పురుషుల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి సామర్థ్యం

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి? నిపుణుల సలహాలు చెబుతున్న చక్కని చిట్కాలు ఇప్పుడు చూద్దాం. గడిచిన ఏళ్లలో పురుషుల్లో స్పెర్మ్‌కౌంట్ సుమారు 40% నుంచి 50% వరకు తగ్గినట్టు ఇటీవల హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం తెలిసింది. జీవన శైలిలో వచ్చిన అనేక మార్పులు, పర్యావరణంలోని మార్పులు కారణంగా పొల్యూషన్ వల్లే ఈ పరిస్థితి ఎదురైందని రీసెర్చ్ పరాకారం తెలిసింది. మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి తప్పకుండా కొన్ని […]

Share:

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి? నిపుణుల సలహాలు చెబుతున్న చక్కని చిట్కాలు ఇప్పుడు చూద్దాం. గడిచిన ఏళ్లలో పురుషుల్లో స్పెర్మ్‌కౌంట్ సుమారు 40% నుంచి 50% వరకు తగ్గినట్టు ఇటీవల హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం తెలిసింది. జీవన శైలిలో వచ్చిన అనేక మార్పులు, పర్యావరణంలోని మార్పులు కారణంగా పొల్యూషన్ వల్లే ఈ పరిస్థితి ఎదురైందని రీసెర్చ్ పరాకారం తెలిసింది. మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి తప్పకుండా కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించింది.

అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి: 

డైలీ రొటీన్, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు, ఉష్ణోగ్రతలు కారణంగా చాలా మంది దంపతులకు జీవితాలలో పిల్లలు లేకపోవడం ఒక సమస్యగా మారిపోయింది. సంతాన లేకపోవడం అనే సమస్య ఇప్పుడున్న మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది.  ముఖ్యంగా ఆడవారితో పోల్చుకుంటే మగవారిలో సంతాన లేమి సమస్య ఎక్కువ అవుతోందని రీసెర్చ్ లో తేలింది. మగవారిలో లైంగిక కోరికలు అనేవి ఈ మధ్యకాలంలో తగ్గడం, స్పెర్ప్‌‌‌‌‌‌‌ క్వాలిటీ లేకపోవడం, ముఖ్యంగా స్పెర్ప్‌‌‌‌‌‌‌ కౌంట్‌ తగ్గడం వంటి సమస్యలు మగవారికి ఎదురవుతున్న పెద్ద సమస్య. పురుషులలో సంతానలేమికి సంబంధించిన కేసులు ఎక్కువగా చూసుకున్నట్లయితే అందులో, స్పెర్మ్‌‌ నాణ్యతకు సంబంధించిన సమస్యలే ఉంటున్నాయట. పురుషులలో పెరుగుతున్న ఇటువంటి సమస్యల కారణంగా భార్యాభర్తలలో కలహాలు రేగే అవకాశం కూడా లేకపోలేదు. 

దీనికి ఏమిటి పరిష్కారం: 

ముఖ్యంగా ఎన్నో రకాల సమస్యల కారణంగా మగవారిలో తండ్రి అయ్యే అవకాశాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. పరిష్కారాలు అనేక రకాలు ఉంటాయి. కానీ సప్లిమెంట్లో తీసుకోవడం వల్ల,కొన్ని కొన్ని సార్లు  మరిన్ని కొత్త సమస్యలను తెచ్చి పెట్టుకునే వాళ్ళం అవుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఆహార పదార్థాల ద్వారానే మనలో ఉండే సమస్యను మెరుగుపరచుకోవడం ఎంతో ఉత్తమం.. అందులో ముఖ్యమైన పదార్థాలు..

పాలు 

అశ్వగంధ

నెయ్యి

తేనె

మరిన్ని ఆహార చిట్కాలు:

కూరగాయలు ఎక్కువగా తినండి: ముఖ్యంగా ఆకుకూరలో ఎక్కువగా తినడం మగవారు అలవాటు చేసుకోవాలి. అందులో పోషకాలు తండ్రి కావడానికి గల శక్తిని పెంచడానికి ఎక్కువగా సహాయపడతాయి. 

చేపలు ఎక్కువగా తినండి: అయితే మరి చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి, అవి స్పెర్మ్ మొటిలిటీకి ఎంతో అవసరం. అయితే మీ ఆహారంలో చేపలు చేర్చుకోవడం ఎంతో ఉత్తమం. 

కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోండి: కార్బొహైడ్రేట్లు అనేవి మన శరీరంలోకి తక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తగ్గించడమే కాకుండా, శరీరంలో టెస్టోస్టెరాన్ రిలీజ్ అవ్వడానికి సహాయపడతాయి. దాని ద్వారా వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా మొటిలిటీ పెరుగుతుంది. 

జింక్ ఉండేలా చూడండి: ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం అనేది తప్పకుండా పెరగాలంటే మీరు తినే ఆహారంలో జింక్ ఉండేలా చూసుకోవడం ఎంతో ఉత్తమం. చికెన్, పాలకూర, గుమ్మడి గింజలు, వంటి అనేక జింక్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తినడం మంచిది. 

జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి: అయితే పురుషుల్లోనే ఉన్న ఈ సమస్యకు కారణం జంక్ ఫుడ్ కూడా అవుతుంది. కార్యాలయాల్లో పనిచేస్తున్నప్పుడు ఎక్కడపడితే అక్కడ జంక్ ఫుడ్ తినడం అలవాటుగా మార్చుకున్న పురుషులలో ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి జంక్ ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

స్మోకింగ్ మానేయండి: స్మోకింగ్ అనేది ఎక్కువగా చేయడం వల్ల మనిషి బలహీన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి బానిసైన వారిలో ఎక్కువగా ఇలాంటి సమస్య కనిపిస్తుంది. 

ఇప్పటివరకు చెప్పిన విధంగా మీరు ప్రతి రోజు పాటించినట్లయితే, మీరు తప్పకుండా మంచి ఫలితాన్ని తప్పక చూస్తారు.