మెరిసిపోయిన మానుషి చిల్లర్

బాలీవుడ్ హీరోయిన్, టాప్ మోడల్ మానుషి చిల్లర్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అమ్మడు సినిమాల్లోనే కాక బయట కూడా ఫ్యాషన్ వరల్డ్ ను ఏలుతుంటుంది. మానుషి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మానుషి పోస్ట్ చేసే ఫొటోలు కుర్రకారు మతులు పోగొడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అమ్మడుకు చాలా మంది సోషల్ మీడియా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు న్యూ ట్రెండింగ్ లో ఉండే ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ ఫొటోలను […]

Share:

బాలీవుడ్ హీరోయిన్, టాప్ మోడల్ మానుషి చిల్లర్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అమ్మడు సినిమాల్లోనే కాక బయట కూడా ఫ్యాషన్ వరల్డ్ ను ఏలుతుంటుంది. మానుషి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మానుషి పోస్ట్ చేసే ఫొటోలు కుర్రకారు మతులు పోగొడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అమ్మడుకు చాలా మంది సోషల్ మీడియా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు న్యూ ట్రెండింగ్ లో ఉండే ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. 

అదిరిపోయిన స్వెటర్… సోషల్ మీడియా షేక్

మానుషి చిల్లర్ తాజాగా డియోర్ కంపెనీకి చెందిన ఓ స్వెటర్ ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలను అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు. ఈ ఫొటోల్లో మీరు చాలా అందంగా ఉన్నారని యూజర్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మానుషి లుక్స్ మాత్రం కేకపెట్టించాయి. 

రౌండ్ నెక్ కాలర్ 

మానుషి ధరించిన గ్రీన్ కలర్ స్వెటర్‌కు రౌండ్ నెక్ కాలర్ వచ్చింది. ఇక అంతే కాకుండా అమ్మడు చేతులను పైకి మడిచి ఫొటోలకు ఓ రేంజ్ లో పోజులిచ్చింది. ఇక గోల్డెన్ హుక్ ఇయర్ రింగ్స్ ధరించిన మానుషి ఒక రేంజ్ లో ఉందనే చెప్పాలి. ఈ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ పిక్చర్స్ లో మానుషి ఒక దేవకన్యలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మానుషి తప్పకుండా టాప్ హీరోయిన్ అవుతుందని అంతా కామెంట్ చేస్తున్నారు.  

20 ఏళ్లకే అందగత్తె కిరీటం

1997లో హర్యానాలోని రోహ్‌తక్ ఏరియాలో జన్మించిన మానుషి 2017లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ గెల్చుకుంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన 2 పదుల వయసు దాటక ముందే మానుషి తన ప్రతిభను చూపెట్టింది. ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఆ విషయంతోనే అంతా షాక్‌కు గురయ్యారంటే అదే ఏడాదిలో మానుషి మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. 

విశ్వసుందరిగా గుర్తింపు

అదే 2017 సంవత్సరంలోనే మానుషి విశ్వ సుందరి (మిస్ వరల్డ్) అవార్డు గెలుచుకుంది. ఇండియన్లు విశ్వసుందరి టైటిల్ కైవసం చేసుకోవడం అరుదుగా జరుగుతుందని మరో మారు అందరికీ ప్రూవ్ చేసింది. ఇండియన్స్ తలుచుకుంటే ఏ విషయాన్నైనా సాధిస్తారని చాటి చెప్పింది. ఇక విశ్వసుందరి టైటిల్ సాధించిన తర్వాత మానుషి చిల్లర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అమ్మడుకు ఆమె ఫ్యాషన్ కు టెక్ ప్రపంచం నివ్వెర పోయింది. వరుసగా ఒక్కో బడా కంపెనీ ఆమె చేత యాడ్స్ చేయించుకునేందుకు పోటీ పడ్డాయి. ఇలా మానుషి చిల్లర్ అనతి కాలంలోనే బాగా బిజీ అయిపోయింది. అంతే కాకుండా నెమ్మదిగా మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 

వడివడిగా అడుగులు

ఇక విశ్వసుందరి కిరీటం సాధించిన తర్వాత మానుషి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా అవకాశాలు అమ్మడు తలుపు తట్టాయి. ఈ మధ్యే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ అనే మూవీలో కూడా మానుషి లీడ్ రోల్ లో నటించింది. ఆ మూవీ అంతలా హిట్ కాకున్నా కానీ మానుషి లుక్స్ కు యాక్టింగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అందుకోసమే ఈ బ్యూటీకి ఆఫర్లకు కొదువ లేకుండా పోయింది. ప్రస్తుతం చేతిలో రెండు మూడు సినిమాలతో మానుషి డైరీ ఫుల్ గా ఉంది. ఒక్క రంగంలో కాకుండా మానుషి అన్ని రంగాల్లో దూసుకుపోతుంది.