మెరుగైన కంటి చూపు కోసం ఆయుర్వేద మూలికలు

మాక్యులర్ డీజెన‌రేష‌న్.. అంటే కంట్రోని రెటీనాను క్షీణించే వ్యాధి అని కూడా అంటారు. ఇది మన కంటి చూపు క్షీణించేలా చేసి, కంటి చూపు కోల్పోయేలా చేసే కంటి వ్యాధి. మాక్యులర్ డీజెనరేషన్ అనేది, కంటి చూపుకి సంబంధించిన ఒక పరిస్థితి, దీనిలో రెటీనా దెబ్బతినడం వల్ల వృద్ధాప్యంలో ముఖ్యంగా కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది.  కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికల ద్వారా సాధ్యం అంటున్నారు నిపుణులు. కొన్ని ఆయుర్వేద మూలికల ఉపయోగం […]

Share:

మాక్యులర్ డీజెన‌రేష‌న్.. అంటే కంట్రోని రెటీనాను క్షీణించే వ్యాధి అని కూడా అంటారు. ఇది మన కంటి చూపు క్షీణించేలా చేసి, కంటి చూపు కోల్పోయేలా చేసే కంటి వ్యాధి. మాక్యులర్ డీజెనరేషన్ అనేది, కంటి చూపుకి సంబంధించిన ఒక పరిస్థితి, దీనిలో రెటీనా దెబ్బతినడం వల్ల వృద్ధాప్యంలో ముఖ్యంగా కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. 

కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికల ద్వారా సాధ్యం అంటున్నారు నిపుణులు. కొన్ని ఆయుర్వేద మూలికల ఉపయోగం ద్వారా మన కంటిచూపు మెరుగుపడే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. మరి ఆ ఆయుర్వేద గుణాలు ఉన్న మూలికలు ఏమిటో మీరు తెలుసుకుందామా.. 

త్రిఫల: 

ఈ పేరు వినగానే ఇందులో మూడు రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయని తెలిసిపోతుంది. ఉసిరి (ఎంబ్లికా అఫిసినాలిస్), హరితకి (టెర్మినలియా చెబులా) మరియు బిభిటాకి (టెర్మినలియా బెల్లిరికా) నువ్వంటే మూడు రకాల ఆమ్లా గుణాలు ఉన్న త్రిఫల కంటి చూపు ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమని అధ్యయనాల ప్రకారం తేలింది. 

ఆమ్లా (ఎంబ్లికా అఫిసినాలిస్): విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మన శరీర సంబంధిత ఆరోగ్యానికి కాకుండా కళ్లతో సహా ఆరోగ్యకరమైన కణజాలాలను నిర్వహించడానికి కీలకమైనవి. ఉసిరిలో పుష్కలంగా ఉండే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఒత్తిడి ద్వారా రెటీనాకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.

హరిటాకి (టెర్మినలియా చెబులా): హరిటాకీలోని యాంటీఆక్సిడెంట్ అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను ఉంటాయి. ఈ లక్షణాలు కంటి చూపు క్షీణించే క్షణాలను తగ్గించడానికి, మాక్యులాను హాని నుండి రక్షించడానికి సహాయపడతాయి.

బిభిటాకి (టెర్మినలియా బెల్లిరికా): బిభిటాకి (Bibhitaki)లోని బయోయాక్టివ్ భాగాలు కళ్లకు రక్త ప్రసరణను ప్రోత్సహించడం, దూరాన ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించేలా పెంచడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. త్రిఫల, ఈ మూడు పండ్ల యొక్క శక్తివంతమైన మిశ్రమం, కళ్ళలో ఉండే బ్లడ్ సర్కులేషన్ మెరుగుపరుస్తుంది. కంటికి సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది.

కుంకుమపువ్వు: 

అందరికీ తెలిసిన కుంకుమపువ్వు గుణాలు ముఖ్యంగా కళ్ళకు ఎంతగానో ఉపయోగపడతాయి. మెడికల్ గా నిరూపితమైన ఎన్నో ఔషధ గుణాలు కుంకుమ పువ్వులో ఉన్నట్లు తెలిసింది. కుంకుమ పువ్వులో ఉండే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి చూపు మరింత బాగుపడుతుంది. కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల కంటి నరాలలో బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఆక్సిడెంట్ అనే ఒత్తిడి వంటిది తగ్గుముఖం పడుతుంది. కుంకుమ పువ్వుతో కంటిలో ఉండే కొన్ని సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా నిరోధించవచ్చు. కుంకుమ పువ్వులో క్రోసిన్ అనేది కంటి వ్యాధులను దూరం చేసే ముఖ్యంగా రెటీనా సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా మరింత మెరుగైన కంటి చూపుకి తోడ్పడుతుంది. మన తినే ఆహారంలో, తాగే పాలల్లో కుంకుమ పువ్వు వాడడం వల్ల మన కంటి చూపు మెరుగు పడుతుంది. వయసు మీద పడుతున్నప్పటికీ కంటి చూపుల్లో ఎటువంటి లోపాలు కనిపించవు. కుంకుమ పువ్వులో ఉండే ఎన్నో ఆయుర్వేద గుణాలు మాక్యులర్ క్షీణతను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మెరుగైన కంటి చూపు కోసం రెండు రెబ్బల కుంకుమ పువ్వు పాలలో వేసుకొని ఉదయాన్నే తాగడం ఎంతో ఉత్తమం. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలతో ఉండే కుంకుమపువ్వు శరీరానికి ఎంతో అవసరం.