ఇంట్లోనే సహజ సిద్ధమైన డియోడరెంట్ తయారు చేసుకోండి

సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు శరీరం నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు చాలా మంది డియోడరెంట్‌లను వాడుతూ ఉంటారు. అయితే గడిచిన కాలంలో లాక్‌డౌన్ వల్ల ఇల్లు దాటి బయటకు వెళ్ళలేకపోవడం, ఎలాగోలాగా అడుగు బయటపెట్టినా… మార్కెట్లో మనకు కావాల్సిన డియోడరెంట్‌లు లభించకపోవడం వంటివి సాధారణంగా అందరూ ఎదుర్కొన్న విషయమే. మరికొందరేమో బయట దొరికే వాటిని వాడటానికి ఇష్టపడటం లేదు. పైగా వాటి వలన కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. డియోడరెంట్‌ను ఎక్కువ ఖర్చు లేకుండా దీన్ని […]

Share:

సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు శరీరం నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు చాలా మంది డియోడరెంట్‌లను వాడుతూ ఉంటారు. అయితే గడిచిన కాలంలో లాక్‌డౌన్ వల్ల ఇల్లు దాటి బయటకు వెళ్ళలేకపోవడం, ఎలాగోలాగా అడుగు బయటపెట్టినా… మార్కెట్లో మనకు కావాల్సిన డియోడరెంట్‌లు లభించకపోవడం వంటివి సాధారణంగా అందరూ ఎదుర్కొన్న విషయమే. మరికొందరేమో బయట దొరికే వాటిని వాడటానికి ఇష్టపడటం లేదు. పైగా వాటి వలన కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. డియోడరెంట్‌ను ఎక్కువ ఖర్చు లేకుండా దీన్ని మనం ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. డియోడరెంట్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

వీటికి కావలసిన పదార్ధములు:

స్వచ్ఛమైన వెన్న 

కొబ్బరి నూనె

యూరోరిట్ పొడి, మొక్క పిండి 

బేకింగ్ పౌడర్ 

ఎస్ఎంసిఎల్ ఆయిల్

తయారు చేయు విధానం:

ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల వెన్నను వేసి, ఆపై ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను కూడా తీసుకోవాలి. వీటిలోకి మూడు చెంచాల యూరోరిట్ పొడి లేదా ముక్క పిండి వేసి ఉండలు లేకుండా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా చక్కగా కలపాలి. ఈ మిశ్రమం జారుడుగా అవగానే 10 నుంచి 15 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న డబ్బాలోకి తీసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జిలో ఉంచాలి. దీంతో నాచురల్ సాఫ్ట్ డియోడరెంట్ క్రీం రెడీ అయినట్లే. 

అయితే ఈ డియోడరెంట్ వాడే మొదటి రెండు వారాల్లో మీకు కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. సాధారణంగా ఎవరికైనా చంకల్లో ఎక్కువగా చెమట పడుతుంది. అలా అనిపిస్తే అది శరీరంలోని విష పదార్థాలను బయటకు వెళుతున్న దానికి సంకేతంగా భావించాలి. సహజంగా తయారు చేసుకున్న ఈ డియోడరెంట్‌ను ఉపయోగించటం వలన దీర్ఘకాలంగా ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా కెమికల్ ఫ్రీ ఉండటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

మరొక నాచురల్ డియోడరెంట్ తయారీ

బయట మార్కెట్లో డియోడరెంట్స్ కెమికల్స్‌తో కూడి ఉండటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ గురవుతూ ఉంటాము. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా.. మన ఇంట్లోనే డియోడరెంట్ తయారు చేసుకోవచ్చు. అయితే వాటికి ఏమేం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

స్వచ్ఛమైన బట్టర్. 

1/3 వంతు కొబ్బరి నూనె

ఎసెన్షియల్ ఆయిల్ 10 నుంచి 15 చుక్కలు

బిస్వాక్స్

తయారు చేయు విధానం: 

ముందుగా బిస్వాక్స్‌ను బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొబ్బరి నూనె వేసి పూర్తిగా కరిగిపోయేదాకా వేడి చేయాలి. పూర్తిగా కరిగిపోయాక వేడి మీద నుంచి దించేసి అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/3 కప్ కార్న్ స్టార్చ్ కలపండి. ఇప్పుడు అందులో ఎసెన్షియల్ ఆయిల్ ని కూడా వేసి కలపాలి. దీనిని సిలికాన్ మోల్డ్స్‌లోకో, డియోడరెంట్ స్టిక్స్‌లోకో పోయండి. ఇది కూడా చల్లారిన తర్వాత సెటిల్ అవ్వడానికి రెండు గంటలు పడుతుంది. ఫైనల్‌గా ఇది రెడీ అంతే.