Eyes: జెనెటిక్ టెస్టు ద్వారా కంటి సమస్యలకు చెక్

సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అంటే అవయవాలలో ముఖ్యమైన పాత్ర పోషించేవి కళ్ళు (eyes). కళ్ళను మనం ఎప్పుడు కూడా చాలా పదిలంగా చూసుకోవాలి. కళ్ళు (eyes) కనిపించకుండా ఎంతోమంది ఎన్నో బాధలు పడుతున్నారు. అంతేకాకుండా కంటి సమస్యల కారణంగా ఎంతోమంది తమ కంటి చూపు కోల్పోతున్నారు. అయితే జెనెటిక్ టెస్ట్ అనేది ముందుగానే చేయించుకోవడం ద్వారా కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.  కళ్ళను పదిలంగా ఉంచుకోండి:  ఇన్హెరిటెడ్ రెటీనా వ్యాధులు (IRD) అనేది రెటీనా […]

Share:

సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అంటే అవయవాలలో ముఖ్యమైన పాత్ర పోషించేవి కళ్ళు (eyes). కళ్ళను మనం ఎప్పుడు కూడా చాలా పదిలంగా చూసుకోవాలి. కళ్ళు (eyes) కనిపించకుండా ఎంతోమంది ఎన్నో బాధలు పడుతున్నారు. అంతేకాకుండా కంటి సమస్యల కారణంగా ఎంతోమంది తమ కంటి చూపు కోల్పోతున్నారు. అయితే జెనెటిక్ టెస్ట్ అనేది ముందుగానే చేయించుకోవడం ద్వారా కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. 

కళ్ళను పదిలంగా ఉంచుకోండి: 

ఇన్హెరిటెడ్ రెటీనా వ్యాధులు (IRD) అనేది రెటీనా పొరలను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మతలు (genetic problem). మన కంటికి కనిపించే వస్తువులకు ఈ రెటీనా పొర ప్రాధాన్యత వహిస్తుంది.. ప్రపంచ వ్యాప్తంగా అవి దృష్టి లోపానికి కారణం IRD. నిజానికి ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేయవచ్చు. దీనికి ఎఫెక్ట్ అయిన వారు చూపు మసక మసకగా కనిపించడం కాకుండా, అంధత్వానికి దారితీసే అవకాశం లేకపోలేదు. 

వంశపారంపర్య వ్యాధికి జన్యుపరమైన కారణాన్ని తెలుసుకోవడం, వ్యాధిని అభివృద్ధి చేసే కారకాలను ముందుగానే గుర్తించడం అనేది ఇటువంటి, ఇన్హెరిటెడ్ రెటీనా వ్యాధులు (IRD) నిర్వహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇతర తరాల వారికి కూడా ఎటువంటి వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవడం కూడా ఎంతో మంచిది. జీవనశైలిని మార్చుకోవడం, వాతావరణం, రోజు చేసే అలవాట్లు ఇలా చాలా విషయాలు అంశాలు, వ్యాధికి కారణాలు కావచ్చు. ఎటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి, మనం ఎలాంటివి మన జీవనశైలిలో మార్చుకోవాలి ఇలా అనేకమైన అంశాలు మనం జెనెటిక్ (genetic) టెస్టు ద్వారా తెలుసుకుని నిపుణులు మనకి సలహా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మన కళ్ళు (eyes) మనకి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. కాబట్టి పలు జాగ్రత్తగా తీసుకోవడం వల్ల కంటి సమస్యల నుంచి దూరమవచ్చు. 

IRDలో ఎన్నో రకాలు: 

వంశపారంపర్య రెటీనా వ్యాధులు (IRDలు) 20కి పైగా ఉంటాయి. ఇందులో పుట్టుకతో వచ్చే స్టేషనరీ నైట్ బ్లైండ్‌నెస్ (CSNB), లెబెర్ కంజెనిటల్ అమౌరోసిస్ (LCA), రెటినిటిస్ పిగ్మెంటోసా (RP), కోన్-డిస్ట్రోఫీ (CD), కోన్-రాడ్ డిస్ట్రోఫీ (CRD) ఆప్టిక్ క్షీణత (OA) ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. అయితే ఇటువంటి వాటికి సంబంధించి ముందుగానే కారణాలు కనుక్కోవడం వల్ల, ఇతర తరాలకు ఇటువంటి కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. జెనోమిక్స్, జెనెటిక్ టెస్టింగ్ రంగంలో పురోగతితో, మొదటి బిడ్డ వారసత్వంగా కంటి రుగ్మతతో బాధపడుతుంటే, ఈ రోజు మనకు పరీక్షలు ఉన్నాయి. ఇటువంటి పరీక్షలు నిర్వహించే వ్యాధికి జన్యుపరమైన కారణాన్ని గుర్తించి, తల్లిదండ్రులను పరీక్షించడం జరుగుతుంది. సమస్యలు ఉన్న పిల్లలకి కాకుండా.. తన తోబుట్టువులకు కంటి లోపాలు ఎందుకు లేవో కూడా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని, ఇతర పుట్టబోయే పిల్లల కోసం జాగ్రత్తలు తీసుకోవచ్చు. 

సింటమ్స్: 

IRDల లక్షణాలు సాధారణంగా రాత్రి కళ్ళు కనిపించకపోవడం, దూర దృష్టిని కోల్పోవడం, దగ్గరున్నవి కూడా కనిపించకపోవడం, ఇది కాలక్రమేణా కంటి చూపులు కోల్పోయేలా చేస్తుంది. దృష్టిపై IRDల ప్రభావం తీవ్రంగా ఉంటుంది, రోజువారీ కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది, వారి జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. IRDలకు ప్రస్తుతం ఎటువంటి నివారణ లేదు, కానీ జన్యు చికిత్స, రెటీనా ఇంప్లాంట్లు వంటి ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది, అంతేకాకుండా వ్యాధి పురోగతిని నెమ్మదిగా లేదా ఆపడానికి మరియు దృష్టిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

వారసత్వంగా వచ్చే రెటీనా వ్యాధుల కోసం జన్యు పరీక్ష(genetic test):

జన్యు (genetic) పరీక్ష అనేది ముఖ్య సమస్యను గుర్తించడానికి కీలక పాత్ర పోషిస్తుంది, అంతేకాకుండా సమస్యకు మూలాన్ని గుర్తించడం, రోగ నిరూపణ, మెరుగైన వ్యాధి నిర్వహణ మరియు సాధ్యమైన ట్రీట్మెంట్ తీసుకునేందుకు దారితీస్తుంది. ఉపయోగించిన జన్యు(genetic) పరీక్ష అనంతరం, సుమారు 3 నుంచి 6 వారాల లోపు రిజల్ట్స్ అనేవి వస్తాయి.