మౌత్‌వాష్ గుండె స‌మ‌స్య‌ల‌ను ప‌సిగ‌ట్టేస్తుంద‌ట‌

మ‌నం వాడే మౌత్‌వాష్ గుండె జ‌బ్బ‌ల‌ను ప‌సిగ‌ట్టేస్తుంద‌ట‌. నేటి రోజుల్లో అనేక విధాలైన జబ్బులు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ జబ్బులు వస్తూ ఉన్నాయి. వచ్చిన జబ్బులను చూసి ఒక్కోసారి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందుకు అవుతుందని తలలు పట్టుకుంటున్నారు. గుండె జబ్బులు ప్రస్తుతం అందరినీ కలవరానికి గురి చేస్తున్నాయి. చిన్న వయసు వారికి కూడా సడెన్ గా స్ట్రోక్ వచ్చి వారు కుప్పకూలుతున్నారు. దీంతో గుండె ఆరోగ్యం మీద అందరూ […]

Share:

మ‌నం వాడే మౌత్‌వాష్ గుండె జ‌బ్బ‌ల‌ను ప‌సిగ‌ట్టేస్తుంద‌ట‌. నేటి రోజుల్లో అనేక విధాలైన జబ్బులు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ జబ్బులు వస్తూ ఉన్నాయి. వచ్చిన జబ్బులను చూసి ఒక్కోసారి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందుకు అవుతుందని తలలు పట్టుకుంటున్నారు. గుండె జబ్బులు ప్రస్తుతం అందరినీ కలవరానికి గురి చేస్తున్నాయి. చిన్న వయసు వారికి కూడా సడెన్ గా స్ట్రోక్ వచ్చి వారు కుప్పకూలుతున్నారు. దీంతో గుండె ఆరోగ్యం మీద అందరూ ఫోకస్ చేస్తున్నారు. లైఫ్ స్టైట్ చేంజెస్ చేసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం గుండె జబ్బుల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అంతా లైఫ్ స్టైల్ చేంజ్ కు అలవాటు పడుతున్నారు. ఇదే సమయంలో బయటికొచ్చిన ఒక నివేదిక అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇలా కూడా గుండె జబ్బులు వస్తాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. 

చిగుళ్లతో కూడా… 

ఆరోగ్యకరమైన చిగుళ్లు అందరికీ ఉంటాయి. వీటి ఆరోగ్యం కోసం అనేక రకాలుగా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే కొందరిలో మాత్రం చిగుళ్ల ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ నివేదిక వెల్లడించింది. ‘ప్రాంటియర్స్ ఇన్ ఓరల్ హెల్త్’ అనే నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తుల లాలాజలంలో తెల్ల రక్తకణాల గణనలు ఉంటాయి. ఒక వేళ చిగుళ్ల వాపు వస్తే అది హృదయ సంబంధ వ్యాధులకు హెచ్చరిక సంకేతం వంటిదని ఈ టీం కనుగొంది. 

ఆరోగ్యకరంగా ఉన్నా కానీ

కొంత మంది వ్యక్తులు తాము పర్ఫెక్ట్ ఆరోగ్యంగా ఉన్నాం. మాకేం అవుతుందని ధీమాగా ఉంటారు. వారు తమకు తోచిన విధంగా తింటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలా చేస్తే ఇక కుదరదని ఆ అధ్యయనం వెల్లడించింది. తక్కువ స్థాయిలో ఉండే నోటి ఇన్ఫ్లమేటరీ లోడ్ హృదయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఈ నివేదిక వెల్లడించింది. ఉత్తర అమెరికా దేశంలో అనేక మరణాలకు ఇది కారణం అని.. మౌంట్ రాయల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ట్రెవర్ కింగ్, మరియు ఈ అధ్యయనాన్ని ప్రచురించిన సంబంధిత రచయిత తెలిపారు. పీరియాండోటిటిస్ అనేది సాధారణ చిగుళ్ల ఇన్ఫెక్షన్. ఇది గతంలో హృదయ సంబంధ వ్యాధులతో దీనికి కనెక్షన్ ఉండేది. గుండెకు సంబంధించిన వ్యాధులు డెవలప్ అయ్యేందుకు ఇది కారణం అయ్యేది. చిగుళ్ల ద్వారా రక్తప్రవాహంలోకి ఇన్ఫ్లమేటరీ కారకాలు ప్రవేశించి వాస్కులర్ సిస్టమ్ ను దెబ్బతీస్తాయని పలువురు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. 

మరిన్ని పరిశోధనలకు సిద్ధం

ఈ నివేదికను ఆధారం చేసుకుని మరిన్ని పరిశోధనలు చేసేందుకు పలువురు శాస్త్రవేత్తలు సిద్ధం అయ్యారు. వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయంలో డెంటిస్ట్రీని అధ్యయనం చేస్తున్న డాక్టర్ యుంగ్ హాంగ్ మాట్లాడుతూ… నోటి ఆరోగ్యం మరియు హృదయ సంబంధ వ్యాధుల మధ్య ఉన్న మరిన్ని సంబంధాలను గురించి తెలుసుకునేందుకు లోతుగా అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. అధిక రక్తప్రవాహాన్ని అనుమతించేందుకు ధమనులు ఎంత బాగా వ్యాకోచం చెందుతాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ధమనులు అనేవి హృదయనాళ ప్రమాదానికి కీలక సూచికలుగా ఉంటాయి. ఇవి ధమనుల ఆరోగ్యాన్ని నేరుగా కొలుస్తాయి. ధమనులు కనుక సరిగ్గా పని చేయకపోతే అప్పుడు హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. 

ధూమపానం చేయని వారితో

ఈ బృందం శాస్త్రవేత్తలు ధూమపానం చేయని వారిని ఇందుకోసం ఎంచుకున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న 28 మంది ధూమపానం చేయని వారితో ఈ సర్వే కండక్ట్ చేశారు. వారు ల్యాబ్ ను సందర్శించే ఆరు గంటల ముందు ఎటువంటి ఆహారం తీసుకోవద్దని తెలిపారు. కేవలం మంచి నీళ్లు మాత్రమే తీసుకోవాలని సూచించారు. తర్వాత శాస్త్రవేత్తలు వారి పల్స్ వేవ్ వెలాసిటీని తీసుకున్నారు. ఈ విధంగా సర్వేను పూర్తి చేశారు.