దాల్చిన చెక్క మరియు తేనె నీటితో బరువు తగ్గండి

పెరుగుతున్న బరువు కారణంగా ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. బరువు పెరగడం ఎంత కష్టమో, బరువు తగ్గడం కూడా అంతే కష్టం. బరువు తగ్గడానికి డైటింగ్, వ్యాయామం, డైట్ ప్లాన్ లాంటివి చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఇవన్నీ చేసిన తర్వాత కూడా, బరువు తగ్గడంలో విఫలమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో దాల్చినచెక్క, తేనెను ఆహారంలో చేర్చుకుంటే తేడా మీకే కనిపిస్తుంది. వీటిలో ఉండే మూలకం.. మీ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువును కూడా నియంత్రిస్తుంది. కొంతమంది […]

Share:

పెరుగుతున్న బరువు కారణంగా ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. బరువు పెరగడం ఎంత కష్టమో, బరువు తగ్గడం కూడా అంతే కష్టం. బరువు తగ్గడానికి డైటింగ్, వ్యాయామం, డైట్ ప్లాన్ లాంటివి చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఇవన్నీ చేసిన తర్వాత కూడా, బరువు తగ్గడంలో విఫలమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో దాల్చినచెక్క, తేనెను ఆహారంలో చేర్చుకుంటే తేడా మీకే కనిపిస్తుంది. వీటిలో ఉండే మూలకం.. మీ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువును కూడా నియంత్రిస్తుంది.

కొంతమంది చలికాలం ప్రారంభమైన వెంటనే దాల్చిన చెక్క టీ తాగడానికి ఇష్టపడతారు, మరికొందరు కూరగాయల రుచిని రెట్టింపు చేయడానికి దాల్చిన చెక్కను ఉపయోగిస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక సమ్మేళనాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉన్నాయి. జింక్, విటమిన్లు, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్ మరియు ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు దాల్చినచెక్కలో పుష్కలంగా లభిస్తాయి. దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకుంటే, శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

నిజానికి దాల్చినచెక్క మరియు తేనె స్థూలకాయ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి బరువును నియంత్రించడంలో మరియు ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె, దాల్చిన చెక్క నీరు

దాల్చినచెక్క అనేక వ్యాధుల చికిత్సలో చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ రోజువారీ కప్పు గ్రీన్ టీలో ఒక టీస్పూన్ తేనె మరియు అర టీస్పూన్ దాల్చిన చెక్క కలపండి. ఈ మిశ్రమం మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది, అలాగే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

దాల్చిన చెక్క మరియు తేనె టీ

మీరు బరువు తగ్గడానికి దాల్చిన చెక్క మరియు తేనె టీని తీసుకోవచ్చు. దీని కోసం, ఒకటిన్నర కప్పు నీటిలో ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి ఐదు నిమిషాలు మరిగించి తర్వాత కప్పులో వడకట్టి బయటకు తీయాలి. ఇప్పుడు అందులో రెండు చెంచాల తేనె మిక్స్ చేసి మామూలు టీ లాగా..  నెమ్మదిగా తాగాలి. మీరు రోజు ఒక కప్పు టీ తాగడం వల్ల బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

దాల్చిన చెక్క – తేనె – నిమ్మకాయ

దీని కోసం.. ఒక పాత్రలో ఒకటిన్నర కప్పు నీటిని మరిగించండి. దీని తరువాత.. ఒక కప్పులో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె మరియు అర టీస్పూన్ నిమ్మరసం కలపండి. దీని తరువాత, ఈ మరిగించిన నీటిని కప్పులో పోసి బాగా కలపాలి. తర్వాత దీన్ని తాగవచ్చు, ఇది రోజుకు ఒకసారి తీసుకోవచ్చు. ఇది మీ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ – దాల్చిన చెక్క మరియు తేనె

మీరు బరువు తగ్గడానికి దాల్చిన చెక్క మరియు తేనెతో కూడిన గ్రీన్ టీ సహాయం కూడా తీసుకోవచ్చు. దీని కోసం.. ముందుగా ఒక పాత్రలో ఒకటిన్నర కప్పు నీటిని మరిగించాలి. తర్వాత ఈ నీటిలో ఒక చెంచా గ్రీన్ టీ వేసి, మళ్ళీ రెండు నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఒక కప్పులో పావు చెంచా దాల్చిన చెక్క పొడి వేసి, అందులో రెండు చెంచాల తేనె కలపాలి. తర్వాత ఈ గ్రీన్ టీ వాటర్‌ని ఒక కప్పులో తేనె మరియు దాల్చిన చెక్కతో వడపోసి అన్నింటినీ బాగా కలపండి. ఆ తర్వాత తాగండి. 

దాల్చినచెక్క మరియు తేనె స్థూలకాయ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయి, ఇవి బరువును నియంత్రించడంలో మరియు ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.