విటమిన్ K లోపంతో శ్వాసకోశ సమస్యలు

విటమిన్ K తక్కువగా ఉన్న వ్యక్తులు ఊపిరితిత్తుల పనితీరులో లోపాలు కనిపిస్తున్నాయని కొన్ని రీసర్చ్ల ప్రకారం తెలిసింది. అయితే ముఖ్యంగా విటమిన్ కె లోపం ఉన్నవారు ఉబ్బసం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) అంతేకాకుండా  గురకతో బాధపడుతున్నారని తేలింది. విటమిన్ కె ఆకు కూరలు, కూరగాయల నూనెలు మరియు తృణధాన్యాలలో లభిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో పాత్ర పోషిస్తుంది. శరీరానికి గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది, అయితే ఊపిరితిత్తుల ఆరోగ్యంలో దాని పాత్ర గురించి ఈ […]

Share:

విటమిన్ K తక్కువగా ఉన్న వ్యక్తులు ఊపిరితిత్తుల పనితీరులో లోపాలు కనిపిస్తున్నాయని కొన్ని రీసర్చ్ల ప్రకారం తెలిసింది. అయితే ముఖ్యంగా విటమిన్ కె లోపం ఉన్నవారు ఉబ్బసం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) అంతేకాకుండా  గురకతో బాధపడుతున్నారని తేలింది.

విటమిన్ కె ఆకు కూరలు, కూరగాయల నూనెలు మరియు తృణధాన్యాలలో లభిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో పాత్ర పోషిస్తుంది. శరీరానికి గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది, అయితే ఊపిరితిత్తుల ఆరోగ్యంలో దాని పాత్ర గురించి ఈ మధ్యకాలంలోనే రీసర్చ్ ల ద్వారా బయటపడింది.

కోపెన్‌హాగన్ యూనివర్సిటీ హాస్పిటల్ మరియు యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లోని డానిష్ రీసెర్చ్ టీం ఈ రీసెర్చ్ అనేది చేసింది. కోపెన్‌హాగన్‌లో నివసిస్తున్న 24 నుండి 77 సంవత్సరాల మధ్య వయస్సు గల 4,092 మంది వ్యక్తులు ఇందులో పాల్గొనడం జరిగింది. జరిగిన రీసెర్చ్లో పాల్గొనేవారు ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలో పాల్గొన్నారు, దీనిని స్పిరోమెట్రీ అని పిలుస్తారు. స్పిరోమెట్రీ ఒక వ్యక్తి ఒక సెకనులో పీల్చే గాలిని కొలుస్తుంది. 

విటమిన్ K తక్కువ స్థాయి కలిగి ఉన్న వ్యక్తులు సగటున తక్కువ స్పిరోమెట్రీ రేట్ కలిగి ఉన్నారని పరిశోధకులు కనుగొన్నారు. విటమిన్ K తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తమకు COPD, ఆస్తమా, గురక సమస్యలు ఉన్నాయని చెప్పే అవకాశం ఉంది. 

విటమిన్ K ఆహార పదార్థాలు: 

1. కాలే (వండినది) 

1/2 కప్పు: 531 mcg (DVలో 443%)

100 గ్రాములు: 817 mcg (DVలో 681%)

2. ఆకుకూరలు (వండినవి) 

1/2 కప్పు: 415 mcg (DVలో 346%)

100 గ్రాములు: 593 mcg (DVలో 494%)

3. స్విస్ చార్డ్ 

1 ఆకు: 398 mcg (DVలో 332%)

100 గ్రాములు: 830 mcg (DVలో 692%)

4. కొల్లార్డ్ గ్రీన్స్ (వండినవి) 

1/2 కప్పు: 386 mcg (DVలో 322%)

100 గ్రాములు: 407 mcg (DVలో 339%)

5. నాట్టో —

1 ఔన్స్: 313 mcg (261% DV)

100 గ్రాములు: 1,103 mcg (920% DV)

6. బచ్చలికూర 

1 కప్పు: 145 mcg (121% DV)

100 గ్రాములు: 483 mcg (DVలో 402%)

7. బ్రోకలీ (వండినది) 

1/2 కప్పు: 110 mcg (DVలో 92%)

100 గ్రాములు: 141 mcg (118% DV)

8. బ్రస్సెల్స్ మొలకలు (వండినవి)

1/2 కప్పు: 109 mcg (DVలో 91%)

100 గ్రాములు: 140 mcg (117% DV)

9. గొడ్డు, మాంసం, కాలేయం

1 స్లైస్: 72 mcg (DVలో 60%)

100 గ్రాములు: 106 mcg (DVలో 88%)

10. పోర్క్ చాప్స్ 

3 ఔన్సులు: 59 mcg (DVలో 49%)

100 గ్రాములు: 69 mcg (DVలో 57%)

11. చికెన్ 

3 ఔన్సులు: 51 mcg (DVలో 43%)

100 గ్రాములు: 60 mcg (DVలో 50%)

12. గూస్ లివర్

1 టేబుల్ స్పూన్: 48 mcg (డివిలో 40%)

100 గ్రాములు: 369 mcg (DVలో 308%)

13. గ్రీన్ బీన్స్ (వండినవి)

1/2 కప్పు: 30 mcg (DVలో 25%)

100 గ్రాములు: 48 mcg (DVలో 40%)

14. ప్రూనే

5 ముక్కలు: 28 mcg (DVలో 24%)

100 గ్రాములు: 60 mcg (DVలో 50%)

15. కివి 

1 పండు: 28 mcg (DVలో 23%)

100 గ్రాములు: 40 mcg (DVలో 34%)