లో లైకోరైస్ ను అనేక సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తున్నారు. లైకోరైస్ యొక్క ప్రయోజనాలు ఏమిటి మరియు చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేయడానికి మరియు అందాన్ని మెరుగుపరచడానికి సరైన మార్గం గురించి తెలుసుకోండి.

నేటి రోజుల్లో అనేక మంది తమ ముఖం అందంగా ఉండాలని చూసుకుంటున్నారు. ముఖారవిందం కోసం ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతున్నారు. ఇలా డబ్బులు పెట్టి ఏవో ఉత్పత్తులను వాడే బదులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి ఎంత ముఖ్యమో ముఖానికీ అంతే ముఖ్యం. కాలుష్యం, నిర్లక్ష్యంతో పాటు, సరైన పోషకాహారం లేకపోతే ముఖం డల్‌‌గా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో దొరికే ప్రకృతి సిద్ధమైన పదార్ధాలతో ముఖాన్ని పూర్తిగా ఆరోగ్యంగాను, అందంగానూ తయారు చేసుకోవచ్చు. ఈ పదార్ధాలలో ఒకటి “లైకోరైస్.” అదే, ‘అతి మధురం’. అవును, లైకోరైస్ అనేది ఆరోగ్యానికి మేలు చేస్తూనే పూర్తి సౌందర్య ప్యాకేజీని అందించే ఒక ఆయుర్వేద మూలిక. లైకోరైస్ పౌడర్, ప్యాక్‌లు మొదలైనవి ముఖానికి కొత్త మెరుపును ఇవ్వడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఎందుకంటే అవి అనేక చర్మ సమస్యలను తొలగిస్తాయి, చర్మం సహజంగా మెరుగుపడుతుంది. లైకోరైస్‌ని ఉపయోగించడం వల్ల ముఖంపైన ఉండే మరకలు తొలగిపోవడమే కాకుండా సహజ తేమతో కూడిన మెరుస్తున్న ముఖం మీ సొంతమవుతుంది. 

లైకోరైస్‌తో చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరచండి

లైకోరైస్ పౌడర్ మీ ముఖం నుండి మరకలు, టాన్, పిగ్మెంటేషన్ గుర్తులు, ముడతలను తొలగిస్తుంది. దానితో పాటుగా, దాని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇరిటెంట్ లక్షణాలు వాపు, పొక్కులతో పాటు అనేక చర్మ రుగ్మతలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. ఇది వదులుగా అయిన చర్మాన్ని బిగించి, మీ ముఖం తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి క్లెన్సర్‌గా పనిచేసి, మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. అందువల్ల, లైకోరైస్ పౌడర్ మీ చర్మాన్ని మెరుగుపరిచి, మెరుస్తూ ఉండేలా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. 

లైకోరైస్ పౌడర్‌ను చర్మంపై ఎలా అప్లై చేయాలి

లైకోరైస్ పౌడర్‌ మార్కెట్‌లో సులువుగానే దొరుకుతుంది. ఒక గిన్నెలో ఒక టీస్పూన్ లైకోరైస్ పౌడర్, ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనె వేసి కలపాలి. దీన్ని బాగా కలిపి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ జోడించండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయాలి. ముఖాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, ఆపై చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.

ఇది ముఖంపైన వచ్చే ముడతలు, నల్లటి వలయాలను తగ్గిస్తుంది, మీ ముఖానికి కాంతిని ఇస్తుంది. లైకోరైస్ పౌడర్ చర్మానికి చాలా మంచిది, ఇది దాదాపు చర్మ సమస్యలన్నింటినీ నయం చేస్తుంది. అంతేకాకుండా, దీనిలో “లిక్విరిటిన్” అనే పదార్ధం ఉంటుంది, ఇది చర్మంలో అధికంగా ఉన్న మెలనిన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంలో ప్రసిద్ధి చెందింది.

ఇంకా ఆలోచిస్తున్నారా? వెంటనే వెళ్ళి ఈ లైకోరైస్ పౌడర్ తెచ్చేసుకోండి. పైన పేర్కొన్న విధంగా ఆ పౌడర్​ను మీ చర్మానికి అప్లై చేసి ఎక్కడ లేని సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోండి. నలుగురిలో విశ్వాసంగా ఉండండి.