పొడిగా ఉన్న మీ చర్మాన్ని తాజాగా, తేమగా మార్చుకోండి

డ్రై స్కిన్ కోసం ఇంట్లోనే సహజమైన ఫేస్ ప్యాక్ ఇలా తయారు చేసుకోండి! పొడి చర్మం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, తగినంత నీరు తాగడం వల్ల కూడా పొడి చర్మం నుండి బయటపడవచ్చు. అధిక హైడ్రేటింగ్ ఉన్న ఉత్పత్తులను మీ చర్మ సంరక్షణ దినచర్యలో చేర్చాలి. దీనితో పాటు, మీరు డ్రై స్కిన్‌ను ఎదుర్కోవడానికి ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లను ప్రయత్నించవచ్చు. ఇవి మీ చర్మాన్ని మెరిసేలా మరియు తేమగా మార్చడానికి […]

Share:

డ్రై స్కిన్ కోసం ఇంట్లోనే సహజమైన ఫేస్ ప్యాక్ ఇలా తయారు చేసుకోండి!

పొడి చర్మం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, తగినంత నీరు తాగడం వల్ల కూడా పొడి చర్మం నుండి బయటపడవచ్చు. అధిక హైడ్రేటింగ్ ఉన్న ఉత్పత్తులను మీ చర్మ సంరక్షణ దినచర్యలో చేర్చాలి. దీనితో పాటు, మీరు డ్రై స్కిన్‌ను ఎదుర్కోవడానికి ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లను ప్రయత్నించవచ్చు. ఇవి మీ చర్మాన్ని మెరిసేలా మరియు తేమగా మార్చడానికి పని చేస్తాయి. మీరు వివిధ రకాల సహజ పదార్థాలను ఉపయోగించి ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసే విధానం తెలుసుకుందాం.


చలికాలంలో పొడిబారిన చర్మాన్ని తాజాగా మెరిసేలా చేసుకోవడానికి, సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉండే సహజ పదార్ధాల నుండి ఖర్చు లేకుండా ఫేస్ ప్యాక్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. సరైన పదార్ధాలను సరైన మోతాదులో కలిపి, మీ స్కిన్ టైప్‌‌‌కి సరిగ్గా సరిపోయేలా కొన్ని రకాల చర్మ సమస్యలను నివారించడానికి అప్పటికప్పుడు తాజాగా, నాచురల్ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. బొప్పాయి, కలబంద, అరటి పళ్ళ వంటి వంటింటిలో ఉండే పదార్థాలను ఉపయోగించి, మీరు మీ ఇంటిలోనే ఎంతో సులువుగా మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే ‘స్పా’ లాంటి అనుభవాన్ని ఆస్వాదించడానికి మన ఇంట్లోని వస్తువులను ఉపయోగించి ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేయాలో ఇక్కడ మేము మీకు అందజేస్తున్నాము. ట్రై చేసేయండి మరి.

ఈ ఫేస్ ప్యాక్‌లను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం

బొప్పాయితో ఫేస్ ప్యాక్

బొప్పాయిలో సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయితో ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి మీకు పండిన బొప్పాయి పండు, తేనె కావలసి ఉంటాయి. బొప్పాయి పండును మెత్తని పేస్ట్‌గా చేసి, ఆపై ఒక టీస్పూన్ తేనె కలిపి, ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి, ఆరనివ్వండి. అది ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి మృత కణాలను తొలగించి ప్రకాశవంతంగా మార్చి, ముఖంపై ముడతలు, కళ్ళ కింద నల్లని వలయాలను తగ్గించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలోని ఎంజైమ్‌లు చర్మంపైన ఉండే మృత కణాలను తొలగిస్తాయి. అలాగే, తేనె చర్మానికి పోషణను, తేమను అందిస్తుంది.

అలోవెరా (కలబంద) ఫేస్ ప్యాక్

కలబందతో ఫేస్ ప్యాక్‌ తయారు చేయడానికి మీకు తాజా అలోవెరా జెల్ (కలబంద రసం), తేనె అవసరం. ఓక టీస్పూన్ తేనె తీసుకొని, దానిలో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి, ఆరిపోయే వరకు అలాగే ఉంచండి. తర్వాత నీటితో  శుభ్రం చేయండి. ఈ కలబంద మీ ముఖాన్ని తేమగా చేస్తుంది. ఇది  ఓదార్పు, హైడ్రేటింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది, ఇది పొడి లేదా సున్నితమైన చర్మానికి సరిగ్గా సూట్ అయ్యే ఫేస్ ప్యాక్‌. తేనె చర్మానికి పోషణనిచ్చి, తేమను లాక్ చేయడానికి సహాయపడుతుంది.

అరటిపండు ఫేస్ ప్యాక్

అరటిపండు ఫేస్ ప్యాక్ చేయడానికి మీకు పండిన అరటిపండ్లు, తేనె అవసరం. ఒక పండిన అరటిపండును మెత్తగా పేస్ట్‌గా చేసి, దానికి రెండు మూడు టీస్పూన్ల తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి ఆరనివ్వండి. తర్వాత మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. అరటిపండ్లలో A, B, E విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఫేస్ ఈ ప్యాక్ పొడి చర్మానికి మంచిది. ఎందుకంటే ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి, పోషణ అందించడానికి సహాయపడుతుంది. తేనె సహజ హ్యూమెక్టెంట్‌గా పనిచేస్తుంది.

తెలుసుకున్నారుగా..  మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఫేస్ ప్యాక్ తయారు చేయడం మొదలు పెట్టండి.