పిల్ల‌లు ఇవి త‌క్కువ‌గా తినేలా చూడండి

ప్రస్తుతం ఈ ఆస్ప‌ర్టేమ్ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఆస్ప‌ర్టేమ్ అనేది కూల్ డ్రింక్స్, డెజర్ట్‌లు, షుగర్ ఫ్రీ జ్యూసుల్లో మరియు అనేక రకాల తాగే పానీయాల మిశ్రమాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు తినే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఈ ఆస్ప‌ర్టేమ్ కలుస్తున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎక్కువగా ప్రిజర్వేటివ్స్లో ఈ పదార్థం కలపడం జరుగుతుంది, పానీయాలు మాత్రమే కాకుండా అస్పర్టమేను చక్కెరకు బదులుగా ఉపయోగిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇందులో ముఖ్యంగా జీరో […]

Share:

ప్రస్తుతం ఈ ఆస్ప‌ర్టేమ్ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఆస్ప‌ర్టేమ్ అనేది కూల్ డ్రింక్స్, డెజర్ట్‌లు, షుగర్ ఫ్రీ జ్యూసుల్లో మరియు అనేక రకాల తాగే పానీయాల మిశ్రమాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు తినే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఈ ఆస్ప‌ర్టేమ్ కలుస్తున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి.

ఎక్కువగా ప్రిజర్వేటివ్స్లో ఈ పదార్థం కలపడం జరుగుతుంది, పానీయాలు మాత్రమే కాకుండా అస్పర్టమేను చక్కెరకు బదులుగా ఉపయోగిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇందులో ముఖ్యంగా జీరో కేలరీలు ఉంటాయి. ఆస్ప‌ర్టేమ్ ఒక ప్రసిద్ధ చెందిన ఆర్టిఫిషల్ స్వీటెనర్,ఇప్పుడు ఇది వచ్చే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత  క్యాన్సర్కు కారణమయ్యే ఒక పదార్థంగా ప్రకటించబడుతుంది.  ముఖ్యంగా ఇతర షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ మాదిరిగా ఇందులో చేదు అనేది మనకి కనిపించదు. నివేదిక ప్రకారం, ఆస్ప‌ర్టేమ్ ఒక క్యాన్సర్ కారకంగా గుర్తించబడుతుందని, అనేక ఇతర సమస్యలకు కారణంగా వెల్లడిస్తారని పేర్కొంది. 

పిల్లలు తినే ఏ ఆహారాల్లో ఇవి కలుస్తున్నాయి: 

చిన్నపిల్లలు ఎక్కువగా తమ చుట్టుపక్కల ఉండే షాప్స్ లో నుంచి సోడాలు, చూయింగ్ గమ్ములు, ఫ్లేవర్ తో నిండిన క్రీమ్స్, ఎక్కువగా జిలటిన్ ఉపయోగించి చేసిన డెసర్ట్, ఫ్రూట్ జ్యూస్, డ్రింక్స్, లేదంటే బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్ ఇన్స్టెంట్ పాకెట్స్ లో, ఎక్కువగా ఇది కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ షేక్స్ లో కూడా ఆస్ప‌ర్టేమ్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. 

ఆస్ప‌ర్టేమ్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పిల్లలకి వస్తాయి: 

బరువు: అయితే ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలు పిల్లలు ఎక్కువగా తింటున్నట్లయితే పిల్లల వెయిట్ విషయంలో అనేక అంశాలు వస్తాయి. వెయిట్ ఒక్కసారిగా తగ్గిపోవడం గానీ లేదంటే ఒక్కసారిగా పెరిగిపోవడం వంటిది కనిపిస్తాయి. 

ప్రవర్తనలో మార్పు: ఆస్ప‌ర్టేమ్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, పిల్లల బిహేవియర్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా నరాల వ్యవస్థ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలకు ఆరోగ్యమైన ఆహారం అందించడం లో అశ్రద్ధ చూపకూడదు. 

మైగ్రేన్: పిల్లలు షాపులలో అమ్మే చూయింగ్ గమ్ములు, జ్యూసులు, డ్రింక్స్ తాగడం వల్ల, ముఖ్యంగా తలనొప్పి వంటివి పిల్లలలో మొదలవుతాయి. అంతేకాకుండా, ఎక్కువగా మైగ్రేన్ వంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది అధ్యయనాల్లో వెళ్లడయింది.

ఆస్ప‌ర్టేమ్ అంటే ఏమిటి?:

ఆస్ప‌ర్టేమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా ఉపయోగించబడుతున్న ఒక స్వీటెనర్. WHOలో భాగమైన క్యాన్సర్ పరిశోధన విభాగం అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ తీసుకున్న నిర్ణయం అనేది, ఇప్పుడు చాలా పరిశ్రమలకు దెబ్బగా మారింది, కానీ కొన్ని వైపుల నుంచి ఈ వార్తను కొట్టివేసి, నియంత్రణ సంస్థలచే అస్పర్టమే ఉపయోగం సురక్షితమని ప్రకటించబడింది. 

ఇది నిజానికి ఆలోచింపదగ్గ విషయం. ఎన్నో ఏళ్ళుగా చాలామంది విషపూరితమైన పదార్థాలను రోజూ తీసుకునే ఆహారంలో కలుస్తున్నాయని వార్తలను వినిపిస్తూనే ఉన్నారు మన వింటూనే ఉన్నాము. కానీ ఇప్పుడు, ఆర్టిఫిషియల్ షుగర్గా పేరొందిన అస్పర్టమే ఇప్పుడు ఎంతవరకు హాని కలిగిస్తుంది అనేది, వచ్చే నెల WHO తీసుకునే నిర్ణయాన్ని బట్టి తేలిపోతుంది. కానీ మానవులకు హాని చేసే ఇటువంటి పదార్థాలను వాడి సొమ్ము చేసుకుంటున్న కొన్ని ప్రముఖ సంస్థల మీద ఫైర్ అవుతున్నారు పబ్లిక్.