నాగపంచమి పండుగ ప్రాముఖ్యత

నాగ పంచమి ఒక ప్రత్యేక భారతదేశ పండుగ. ఇది శ్రావణమాసం మొదలైన తరువాత ఐదవ రోజు చేసుకునే పండుగ. ఈ పండుగలో ప్రత్యేకించి పాములను దైవాలుగా కొలిచి ఆరాధిస్తారు. ప్రజలు తమ తమ కుటుంబానికి కుటుంబంలో ఉండే సోదరులకు భద్రత కల్పించాలని కోరుతూ పాము దేవునికి ప్రార్థనలు మరియు పాలు సమర్పిస్తారు. ఈ పండుగ సాధారణంగా హరియాలీ తీజ్ తర్వాత రెండు రోజుల తర్వాత జూలై లేదా ఆగస్టులో జరుపుకుంటూ ఉంటారు. అయితే నాగుల పంచమి పండుగ […]

Share:

నాగ పంచమి ఒక ప్రత్యేక భారతదేశ పండుగ. ఇది శ్రావణమాసం మొదలైన తరువాత ఐదవ రోజు చేసుకునే పండుగ. ఈ పండుగలో ప్రత్యేకించి పాములను దైవాలుగా కొలిచి ఆరాధిస్తారు. ప్రజలు తమ తమ కుటుంబానికి కుటుంబంలో ఉండే సోదరులకు భద్రత కల్పించాలని కోరుతూ పాము దేవునికి ప్రార్థనలు మరియు పాలు సమర్పిస్తారు. ఈ పండుగ సాధారణంగా హరియాలీ తీజ్ తర్వాత రెండు రోజుల తర్వాత జూలై లేదా ఆగస్టులో జరుపుకుంటూ ఉంటారు. అయితే నాగుల పంచమి పండుగ సందర్భంగా ఈ పండుగ విశేషాలు ఈరోజు తెలుసుకుందాం..

నాగపంచమి ఎప్పుడు జరుపుకోవాలి: 

2023లో నాగ పంచమి ఆగస్ట్ 21, సోమవారం ప్రజలు జరుపుకునే పండుగ. ఈ రోజున, ఉత్సవాలు జరగడమే కాకుండా పాములను పూజించడం మరియు వారి ఆశీర్వాదం అందుకోవడం వంటివి జరుగుతాయి. నాగ పంచమి పూజ సమయం ఉదయం 5:53 గంటలకు ప్రారంభమై 8:30 గంటలకు ముగుస్తుంది. నాగ పంచమి పూజ తిథి ఆగష్టు 21 న 12:21 గంటలకు ప్రారంభమై ఆగస్టు 22 న తెల్లవారుజామున 2:00 గంటలకు ముగుస్తుంది.

పాములకు పూజ చేస్తే, తమ ప్రార్థనలను సర్ప దేవతలకు పంపినట్లుగా ఉంటుందని చాలా మంది నమ్మకం. అందుకే 2023, ఆగస్టు 21న, నాగ పంచమి పండుగనాడు ప్రత్యేకించి పాములకు పూజలు జరిపిస్తారు. ఈ ప్రత్యేక పూజసమయంలో పన్నెండు దేవతలను పూజిస్తారు:అనంత, వాసుకి,శేషా, పద్మ, కంబాల, కర్కోటక, అశ్వతార, ధృతరాష్ట్రుడు,శంఖపాలుడు, కలియ, తక్షకుడు, పింగళ. ముఖ్యంగా నాగ పంచమి రోజున నాగ పంచమి పూజ మంత్రం తప్పకుండా పట్టించాలి. నాగ పంచమి పూజ మంత్రం అనేది నాగ పంచమి నాడు సర్ప దేవతలను పూజించే సమయంలో ఉపయోగించే పవిత్రమైన శ్లోకం. 

నాగ పంచమి ప్రాముఖ్యత: 

హిందూ పురాణాలు మరియు సంస్కృతిలో పాములకు ప్రత్యేక స్థానం ఉంది. నిజానికి పాములు శక్తివంతమైన జీవులుగా ప్రజలు మొక్కుతుంటారు. వాటిని పూజించడం వలన అదృష్టాన్ని, అదేవిధంగా పాముల సంబంధిత భయాల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. పండుగ చరిత్ర పురాతన కాలం నాటిది, మహాభారతం వంటి ఇతిహాసాల కథల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ఆస్తిక ఋషి నాగాలను నాశనం అవ్వకుండా పూజింపబడేలా కాపాడడం జరిగింది. అందుకే నాగపంచమి రోజున నాగులను పూజించడం జరుగుతుంది అని చాలామంది నమ్ముతారు.

పాములను ఎందుకు పూజిస్తారు?: 

హిందూమతంలో, పాములు శివుని మెడలో ఉండే ఆభరణం. ముఖ్యంగా నాగ పంచమి అనేది శివునికి పాములకి ఉన్న సంబంధాన్ని గౌరవించే మార్గం అని కూడా అంటూ ఉంటారు. పాములకు పూజలు చేయడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. పాములు పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం అని, ఈ పండుగ ద్వారా నిజానికి ప్రకృతితో సహజీవన ప్రాముఖ్యతను తెలిపే ఒక సందేశంలా ప్రతి ఒక్కరు నమ్ముతారు.

భారతదేశం అంతటా వేడుకలు: 

భారతదేశం అంతటా నాగ పంచమిని ఉత్సాహంగా జరుపుకుంటారు. నాగపంచమి నాడు పాములు మరియు శివుని ప్రతిమలు ఉండే ముఖ్యమైన దేవాలయాలను ప్రజలు సందర్శిస్తారు, అక్కడ ప్రజలు నిష్టతో ప్రత్యేక పూజలు జరుపుకోవడం చూడొచ్చు. నాగ పంచమికి సంబంధించిన కొన్ని ప్రసిద్ధ దేవాలయాలలో కేరళలోని మన్నరసాల ఆలయం, ప్రయాగ్‌రాజ్‌లోని నాగ వాసుకి ఆలయం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయం ఉన్నాయి. మహారాష్ట్రలోని బట్టీస్ షిరాలా గ్రామం మరియు నాగ్‌పూర్ వంటి ప్రదేశాలలో, నాగ పంచమి నాడు గొప్ప వేడుకలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలలో లో ముఖ్యంగా దీపావళి తర్వాత నాగపంచమి మాదిరిగానే, పాములను పూజించే నాగులచవితి అనే ప్రాముఖ్యత కలిగిన పండుగను జరుపుకుంటారు.