కంటిచూపు మెరుగుపడాలంటే ఉల్లిపాయలు తినాల్సిందే..

ప్రస్తుత ఆధునిక జీవనవిధానంలో కొన్నిపనులు తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది . అందులో మొదటిది ఆఫీసులో పని ఒత్తిడి.. కళ్ళకు కంప్యూటర్‌ల వల్ల శ్రమ తప్పదు. గంటల తరబడీ కంప్యూటర్, మొబైల్, టీవీ ముందు గడపటం వల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యల బారిన పడుతున్నారు. దీనితో సరైన నిద్రలేకపోవడంతో కళ్ళ కింద నల్లటి వలయాలు , కంటి చూపు మందగించడం ,కళ్ళ మంటలు, కళ్ళ నుండి నీరు కారటం వంటివి జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు […]

Share:

ప్రస్తుత ఆధునిక జీవనవిధానంలో కొన్నిపనులు తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది . అందులో మొదటిది ఆఫీసులో పని ఒత్తిడి.. కళ్ళకు కంప్యూటర్‌ల వల్ల శ్రమ తప్పదు. గంటల తరబడీ కంప్యూటర్, మొబైల్, టీవీ ముందు గడపటం వల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యల బారిన పడుతున్నారు. దీనితో సరైన నిద్రలేకపోవడంతో కళ్ళ కింద నల్లటి వలయాలు , కంటి చూపు మందగించడం ,కళ్ళ మంటలు, కళ్ళ నుండి నీరు కారటం వంటివి జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు కళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా కంటి సమస్యలు ఏర్పడకుండా చిన్న చిన్న ఆహార మార్పులు, జీవనశైలి ఏర్పాటు చేసుకున్నట్లయితే కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

ఉల్లిపాయల్లో సెలీనియం ఉంటుంది. ఇది విటమిన్ ఇ ను ఉత్పత్తి చేస్తుంది, కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. వాటిలో క్వెర్సెటిన్ మరియు సల్ఫర్ సమ్మేళనాలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి మరియు వయస్సు-సంబంధిత పరిస్థితుల నుండి కళ్ళను రక్షిస్తాయి. ఉల్లిపాయలు గ్లాకోమా ఉన్న వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే ఇంట్రాకోక్యులర్ ప్రెషర్‌ని కూడా తగ్గించడంలో సహాయపడవచ్చు. చరిత్రలో ఉల్లిపాయలు వివిధ ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడ్డాయి. పురాతన గ్రీస్ మరియు రోమ్‌లోని ప్రఖ్యాత తత్వవేత్తలు ఉల్లిపాయలను వాటి ఔషధ విలువకు, ముఖ్యంగా దృష్టిని మెరుగుపరచడానికి ప్రశంసించారు.

ఉల్లిపాయలలో అనేక ఆరోగ్యానికి మేలు చేసే సుగుణాలు ఉన్నాయి. అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చాలా మంది చెబుతూ ఉంటారు. ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలను ఒక భాగం చేసుకొని తీసుకుంటూ ఉంటాం. అయితే పచ్చి ఉల్లిపాయలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పచ్చి ఉల్లిపాయలను తినేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం క్యాన్సర్ వంటి సమస్యలను రాకుండా చేస్తుంది అని చెబుతున్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, జ్వరంతో పాటు దగ్గును తగ్గించడానికి ఉల్లిపాయలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఉల్లిపాయల్లో ఫైబర్, విటమిన్ బి, విటమిన్ బీ సిక్స్, విటమిన్ బీ నైన్, ఖనిజ లవణాలు ఎన్నో ఉంటాయని చెబుతున్నారు.

ఇక అటువంటి ఉల్లిపాయలను మనం కూరలలో వండుకుని తినడమే కాకుండా, పచ్చి వాటిని కూడా తీసుకోవడం మంచిదని, ఉల్లిపాయలలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గొప్ప గుణం ఉంటుందని చెబుతున్నారు.ఉల్లిపాయలు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయని చెబుతున్నారు.

శరీరంలో ఉండే అనేక అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడటానికి ఉల్లిపాయలు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు. ప్రతి రోజూ ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటంలో ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే నిత్యం ఉల్లిపాయలను తిన్నప్పటికీ వాటిని మితంగానే ఆహారంలో భాగంగా చేసుకోవాలని, మంచి ఆరోగ్య ఫలితాలుంటాయని అతిగా తింటే అనర్థాలు వస్తాయని కూడా చెబుతున్నారు. శిశువులు మరియు పెంపుడు జంతువులు సాధారణంగా ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి వాటికి విషపూరితమైనవి. అతిగా ఉల్లిపాయలను తింటే కొన్ని రకాల అలెర్జీలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఎలాంటి రోగాలు లేని వారికి నిత్యం కొద్ది మోతాదులో పచ్చి ఉల్లిపాయలను తీసుకోవటం దివ్యౌషధంగా పని చేస్తుంది. ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయల విషయంలో కాస్త జాగ్రత్త. 
అలాగే, ప్రతి ఏడాది నిపుణులైన నేత్రవైద్యులతో తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఇలా చేయడంవల్ల కంటి సమస్యలు వెంటనే బయటపడి తగిన చికిత్సతో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.