ఫ్రెండ్‌షిప్ డే స్పెష‌ల్

ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ డే వచ్చిందంటే చాలు పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఉత్సాహంగా తమ ప్రియమైన స్నేహితుల కోసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.  ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్: ప్రతి ఒక్కరు చిన్నతనంలో తమ స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే నాడు, తన ప్రియమైన స్నేహితుల చేతులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేవారు. అంతేకాదు, ఎంతో చక్కని చూడముచ్చటగా […]

Share:

ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ డే వచ్చిందంటే చాలు పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఉత్సాహంగా తమ ప్రియమైన స్నేహితుల కోసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. 

ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్:

ప్రతి ఒక్కరు చిన్నతనంలో తమ స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే నాడు, తన ప్రియమైన స్నేహితుల చేతులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేవారు. అంతేకాదు, ఎంతో చక్కని చూడముచ్చటగా ఉండే చిట్టి చిట్టి గ్రీటింగ్ కార్డ్స్ పంచుకునేవారు. ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా? ప్రతి ఒక్కరూ తమ స్నేహితులను మాత్రం తమ జన్మలో ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా స్కూల్ డేస్ లో ఉండే ఫ్రెండ్షిప్ చాలా అపురూపమైనది. ప్రస్తుతం ట్రెండ్ మారింది, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ వచ్చేస్తాయి. ఫ్రెండ్ ఎంత దూరంలో ఉన్నా సరే స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ అయిపోతున్నారు. సంవత్సరంలో ఒక్కరోజైనా తమ ఫ్రెండ్స్ నీ గుర్తు చేసుకుంటూ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు. అంతే కాదండోయ్, చక చక గ్రీటింగ్ కార్డ్స్ ని స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో పంపించేసుకుంటున్నారు. స్నేహమంటే ప్రతిరోజు కలవకపోయినా మనసులో ఉండే భావమే నిజమైన స్నేహం.

స్నేహితుల కోసం చక్కని గిఫ్ట్స్:

ప్రతి ఒక్కరికి చిన్నతనం నుంచి పెద్దయ్య వరకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అందులో ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే వారి కోసం చక్కనైన పంపించాలి అనుకుంటే, వెంటనే ఇప్పుడు చెప్పబోయే గిఫ్ట్స్ లిస్ట్ చేసేయండి..

ట్రెండీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాలెట్: 

మీ స్నేహితులు ఆడవారైనా మగవారైనా సరే తమకు నచ్చే రోజు వాడే వస్తువులు ఫ్రెండ్షిప్ డే నాడు బహుమతిగా ఇస్తే ఎంతో మురిసిపోతారు. అయితే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఆడవారైతే, మీరు మంచి ఆకర్షణీయమైన రంగులో ఉండే హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం ఎంతో ఉత్తమం. ఒకవేళ మీ బెస్ట్ ఫ్రెండ్స్ మగవారి ఉంటే కనుక, ఒక మంచి వాలెట్, పర్స్ గిఫ్ట్ గా ఇస్తే వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. 

ట్రెండీ గగుల్స్:

ప్రతి ఒకరు బయటికి వెళ్లేటప్పుడు కచ్చితంగా ట్రెండీగా కనిపించేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఆడవారికైనా మగవారికైనా ట్రెండీగా కనిపించే గూగుల్స్ పెట్టుకొని బయటికి వెళ్లేందుకు ఇష్టపడతారు. ఈ ఫ్రెండ్షిప్ డే నాడు మీరు తమ బెస్ట్ ఫ్రెండ్ కి మంచి బహుమతి కోసం చూస్తున్నట్లయితే, ఈ ట్రెండీగా కనిపించే గగుల్స్ ఎంతో ఉత్తమమని చెప్పాలి.

ట్రెండీ ఫోన్ కవర్:

ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండు కి సరిగా సరిపోతుంది. ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. అయితే వాడే ప్రతి స్మార్ట్ ఫోన్ కోసం ప్రతి ఒక్కరు ఫోన్ బ్యాక్ కవర్ కొంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం పోస్టు లెటర్ తరహాలో ఉండే బ్యాక్ కవర్ ట్రెండ్ నడుస్తోంది. ఇది చూడ్డానికి పోస్ట్ లెటర్ లా ఉంటుంది, కానీ చూడ్డానికి చాలా ట్రెండీగా కనిపిస్తోంది. ఈ పోస్టు లెటర్ బ్యాక్ కవర్ మీద మీకు సంబంధించిన డీటెయిల్స్ రాసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫోన్ పోయినప్పటికీ, త్వరగా మీ చేతుల్లోకి మళ్ళీ మీ ఫోన్ వచ్చేందుకు బ్యాక్ కవర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వైర్లెస్ చార్జింగ్ కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది.

సో మరి ఇంకెందుకు ఆలస్యం ఇటువంటి ట్రెండీ లుక్ తో కనిపించే బహుమతులు, మీ ప్రియమైన స్నేహితులకు ఇచ్చి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండి.