మన ప్లేట్ ఫుల్ ఉంటే సరిపోదు, మన మైండ్ కూడా ఫుల్ కంట్రోల్ లో ఉండాలి అప్పుడే తిన్నది అరుగుతుంది. మనం ఆహారాన్ని తినేటప్పుడు, నిజంగా ఆకలి వల్ల తింటున్నామా లేదంటే, స్ట్రెస్ కారణంగా, మనకి బోర్ కొట్టడం వల్ల, ఏం చేయాలో తోచక తింటున్నామా అనేది గమనించుకోవాలి. ఒత్తిడి ఉన్నప్పుడు తినడం కూడా మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అందుకే తినేటప్పుడు మనసు వాతావరణం బాగుండేలా చూసుకోవాలి.
ఇప్పుడు మన ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఒత్తిడితోనే బతుకుతున్నారు. ఇలా ఒత్తిడు పడుతూ తినడం వల్ల
మనం తిన్నది సరిగా అరగదు. మన బాడీకి కావాల్సిన పోషకాలు అందవు. ఇలా తినకుండా కాస్త ప్రశాంతంగా తింటే మన బాడీకి కావాల్సినవన్నీ అందుతాయి అని న్యూట్రిషనిస్ట్ కరిష్మా షా తన లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో తెలియజేశారు.
మనం తినే ముందు ఆకలిగా ఉన్నామా లేదా అని తెలుసుకొని తినాలి. ఆకలిగా లేకుండా తింటే మనం సరిగా తినం. ఇంకా మనకు కొంచెం తినగానే తినాలనిపించదు. అందుకే కాస్త ఆలోచించి ఆకలిని తెలుసుకొని తినడం వల్ల మన ఒంటికి కావలసిన పోషకాలు చక్కగా అందుతాయి.
నెమ్మదిగా తినడం వల్ల మనం ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇలా తినడం వల్ల దీని టేస్ట్ ఆస్వాదిస్తూ తినొచ్చు. మెల్లగా తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది.
మనం రోజులో ఎంత బిజీగా ఉన్నా తినేటప్పుడు వేరే విషయాలు ఆలోచించకూడదు. టీవీ చూస్తూ తినకపోవడం మంచిది. టీవీ చూడడం వల్ల వేరే ఆలోచనలు పెట్టుకోవడం వల్ల మనం తిండి మీద ఫోకస్ పెట్టట్లేదు. మనం వేరే విషయాల మీద ఫోకస్ కాస్త తగ్గించి ప్రశాంతంగా తినడం వల్ల మనం హెల్దిగా ఉంటాం.
మనం సరైన ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల మన ఫోకస్ అంతా ఆ ఫుడ్ మీదనే ఉంటుంది. సరైన న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ మీద ఫోకస్ పెట్టాలి. ఇంకా మన మనసుకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది.
మనకు ఎంత ఆకలైతే అంతే తినాలి. అలా కాదని అతిగా తింటే మనం కోరి సమస్యలు తెచ్చుకున్నట్టే. అందుకే మన బాడీకి సరిపోయేంత ఫుడ్ తీసుకోవాలి.
మన శరీరానికి సరిపోయినంత శ్రమను కూడా ఇవ్వాలి. ఇంకా మనం రెగ్యులర్ గా వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు ఆకలి అవుతుంది. మనం ఫుడ్ మీద ఫోకస్ పెడతాం అప్పుడు మనం తిన్నది మనకు అరుగుతుంది. ఇలా చేస్తూ ఉండడం వల్ల క్రమంగా ఒత్తిడి దూరమై మనం హెల్ది లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటాం. సైక్లింగ్ చేయడం వల్ల కూడా మన ఒత్తిడి దూరం అవుతుంది. రెగ్యులర్గా పది నిమిషాలు సైక్లింగ్ చేయడం వల్ల గుండె మీద ఒత్తిడి అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకా సైక్లింగ్ చేయడం వల్ల మనం నాజుకుగా ఉంటాం. షుగర్ బీపీ లాంటివి కూడా మనకు రాకుండా ఉంటాయి. మనం ఒత్తిడి పడకుండా ఉండడానికి పై నియమాలన్నీ పాటించాలి. ఈ నియమాల్ని పాటిస్తే మనం ఒత్తిడి పడకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు మనం తిన్నది మనం ఒంటికి పడుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటాం.
ఇకపై మీరు పైన చెప్పిన నియమాలు పాటించి మీ ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటారు అని కోరుకుంటున్నాం. మనం అది చేయాలి కూడా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకుంటే మనం ఏం చేయలేం. పైగా మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా ఆరోగ్యం లేకుంటే అది వేస్ట్ అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోండి.