ఇండియాలో చికెన్ పాక్స్ కొత్త వైర‌స్ వేరియంట్

ఎప్పుడైతే కరోనా మహమ్మారి వచ్చిందో అప్పటి నుంచి వైరస్ లు అంటేనే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనాకు టీకా వచ్చినా కానీ వైరస్ భయం మాత్రం ప్రజల్లో అలాగే పాతుకుపోయింది. కరోనా వంటి డేంజరస్ వ్యాధుల్లో చికెన్ పాక్స్ ఒకటి. ఈ వ్యాధి కనుక వస్తే ప్రజల ప్రాణాలకు భరోసా ఉండదు. అందుకోసమే ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ చికెన్ […]

Share:

ఎప్పుడైతే కరోనా మహమ్మారి వచ్చిందో అప్పటి నుంచి వైరస్ లు అంటేనే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనాకు టీకా వచ్చినా కానీ వైరస్ భయం మాత్రం ప్రజల్లో అలాగే పాతుకుపోయింది. కరోనా వంటి డేంజరస్ వ్యాధుల్లో చికెన్ పాక్స్ ఒకటి. ఈ వ్యాధి కనుక వస్తే ప్రజల ప్రాణాలకు భరోసా ఉండదు. అందుకోసమే ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ చికెన్ పాక్స్ కు సంబంధించింన కొత్త రకం వైరస్ ను కనుగొంది. చికెన్‌పాక్స్‌కు సంబంధించిన కొత్త రకం క్లాడ్ 9 వైరస్ ను వీరు కనుగొన్నారు. ఇండియాలో మొదటిసారి చికెన్‌పాక్స్ కు కారణమైన వరిసెల్లా-జోస్టర్ వైరస్ కు చెందిన క్లాడ్ 9 వేరియంట్ ఇది. ఇప్పటికే ఈ వైరస్ జర్మనీ, యూకే, యూఎస్ వంటి దేశాల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. చికెన్ పాక్స్ కు కారణం అయిన వరిసెల్లా-జోస్టర్ వైరస్ తొమ్మిది హెర్పెస్ వైరస్‌లలో ఒకటి. ఇది పిల్లలు, యుక్తవయస్కులు మరియు పెద్దలలో షింగిల్స్‌కు కారణమవుతుంది. ఇండియాలో ఇప్పటివరకు క్లాడ్ 1, ఇంకా క్లాడ్ 5 వైరస్ లు కనుక్కోబడ్డాయి. కానీ క్లాడ్ 9 వైరస్ మాత్రం ఇప్పటి వరకు కనుక్కోబడలేదు. కానీ ఇప్పుడు క్లాడ్ 9 వైరస్ కూడా కనుక్కోబడింది. 

అసలేంటీ క్లాడ్ 9

అసలు క్లాడ్ 9 వైరస్ ఏమిటని అంతా ఆరా తీస్తున్నారు. ఈ క్లాడ్ 9కు సంబంధించిన సమాచారం కోసం సెర్చ్ చేస్తున్నారు. క్లాడ్ 9 అనేది వరిసెల్లా జోస్టర్ వైరస్ యొక్క ఒక వేరియంట్. ఇది చిన్న పిల్లలలో చికెన్‌పాక్స్‌ కు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కరని కాకుండా అనేక మంది వైద్యులు కూడా ఇదే విధంగా చెబుతున్నారు. వరిసెల్లా జోస్టర్ అనేది చిన్నవారిలో చికెన్‌పాక్స్ మరియు పెద్దవారిలో షింగిల్స్‌కు కారణం అవుతుంది. క్లాడ్ 1 మరియు క్లాడ్ 5 వరిసెల్లా జోస్టర్ యొక్క వేరియంట్స్. ఇండియన్స్ లో ఇవి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతున్నాయి. ఇది ఫారిన్ కంట్రీలలో సర్వసాధారణం. కానీ ఇప్పుడు ఇది ఇండియాలో కూడా తన ప్రతాపం చూపెడుతోంది. ఇది ఇండియాలో కూడా పంజా విసురుతుండడంతో ఇటు వైద్యులతో పాటు అటు సాధారణ ప్రజానీకం కూడా భయబ్రాంతులకు గురవుతున్నారు. 

లక్షణాలివే… 

క్లాడ్ 9 వైరస్ మనకు సోకినపుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. క్లాడ్ 9 యొక్క కొన్ని లక్షణాలలో దద్దుర్లు, జ్వరం, ఆకలి లేకపోవటం, తలనొప్పి, అలసట మరియు అనారోగ్యం ఉన్న భావన ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. వైరస్‌కి గురైన 2-3 వారాల తర్వాత చికెన్ పాక్స్ దద్దుర్లు కనిపిస్తాయి. దద్దుర్లు కనిపించడానికి ముందు, రోగికి జ్వరం, శరీర నొప్పి మరియు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు అనేవి పాపుల్స్ అని పిలువబడే గడ్డల రూపంలో కనిపిస్తాయి. తరువాత వెసికిల్స్ అని పిలువబడే చిన్న ద్రవంతో నిండిన బొబ్బలు ఉంటాయి. చిట్టచివరికి స్కాబ్స్ ఏర్పడటంతో అది నయం అవుతుంది. దద్దుర్లు కనిపించిన 1-2 రోజుల తర్వాత జ్వరం తగ్గుతుంది. 

నివారణ కోసం ఏం చేయాలంటే… 

ఏ వ్యాధికైనా నివారణ అనేది ఉంటుంది. మనలో ఎవరైనా సరే వ్యాధికి గురి కావడం కామన్. అటువంటి సమయంలో నివారణ చర్యలు తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే ఆ వ్యాధి మరింత ముదిరి మనకు చాలా నష్టం చేకూరుస్తుంది. చికెన్ పాక్స్ వైరస్ సోకినా కానీ నివారణ ఉంది. దీన్ని నివారించడానికి టీకాలు వేయడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇదే బెటర్ ఆప్షన్ అని వైద్యులు కూడా పేర్కొంటున్నారు. అదిపోతే పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.  అమెరికా మరియు అనేక ఐరోపా దేశాల లో ఈ వైరస్ కు సంబంధించిన టీకాను (వ్యాక్సిన్) టీకా షెడ్యూల్‌లో భాగంగానే పిల్లలకు ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల పిల్లలకు చికెన్ పాక్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వైద్యులు కూడా ఇదే మంచి ఉపాయమని చెబుతున్నారు. కేవలం టీకాలు మాత్రమే కాకుండా పరిశుభ్రతతో కూడా ఈ వైరస్ మన దరి చేరకుండా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా దగ్గు, తుమ్ములు లేదా ముఖాన్ని తాకిన తర్వాత సబ్బు మరియు నీటితో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడాన్ని ప్రోత్సహించాలి. చికెన్‌పాక్స్ లేదా గులకరాళ్లు ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను నివారించాలని వైద్యులు సూచిస్తున్నారు.