ఈ ప్రదేశాలలో లక్కీ బాంబూ ట్రీ ఉంచితే అదృష్టం మీ సొంతం

ఇంతకుముందు, మొక్కలను బహుమతిగా ఇవ్వడం, ఇళ్లలో మొక్కలు పెట్టుకోవడం వంటివి అంత ఎక్కువగా ఉండేవి కాదు. బహుశా, పెరుగుతున్న కాలుష్య స్థాయిలు, ఇతర పర్యావరణ ప్రమాదాల కారణంగా, ఈ రోజుల్లో అందరూ మొక్కలను బహుమతిగా ఇవ్వడం.. ఇంట్లో మొక్కలను ఉంచడం వంటివి చేస్తున్నారు. ఈ రోజుల్లో వాతావరణాన్ని బట్టి, కాలుష్యాన్ని బట్టి, ఇది ఎంత అత్యవసరంగా మారిందో మనం చూడవచ్చు. నిస్సందేహంగా.. రోజులు గడిచేకొద్దీ పరిస్థితి మరింత దిగజారుతోంది, మనల్ని మొక్కలు మాత్రమే రక్షించగలవని ఒక నమ్మకం […]

Share:

ఇంతకుముందు, మొక్కలను బహుమతిగా ఇవ్వడం, ఇళ్లలో మొక్కలు పెట్టుకోవడం వంటివి అంత ఎక్కువగా ఉండేవి కాదు. బహుశా, పెరుగుతున్న కాలుష్య స్థాయిలు, ఇతర పర్యావరణ ప్రమాదాల కారణంగా, ఈ రోజుల్లో అందరూ మొక్కలను బహుమతిగా ఇవ్వడం.. ఇంట్లో మొక్కలను ఉంచడం వంటివి చేస్తున్నారు. ఈ రోజుల్లో వాతావరణాన్ని బట్టి, కాలుష్యాన్ని బట్టి, ఇది ఎంత అత్యవసరంగా మారిందో మనం చూడవచ్చు. నిస్సందేహంగా.. రోజులు గడిచేకొద్దీ పరిస్థితి మరింత దిగజారుతోంది, మనల్ని మొక్కలు మాత్రమే రక్షించగలవని ఒక నమ్మకం ఉంది.

మొక్కల గురించి చెప్పాలంటే, ప్రతి మొక్కకి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని బయట పెంచితే, కొన్నిటిని ఇంటిలో ఉంచుతాము. కొన్ని రకాలు గాలిని శుభ్రపరుస్తాయి. కొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. కొన్ని అదృష్టం, ఆరోగ్యం, సంపద, శ్రేయస్సును అందిస్తాయి. ఈ కారణాలన్నింటి వల్ల, ఏదైనా  బహుమతి ఇవ్వాలని అనుకున్నప్పుడు, ఇండోర్ మొక్కలను బహుమతిగా ఇవ్వవచ్చు. అటువంటి వృక్ష జాతులలో ఒకటి లక్కీ బాంబూ మొక్కలు, ఇవి చుట్టుపక్కల గాలిని శుద్ధి చేయలేకపోవచ్చు కానీ మీకు, మీ వారికి అదృష్టాన్ని తెస్తాయి.

ఫెంగ్‌షుయ్ ప్రకారం.. లక్కీ బాంబూ మొక్క అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి, ఇంట్లో పెరిగే మొక్కలలో అద్భుతమైన మొక్కగా దీనికి మంచిపేరు ఉంది. ఎక్కువగా రాళ్ళు లేదా గులకరాళ్ళతో నింపిన చిన్న గాజు కంటైనర్‌లో నీళ్లు పోసి దీన్ని ఉంచుతారు. కానీ మట్టి అవసరం ఉండదు. ఈ లక్కీ బాంబూ మొక్క అదృష్టాన్ని అందిస్తుందనే నమ్మకం ఉన్నందువల్ల దానిని సరైన స్థలంలో ఉంచాలి. ఇంట్లోనైనా ఆఫీసులోనైనా లక్కీ బాంబూను ప్రత్యేకమైన స్థలంలో ఉంచాలి. ఫెంగ్‌షుయ్ ని నమ్మేవారు సంపద, అదృష్టం, ఆరోగ్యం కోసం దీనిని ప్రత్యేకంగా ఉంచాలని అంటారు. సంపద అదృష్టం కోసం దానిని నిస్సందేహంగా ఆగ్నేయం వైపు ఉంచాలి. మంచి ఆరోగ్యం కోసం దానిని తూర్పువైపుకు కనబడేలా ఉంచాలి.

లివింగ్ రూమ్‌లో ఉంచేటప్పుడు, లివింగ్ రూమ్ లోని ఆగ్నేయం లేదా తూర్పు మూలలలో ఎదురుగా అమర్చడం అవసరం. అలాగే, చి (అంటే పాజిటివ్ ఎనర్జీ) సర్క్యులేట్ అయ్యేలా దానిని సౌత్ సెక్టార్‌లో కాఫీ టేబుల్‌పై ఉంచవచ్చు. ఫెంగ్ షుయ్ కారకాలకు సరిపోయే సోఫా టేబుల్‌ను మాత్రమే ఎంచుకోండి. అలాగే, డిన్నర్ సెంటర్‌పీస్‌పై లక్కీ బాంబూ మొక్కను ఉంచవచ్చు. తద్వారా ప్రతి కుటుంబ సభ్యుల అదృష్టం రెట్టింపవుతుంది.

అలాగే.. లక్కీ బాంబూ మొక్క యొక్క 6 కాండాలలో ప్రతి కాండ అమరిక భిన్నంగా ఉంచబడినట్లు కనిపిస్తుంది. మంచి కెరీర్ వృద్ధి, వ్యాపారం కోసం టేబుల్ యొక్క తూర్పు మూలలో ఈ మొక్కను ఉంచండి. మీరు దానిని మీ డెస్క్ మీద పెట్టుకోవాలనుకుంటే, దానిని మీ డెస్క్ యొక్క తూర్పు వైపు, లేదా ఆగ్నేయ మూలలో ఉంచండి. ఈ మొక్కను పడకగది ప్రాంతంలో ఉంచకూడదు. ఈ మొక్క మాత్రమే కాదు, పడకగదిలో మొక్కలను ఉంచవద్దని ఫెంగ్‌షుయ్ సలహా ఇస్తుంది.

కాబట్టి, లక్కీ బాంబూ మొక్కను ఎక్కడ ఉంచాలో సరిగ్గా తెలుసుకున్న తర్వాత, మీ కోసం మీ వారి కోసం లేత లక్కీ బాంబూ మొక్కను ఎంచుకోండి. మీరు లక్కీ బాంబూ మొక్కలను ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ కూడా కొనుక్కోవచ్చు.