వర్షాకాలంలో తినాల్సిన 4 సూపర్ ఫుడ్స్ ఇవే..

వర్షాకాలం వస్తూ వస్తూనే అనేక వ్యాధులను ముట్టగట్టుకుని వస్తుంది వర్షాకాలంలో ఎక్కువగా అందరూ జబ్బుల బారిన పడుతూ ఉంటారు అంటువ్యాధుల ప్రమాదం కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది తేమతో కూడిన వాతావరణం, గాలులతో కూడిన వాతావరణం, భారీ వర్షాలు, నీరు నిలిచిపోవడం, జర్మ్స్ , బ్యాక్టీరియా ను ప్రేరేపిస్తాయి. వానాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు కూడా సర్వసాధారణం. అందువలన ఋతుపవనాల సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడానికి మనకి బలమైన రోగనిరోధక శక్తి ఉండాలి. వర్షాకాలంలో […]

Share:

వర్షాకాలం వస్తూ వస్తూనే అనేక వ్యాధులను ముట్టగట్టుకుని వస్తుంది వర్షాకాలంలో ఎక్కువగా అందరూ జబ్బుల బారిన పడుతూ ఉంటారు అంటువ్యాధుల ప్రమాదం కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది తేమతో కూడిన వాతావరణం, గాలులతో కూడిన వాతావరణం, భారీ వర్షాలు, నీరు నిలిచిపోవడం, జర్మ్స్ , బ్యాక్టీరియా ను ప్రేరేపిస్తాయి. వానాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు కూడా సర్వసాధారణం. అందువలన ఋతుపవనాల సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడానికి మనకి బలమైన రోగనిరోధక శక్తి ఉండాలి. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం మీ ఆహారంలో ఈ నాలుగు రకాల మార్పులు చేసుకోవాలి. మీ ఆహారంలో ఇప్పుడు చెప్పుకోబోయే నాలుగు సూపర్ ఫుడ్లను జోడించడం వల్ల మీరు ఆరోగ్యంగా వ్యాధి రహితంగా ఉండగలుగుతారు. మరి ఈ వర్షాకాలంలో మీరు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలేంటో తెలుసుకుందాం.

వండిన ఆహారాలు ఎక్కువ తినండి..

ఈ సీజన్లో సూక్ష్మజీవుల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అందువలన పచ్చిగా ఉండే ఆహారం తీసుకోవడం కంటే కూడా వండిన ఆహారాన్ని తినడం మంచిది. వర్షాకాలంలో వేడివేడిగా ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది తేలికైనా సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆవిరి లేదా వండినా కూరగాయలు, బీరకాయ, గుమ్మడి, మొక్కజొన్న, కిచిడి, పెసర, సెనగపిండి, ఓట్ మీల్, సలాడ్ , పండ్లు తో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎంచుకోవచ్చు‌. వంటలకు తేలికగా ఉండే పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, ఆలివ్ వంటి నూనెలను ఎంచుకోవచ్చు. నెయ్యి కూడా ఉపయోగించవచ్చు. హెవీ నూనెలైనా ఆవనూనె, వేరుశనగ, వెన్న నూనెలను వాడకపోవడమే మంచిది. ఈ కాలంలో చేదుగా ఉండే కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. వేప మెంతులు, పసుపు, కాకరకాయ వంటి మూలికలు ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి సహాయపడతాయి. వర్షాకాలంలో కనీసం ఒక వారంలో రెండు సార్లు నువ్వుల నూనెతో మర్దన చేసుకుని స్నానం చేయడం మంచిది.

హెర్బల్ టీలు మాత్రమే తీసుకోండి..

వెచ్చటి పానీయాలు తీసుకోకుండా టీ కాఫీలకు బదులుగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీలు వంటివి తీసుకోవాలి. వాటితో పాటు అల్లం, తేనె, మిరియాలుతో తయారుచేసిన టీలను తాగితే వర్షాకాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. తులసి, పుదీనా ఆకుల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

ఆహారంలో ప్రోబయోటిక్స్ చేర్చండి..

వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది అందువలన ఎక్కువగా వ్యాధులు చుట్టుముడతాయి. అందువలన మీ ఆహారంలో ప్రోబయోటిక్ ఆహారాలను చేర్చండి. ప్రోబయోటిక్స్ మీ చిన్న పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ కారక క్రిములను మీ శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. పెరుగు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ గింజలు , త్రృణధాన్యాలు, నట్స్ , చిక్కుళ్ళు, ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఫుడ్స్,  పులియపెట్టిన ఆహారాలు మీ డైట్ లో భాగం చేసుకోవాలి. 

ఒమేగా3 ఫ్యాటీ ఫుడ్స్..

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్  మన ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇన్ఫ్లమేషన్ నుండి శరీరాన్ని రక్షించడానికి దోహదపడతాయి. బాదం గింజలు, అవిస గింజలు, చేపలు , పుచ్చ విత్తనాలు, వాల్నట్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఇప్పుడు చెప్పుకున్న ఆహార పదార్థాలను మీ డైట్ లో భాగం చేసుకుంటే మాన్ సున్ సీజన్లో వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు.