పెద్దలలో మానసిక ఆరోగ్య సమస్యలు

పెద్దలలో సాధారణ మానసిక ఆరోగ్య సమస్యలు ఏమిటి?వాటి గురించి తెలుసుకోవడానికి చదవండి మానసిక ఆరోగ్య రుగ్మతలు అనేక తరాలుగా మనుషుల్లో ఎక్కువగానే ఉంటున్నాయి. కానీ మనం ఈ సమస్యను గుర్తించడం మరియు దానికి చికిత్స తీసుకోవడం ప్రారంభించడం ఇటీవలే స్టార్ట్ చేశాం. మానసిక ఆరోగ్య సమస్యలు వ్యక్తి ఆలోచనలు, మనోభావాలు, ప్రవర్తనలపై ప్రభావం చూపుతాయి. ఆహారం, కార్యాచరణ స్థాయి వంటి మన జీవనశైలి ఎంపికలు అటువంటి పరిస్థితుల ఆవిర్భావాన్ని ప్రభావితం చేయవచ్చు. వయోజన జీవితం బాధ్యతలు, చాలా […]

Share:

పెద్దలలో సాధారణ మానసిక ఆరోగ్య సమస్యలు ఏమిటి?
వాటి గురించి తెలుసుకోవడానికి చదవండి

మానసిక ఆరోగ్య రుగ్మతలు అనేక తరాలుగా మనుషుల్లో ఎక్కువగానే ఉంటున్నాయి. కానీ మనం ఈ సమస్యను గుర్తించడం మరియు దానికి చికిత్స తీసుకోవడం ప్రారంభించడం ఇటీవలే స్టార్ట్ చేశాం. మానసిక ఆరోగ్య సమస్యలు వ్యక్తి ఆలోచనలు, మనోభావాలు, ప్రవర్తనలపై ప్రభావం చూపుతాయి. ఆహారం, కార్యాచరణ స్థాయి వంటి మన జీవనశైలి ఎంపికలు అటువంటి పరిస్థితుల ఆవిర్భావాన్ని ప్రభావితం చేయవచ్చు. వయోజన జీవితం బాధ్యతలు, చాలా ఒత్తిడితో నిండి ఉంటుంది. ఒక వైపు ఇది మన శారీరక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మరోవైపు ఇది మన మానసిక శ్రేయస్సుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దలు ఎదుర్కొనే కొన్ని సాధారణ రుగ్మతలు ఇక్కడ ఉన్నాయి. ఆలస్యం చేయకుండా వీటికి చికిత్స తీసుకోవాలి.

డిప్రెషన్

ఇది పెద్దలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ మానసిక ఆరోగ్య సమస్యల్లో ఒకటి. మనలో చాలా మంది మన జీవితంలో ఏదో ఒక సమయంలో తెలిసి లేదా తెలియక దీనిని ఎదుర్కొని ఉంటారు. ఇది తరచుగా జీవితంలో ఆసక్తి కోల్పోవడం, సాధారణ దుఃఖం, అపరాధ భావాలు లేదా బలహీనమైన స్వీయ విలువ, నిద్రలో ఇబ్బంది, ఆహారపు అలవాట్లలో మార్పులు, అలసట, దృష్టి లేకపోవడం వంటివి తరచుగా దీనిలో వ్యక్తమవుతాయి. డిప్రెషన్ పనిలో ఉత్పాదకంగా పనిచేసే మన సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది. సంబంధాలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది చాలా కాలం పాటు ఉండే లేదా పునరావృతం అయ్యేలా ఉండవచ్చు. మనలో చాలామంది దీనిని దాని ప్రారంభ దశల్లో విస్మరిస్తారు. దీంతో ఇది పెరిగి తీవ్రంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆందోళన రుగ్మతలు

ఒక వ్యక్తి డిప్రెషన్‌తో బాధ పడుతుంటే ఇలాంటి ఆందోళన లాంటి రుగ్మతలు తరచుగా మొదలవుతాయి. ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు బాధను, తరచుగా భయాన్ని అనుభవిస్తారు. అలాగే ఎప్పుడూ సుఖంగా కూడా ఉండరు. వారు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతారు. చాలా తక్కువ ఆత్మ గౌరవం కలిగి ఉంటారు.

ఈటింగ్ డిజార్డర్స్

ఈటింగ్ డిజార్డర్స్ అనేది సంక్లిష్టమైన మానసిక రుగ్మతలకు ఒక సూచనగా చెప్పవచ్చు. అది మనం ఎంత లేదా ఏమి తింటున్నామో అనే దానిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చాలా మంది వ్యక్తులు తమ రూపాన్ని చూసి సంతోషించని లేదా జీవితంలో కొన్ని కష్టతరం అయిన దశలను అనుభవిస్తారు లేదా అతిగా తినడం ప్రారంభిస్తారు. అటువంటి రుగ్మతలకు కారణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా చెప్పాలంటే వైవిధ్యంగా ఉంటాయి. అయితే వైద్య మరియు మానసిక నిపుణులను తరచుగా సంప్రదించడం ఇలాంటి రుగ్మతలను తగ్గించడంలో చాలా అవసరం. మన పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఒత్తిడి తరచుగా మన ఆహారపు విధానాలలో ప్రతిబింబిస్తుంది.

పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)

ఇది ప్రమాదాలు, కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడిని కోల్పోవడం లేదా క్రూరమైన నేరానికి ప్రత్యక్ష సాక్ష్యమవ్వడం వంటి మన జీవితంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బాధాకరమైన సంఘటనల వల్ల కలిగే పరిస్థితి. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్న వ్యక్తులు అనుకోకుండా బాధాకరమైన సంఘటనలను బాధాకరమైన రీతిలో గుర్తు చేసుకుంటారు. వారికి పీడకలలు లేదా ఆ క్షణాల ఫ్లాష్‌బ్యాక్‌లు ఎక్కువగా మెదులుతూనే ఉండవచ్చు.