పీరియడ్స్ పరిశుభ్రత దినం: పీరియడ్స్ టైం లో మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే

కాలం మారుతున్న కొద్దీ పీరియడ్స్ గురించి చాలామందికి ఎన్నో అపోహలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇకపోతే దీనిపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది మే 28వ తేదీన ప్రపంచ ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  ఋతుస్రావం అనేది స్త్రీ శరీరంలో జరిగే ఒక సహజ ప్రక్రియ.. కానీ ఆ సమయంలో మహిళల పరిస్థితి అంత బాగుండదు. అంతేకాదు ముఖ్యంగా మహిళలలో ప్రతి ఒక్కరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఇంకా బహిష్టుగానే చూస్తూ ఉండడం గమనార్హం.  […]

Share:

కాలం మారుతున్న కొద్దీ పీరియడ్స్ గురించి చాలామందికి ఎన్నో అపోహలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇకపోతే దీనిపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది మే 28వ తేదీన ప్రపంచ ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  ఋతుస్రావం అనేది స్త్రీ శరీరంలో జరిగే ఒక సహజ ప్రక్రియ.. కానీ ఆ సమయంలో మహిళల పరిస్థితి అంత బాగుండదు. అంతేకాదు ముఖ్యంగా మహిళలలో ప్రతి ఒక్కరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఇంకా బహిష్టుగానే చూస్తూ ఉండడం గమనార్హం.  ఇకపోతే పీరియడ్ సమయంలో కొందరికి ఎలాంటి సమస్యలు కలగకపోయినా మరికొంతమందికి మాత్రం పొత్తికడుపు నొప్పి , నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు,  కాళ్ల నొప్పులు,  తీవ్రమైన రక్తస్రావం, వాంతులు, నీరసం, వికారం , తలనొప్పి వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

ఇలాంటి సమయంలోనే ఆడవారు మరింత పరిశుభ్రతను పాటించాల్సి ఉంటుంది.. ఇకపోతే పీరియడ్స్ సమయంలో పాటించవలసిన పరిశుభ్రత గురించి ఇప్పటికీ చాలామందికి స్పష్టమైన ఆలోచన లేదు. దీనిపై అవగాహన కల్పించాలి.. అలాగే దానికి సంబంధించిన అపోహాలను కూడా తొలగించడమే లక్ష్యంగా ఈ పీరియడ్స్ పరిశుభ్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2030 నాటికి పీరియడ్స్ కారణంగా మహిళలు లేదా బాలికలు వెనక్కి తగ్గని ప్రపంచాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఒక థీమ్‌ను గత ఏడాది ఏర్పాటు చేయడం జరిగింది. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సామాజిక సమస్యల గురించి ఈరోజున ప్రత్యేకించి అందరిలో అవగాహన కల్పిస్తారు.

ఇకపోతే 2013లో మొదటిసారి జర్మనీ నాన్ ప్రాఫిట్ వాష్ యునైటెడ్ పీరియడ్స్ పరిశుభ్రతా  దినోత్సవాన్ని ప్రారంభించింది. దీనిని 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున జరుపుకుంటారు.. ఇకపోతే పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే.. పీరియడ్స్ సమయంలో తరచుగా ప్యాడ్స్ మార్చుకుంటూ ఉండాలి.  లేదంటే ఎన్నో అంటూ వ్యాధులతో సహా ఇతర వ్యాధులు కూడా రావచ్చు.  కాబట్టి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి పాడ్ మార్చడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో పాటు ఇతర అలర్జీలను కూడా దూరం చేసుకోవచ్చు. ఋతుస్రావం సమయంలో సబ్బు, ఇతర జెల్ ఐటమ్ లాంటివి ఉపయోగించకుండా శుభ్రమైన నీటితోనే ప్రైవేటు భాగాలను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.

పోతే ఈ సానిటరీ నాప్కిన్లను పడేయడం కూడా ఇప్పుడు ఒక ప్రధాన సమస్యగా మారింది.. ఉపయోగించిన తర్వాత వాటిని గట్టిగా ఒక కవర్లో చుట్టి పారేయాలి. లేదా ఒక దగ్గర స్టోర్ చేసి ఐదు రోజుల తర్వాత వాటిని కాల్చివేయడం ఉత్తమం. కానీ ఎక్కువ రోజులు వాటిని స్టోర్ చేయకండి. పీరియడ్స్ రావడానికి ఒక రోజు ముందు ప్రైవేటు భాగాల దగ్గర ఉన్న వెంట్రుకలను కూడా తొలగించాలి.లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అంతేకాదు ఈ సమయంలో తీసుకునే ఆహార విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.  ఎందుకంటే జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకునే అలవాటున్న వారు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కాఫీ వంటి పానీయాలకు దూరంగా ఉండాలి. ఇక ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్నానం చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా శుభ్రత పాటించడం ద్వారా ఎన్నో వ్యాధులకూ దూరంగా ఉండవచ్చు.