యవ్వనాన్ని అందించే ప‌చ్చంద‌నం

అవును మీరు వింటున్నది నిజమే. ఎవరైతే పచ్చదనానికి అతి దగ్గరలో ఉంటారో వారికి గుండె సమస్యలు, క్యాన్సర్ మరియు నరాల వీక్నెస్ వంటి అనేక రోగాలు దూరం అవుతాయని కొన్ని అధ్యయనాలు ప్రకారం కలిసింది. నిజానికి ఎవరైతే ఎక్కువ సమయం పచ్చదనంలో గడుపుతారో వాళ్ళ వయస్సు రెండున్నర సంవత్సరాలు తక్కువ అవుతుందని కొత్త అధ్యయనాల్లో వెళ్లడానికి.  ప్రస్తుతం ఉన్న వేడిని తట్టుకునేందుకు సిటి నడి మధ్యలో పార్క్స్ అలాగే కొన్ని వాతావరణ సంబంధిత పచ్చని వనాలు పెంచడం […]

Share:

అవును మీరు వింటున్నది నిజమే. ఎవరైతే పచ్చదనానికి అతి దగ్గరలో ఉంటారో వారికి గుండె సమస్యలు, క్యాన్సర్ మరియు నరాల వీక్నెస్ వంటి అనేక రోగాలు దూరం అవుతాయని కొన్ని అధ్యయనాలు ప్రకారం కలిసింది. నిజానికి ఎవరైతే ఎక్కువ సమయం పచ్చదనంలో గడుపుతారో వాళ్ళ వయస్సు రెండున్నర సంవత్సరాలు తక్కువ అవుతుందని కొత్త అధ్యయనాల్లో వెళ్లడానికి. 

ప్రస్తుతం ఉన్న వేడిని తట్టుకునేందుకు సిటి నడి మధ్యలో పార్క్స్ అలాగే కొన్ని వాతావరణ సంబంధిత పచ్చని వనాలు పెంచడం జరుగుతుంది. పచ్చని వనాలలో ఎక్కువ సమయం గడపడం ద్వారా ప్రజలు నిజానికితమ యవ్వనాన్ని తిరిగి పొందచ్చని చాలామంది సైంటిస్టులు కూడా చెప్తున్నారు. 

పరిశోధనలో ఏమి రుజువైంది: 

ఈ పరిశోధనకి సంబంధించిన కొంతమంది టీం “మిథైలేషన్” అని పిలువబడే DNA రసాయన మార్పులను గమనించడం జరిగింది. పచ్చదనానికి అతి దగ్గరలో ఉంటారో వారికి గుండె సమస్యలు, క్యాన్సర్ మరియు నరాల వీక్నెస్ వంటి అనేక రోగాలు దూరం అవుతాయని కొన్ని అధ్యయనాలు ప్రకారం కలిసింది. నిజానికి ఎవరైతే ఎక్కువ సమయం పచ్చదనంలో గడుపుతారో వాళ్ళ వయస్సు రెండున్నర సంవత్సరాలు తక్కువ అవుతుందని కొత్త అధ్యయనాల్లో వెల్లడించడం జరిగింది. 

కిమ్ మరియు సహచరులు 1986-2006 నుండి 20 సంవత్సరాల వ్యవధిలో నాలుగు అమెరికన్ నగరాలు – బర్మింగ్‌హామ్, చికాగో, మిన్నియాపాలిస్ మరియు ఓక్లాండ్ నుండి 900 కంటే ఎక్కువ మంది ప్రజల మీద, అంటే తమలో వచ్చే మార్పుల విషయంలో రీసెర్చ్ చేయడం జరిగింది.

శాటిలైట్ ఇమేజింగ్ ఉపయోగించి, కొంతమంది ఎవరైతే పచ్చని వనాలకు దగ్గరలో ఉన్నారో, అంతేకాకుండా అందులో 15 నుంచి 20 సంవత్సరాలు మధ్య ఉన్న మనుషుల మీద, క్షుణ్ణంగా రీసెర్చ్ చేయడం జరిగింది. అంతే కాకుండా వారిలో ఎటువంటి చెడు అలవాట్లు లేని వారిని, ముఖ్యంగా ఎంపిక చేసుకోవడం జరిగింది.

పచ్చని వనం దగ్గరలో ఉంటే లాభాలు ఎన్నో: 

“అయితే పరిశోధనలో తెలిసిన విషయం ఏమిటంటే, ఎవరైతే పచ్చదనానికి దగ్గరలో ఉంటారో వారు వయసు సగటు వయసు కన్నా రెండునర సంవత్సరాల చిన్నగా ఉంటుంది” అని అధ్యయనం చేస్తున్నా ప్రధాన రచయిత మరియు నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీ యొక్క ఫీన్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పోస్ట్‌డాక్టోరల్ స్కాలర్ కైజు కిమ్ AFP కి చెప్పారు.

పచ్చని వనాల మధ్యలో ఉండటం కారణంగా ఆరోగ్యం మెరుగుపరడమే కాదు, గుండెకు సంబంధించిన ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న మరణాల రేటు కూడా తగ్గించవచ్చు. అయితే యవ్వనంగా ఉండేందుకు, వృద్ధాప్యాన్ని దూరం చేయడానికి, పచ్చని వనాలు ఎంతగానో సహాయపడతాయని అధ్యయనాలు ద్వారా స్పష్టంగా తెలిసింది.

సమయాన్ని కేటాయించండి: 

పరిశోధనల ప్రకారం పచ్చని వనాలు ఆరోగ్యానికి ఎంతో మిన్న అని తేలింది. అయితే ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి, మార్నింగ్ వాక్ చేయడానికి, పచ్చని వనాల మధ్య తిరగడానికి సమయం ఏ దొరకట్లేదు. ఇంకా చెప్పాలంటే పచ్చదనం అసలు ఇంటి చుట్టుపక్కల కూడా కనిపించని రోజులవి. కాకపోతే నిపుణులు చెబుతున్న విషయాలు ఏమిటంటే, మన రోజులో కనీసం ఒక అరగంట సమయం అన్న, పచ్చని వనాల మధ్య గడపడానికి చూడాలి. పచ్చని వనాల మధ్య గడపడం కారణంగా, ఆహ్లాదకరంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం, ఆరోగ్యకరమైన ఆటలు ఆడడం, మెడిటేషన్ లాంటివి పార్కులలో కూర్చుని చేయడం ద్వారా, యవ్వనాన్ని సంపాదించుకోవచ్చు. అందుకే పచ్చని వనాల మధ్య పెరుగుతున్న రైతులు ఆరోగ్యంగా నిండు నూరేళ్లు సంతోషకరమైన జీవితాన్ని సాగిస్తున్నారు.