మైక్రో ప‌రిక‌రాల సాయంతో బ్రెయిన్ క్యాన్స‌ర్ ట్రీట్మెంట్‌

క్యాన్సర్.. ఇది ఎంత డేంజర్  మన అందరికి తెలిసిందే. ఈ కాలంలో  రకరకాల క్యాన్సర్ల పేర్లు వింటున్నాం. మానవ శరీరంలో ఉండే దాదాపు అన్ని భాగాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రపంచంలో కొట్ల మంది క్యాన్సర్ భారీగా పడుతున్నా.. మెడిసిన్స్‌ మాత్రం ఇప్పటికీ కనుగొనడం లేదు. అయితే, కొన్ని రకాల లేజర్ ట్రీట్‌ మెంట్స్ ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో క్యాన్సర్‌ను క్యూర్ చేయడం లేదు. క్యాన్సర్‌ చికిత్స కోసం ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే […]

Share:

క్యాన్సర్.. ఇది ఎంత డేంజర్  మన అందరికి తెలిసిందే. ఈ కాలంలో  రకరకాల క్యాన్సర్ల పేర్లు వింటున్నాం. మానవ శరీరంలో ఉండే దాదాపు అన్ని భాగాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రపంచంలో కొట్ల మంది క్యాన్సర్ భారీగా పడుతున్నా.. మెడిసిన్స్‌ మాత్రం ఇప్పటికీ కనుగొనడం లేదు. అయితే, కొన్ని రకాల లేజర్ ట్రీట్‌ మెంట్స్ ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో క్యాన్సర్‌ను క్యూర్ చేయడం లేదు. క్యాన్సర్‌ చికిత్స కోసం ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా బ్రెయిన్ క్యాన్స‌ర్ చికిత్స చేయడానికి ఓ మైక్రో డివైస్‌ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 

బ్రెయిన్ క్యాన్సర్‌ కు చికిత్స చేయడానికి బియ్యపు గింజ పరిమాణం, ఆకారంలో ఉండే మైక్రో డివైస్‌లను ఉపయోగించవచ్చని ఓ స్టడీలో తెలింది. స్టాండర్డ్‌ ఆఫ్ కేర్ సర్జరీ సమయంలో ఈ డివైస్‌ను ఉపయోగించే విధంగా అభివృద్ధి చేశారు. రోగులపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా ఫేజ్‌ 1 క్లినికల్ ట్రయల్‌లో గ్లియోమా కణితులపై ప్రభావం చూపిస్తుంది. 

బియ్యపు గింజ పరిమాణం, ఆకారంలో ఉండే వినూత్న పరికరాన్ని మాస్ జనరల్ బ్రిగమ్ హెల్త్‌కేర్ సిస్టమ్‌ వ్యవస్థాపక సభ్యుడైన బ్రిఘం, ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మొదడు, మెన్నుపాము కణితులైన గ్లియోమాస్ ఉన్న పేషెంట్లలో చికిత్స కోసం ఈ డివైస్‌ను రూపొందించారు. ఈ క్లినికల్ ట్రయల్ ఫలితాలను సైన్స్ ట్రాన్స్ లేషనల్ మెడిసిన్లో ప్రచురించారు. 

క్యాన్సర్ సోకిన కణితులపై ఈ చికిత్స ఏ రోగికి ఏ మెడిసిన్  ఏ విధంగా పనిచేస్తుందో తాము అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఎండీ, కోప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, కో రైటర్ పియర్ పోలో పెరుజ్జీ అన్నారు. ఈయన బ్రిఘమ్, ఉమెన్స్ హాస్పిటల్లోని న్యూరోసర్జరీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్నాడు.

ఈ డివైస్‌ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి తమ దగ్గర అందుబాటులో ఉన్న సాధనాలు సరిపోవు. కాబట్టి, మేము ప్రతి రోగిని వారి సొంత ల్యాబ్‌గా మార్చాలనే ఆలోచనలతో ముందకొచ్చాం. ఇది సజీవ కణితిపై నేరుగా ప్రభావం చూపే పరికరాన్ని ఉపయోగించడం ద్వారా తెలుస్తుంది.

అమెరికాలోఏటా 20 వేల మంది..

అమెరికాలో ప్రతి సంవత్సరం 20 వేల మంది గ్లియోమాస్‌తో బాధపడుతున్నారు. ఇది మెదడు, మెన్నుపామును ప్రభావితం చేసే ఒక రకమైన ట్యూమర్ (కణతి). ఈ గ్లియోమాస్‌ ప్రాణాంతక మెదడు క్యాన్సర్లలో ఒకటి. దీనికిట్రీట్ మెంట్ చేయడం చాలా కష్టం. గ్లియోమా థెరపీలను అభివృద్ధి చేయడం సవాల్‌ తో కూడుకున్నది. ట్యూమర్‌‌లోని కణాలలో అనేక రకాల మెడిసిన్స్ కలయికలను పరీక్షించడం  కష్టంగా ఉంటుది. ఎందుకంటే పేషెంట్లకు ఒకేసారి ఒక విధానంతో చికిత్స్ చేయడం మాత్రమే సాధ్యమవుతుంది. గ్లియోమాస్ వంటి కష్టతరమైన చికిత్స క్యాన్సర్లను ఇది ఒక ముఖ్యమైన అవరోధంగా ఉంది. దీని కోసం కాంబినేషన్‌ థెరపీలు కూడా ఓ మంచి మార్గం. 

ఈ ట్రీట్‌మెంట్‌లో ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఆ డివైస్‌ను అభివృద్ధి చేయడంలో బ్రిగ్‌హామ్‌లోని రేడియోలజీ డిపార్ట్మెంట్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌‌ అయిన కోప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌‌ ఆలివర్ జోనాస్‌తో కలిసి పెరుజ్జీ గ్లియోమాస్‌ పనిచేశారు. ఈ మైక్రో డివైసెస్‌ను ఆపపరేషన్ సమయంలో పేషెంట్‌ కణితిలో అమర్చుతారు. సర్జరీ పూర్తయ్యే లోపు ఈ డివైస్‌ను తొలగిస్తారని ఆలివర్ తెలిపారు. ప్రతి పేషెంట్‌ ట్యూమర్‌‌ లక్షణాలను క్యాప్చర్‌‌ చేసే విధంగా తాము దీనిని అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని పెరుజ్జీ పేర్కొన్నారు. 

డివైస్‌ను తీసివేయొచ్చు..

ఈ డివైజ్ ను అమర్చిన సమయంలో 23 గంటల పాటు పేషెంట్‌ మెదడులోని ట్యూమర్‌‌ భాగంలో ప్రాంతాల్లో 20 మెడిసిన్స్‌ గా డివైడ్ అయి, ట్రీట్‌మెంట్‌లో ఉపయోగపడుతుంది. సర్జరీల సమయంలో ఈ డివైస్‌ను తీసివేస్తారు. తర్వాత ట్యూమర్‌‌ ఏరియాలో ఉండే కణజాలాన్ని తీసుకొని, అనాలసిస్‌ కోసం తిరిగి ల్యాబ్‌ పంపిస్తారు. ట్యూమర్‌‌ శరీరంలో ఉన్నప్పుడే పరికరం పనిచేస్తుంది కాబట్టి, ఈ విధంగా ప్రయోగాలు చేయడం వల్ల మెడిసిన్స్ వల్ల ట్యూమర్‌‌ ఎంత మేర ప్రభావితం అయ్యిందో, దాని సామర్థ్యం ఎంతో తెలుస్తుందని పరిశోధకులు తెలిపారు.

ప్రస్తుత స్టడీలో గ్లియోమా ట్యూమర్‌‌ను తొలగించడానికి మెదడు సర్జరీ చేయించుకుంటున్న ఆరుగురు పేషెంట్లపై పరీక్షించారు. ఈ పేషెంట్లలో ఎవరూ కూడా ఆ మైక్రో డివైజ్ వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలను వారు ఎదుర్కోలేదు. ఈ పరిశోధనల్లో బయోలాలిజకల్ డేటాను సెకరించారు. 

పరికరం సురక్షితంగా ఉందని మరియు శస్త్రచికిత్సా పద్ధతిలో సులభంగా చేర్చవచ్చని అధ్యయనం నిరూపించినప్పటికీ, గ్లియోమా థెరపీని ఆప్టిమైజ్ చేయడానికి ఇది సేకరించే డేటాను ఉపయోగించాల్సిన ఖచ్చితమైన మార్గాలను నిర్ణయించడంలో పరిశోధకులు ఇప్పటికీ కృషి చేస్తున్నారు. పరిశోధకులు ప్రస్తుతం వారి ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. దీనిలో పేషెంట్లు వారి సర్జరీకి 72 గంటల ముందు డివైస్‌ను స్వీకరిస్తారు. ఈ డివైస్‌ను కొత్త తరం విధానంపై తాము ఆశాజనకంగా ఉన్నామని పెరుజ్జీ తెలిపారు.