ఆస్పార్టేమ్ త‌క్కువ ఉన్న ఫుడ్స్ వ‌ల్ల ఏమీ కాదు: WHO

ఈమధ్య కాలం లో జనం ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను తెగ వాడేస్తున్నారు. ప్రతీ ఏటా దీనిని వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతూ ఉంది. ఫిట్నెస్ ఫ్రీక్స్ గా పిలవబడే వారు దీనిని ఎక్కువగా వాడుతుంటారు. టీ లేదా కాఫీ లో కలుపుకొని తాగుతుంటారు.  అయితే ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు అధికంగా వాడితే క్యాన్సర్ కి దారి తీసే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) సంస్థ పేర్కొన్నట్టు ఒక ప్రచారం జరిగింది. చక్కర కి బదులుగా వాడుతున్న […]

Share:

ఈమధ్య కాలం లో జనం ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను తెగ వాడేస్తున్నారు. ప్రతీ ఏటా దీనిని వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతూ ఉంది. ఫిట్నెస్ ఫ్రీక్స్ గా పిలవబడే వారు దీనిని ఎక్కువగా వాడుతుంటారు. టీ లేదా కాఫీ లో కలుపుకొని తాగుతుంటారు.  అయితే ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు అధికంగా వాడితే క్యాన్సర్ కి దారి తీసే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) సంస్థ పేర్కొన్నట్టు ఒక ప్రచారం జరిగింది. చక్కర కి బదులుగా వాడుతున్న ఇలాంటి స్వీటెనర్ పై పరిశోధనలు మొదలు పెట్టి WHO సంస్థ. ఈ సంస్థ ద్వారా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC ) రీసెంట్ గా ఇచ్చిన నివేదిక లో ఆర్టిఫీషియల్ స్వీటెనర్లలలో ఉండే అస్పర్తం అనే పదార్థం కారణం అన్ని చెప్పుకొచ్చింది. ఈ పదార్థమే క్యాన్సర్ కారకంగా నిలుస్తుందని అంటున్నారు. కాబట్టి దీనికి అడిక్ట్ అయ్యుంటే మాత్రం క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

FDA నివేదిక ప్రకారం 40 మిల్లిగ్రాములు తీసుకోవడం మంచిది :

ఏఫ్డీయే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం శరీర బరువుకి తగ్గట్టుగా రోజుకి 50 మిల్లీగ్రామ్స్ అస్పర్టమే సరిపోతుందని పేర్కొంది. కానీ ఎరువుపెయిన్ యూనియన్ మాత్రం రోజుకు సగటున 40 మిల్లీగ్రామ్స్ మాత్రమే తీసుకోవాలని సూచింది. మధుమేహం ఉన్నవారు ప్రముఖ వైద్య నిపుణులు సలహా మేరకు ఒక మోస్తారు పరిణామం లో తీసుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 50 ఏళ్ళ వయస్సు పైబడిన వారు, ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను తెగ వాడేస్తుంటారు. అది చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. ఒక మోస్తారు పరిణామం లో తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉఉండవని అంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ సంస్థ చెప్పేది కూడా ఇదే. ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు తీసుకోవడం లో ఎలాంటి తప్పు లేదని, కాకపోతే ఒక మోస్తరు లో మాత్రమే తీసుకోవాల్సిందిగా చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా  ఏదైనా వ్యక్తిగత డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకే ఈ ఆర్టిఫిషియన్ స్వీటెనర్లను ఉపయోగించాలని ప్రీతీ  సంస్థ చెప్తున్న మాట.

మంచు నీళ్లు ఎక్కువగా త్రాగుట ముఖ్యం :

అయితే ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను తీసుకునే వారు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. శరీరం ఒక్కోసారి డీ హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ఇది వాడడం వల్ల. అలాంటి వారు ఎక్కువగా మంచి నీళ్లు త్రాగడం మంచిది , అంతే కాకుండా సమతూల్య ఆహరం తీసుకోవడం కూడా అతి ముఖ్యం.  ఇది ఇలా ఉండగా కొంతమంది కొన్ని కృత్తిమ స్వీటనేర్లను తీసుకోవడం వల్ల జీర్ణకోశం అసౌకర్యానికి గురి అవ్వడం, లేదా దుష్ప్రభావాలు కలుగడం వంటివి జరుగుతాయి. ఈ సమయం లో మన శరీరం వివిధ రకాలుగా స్పందిస్తుంది, దీనిపై ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాలి. చక్కర వినియోగం ని తగ్గించడం కోసం మాత్రమే ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను వాడేవారు మాత్రం ఆరోగ్య సంరక్షణ నిపుణులు లేదా డైటీషియన్‌తో ముందుగా చర్చించటం ఏబీతో మంచిది. ఎందుకంటే వారు  నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా మార్గదర్శకాలను సూచిస్తారు. 

మొత్తం మీద ఈమధ్య కాలం లో ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్ల వల్ల లివర్ క్యాన్సర్ , బ్రెస్ట్ క్యాసెర్ వస్తుంది అని తెగ బయపెట్టేసారు.అయితే వాడాల్సిన పద్దతిలో వాడితే కచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పుకొచ్చింది. అయితే అత్యధికంగా వాడే అలవాటు ఉన్నవారు ఒక్కసారిగా తగ్గించేసినా ప్రమాదమే, అలాంటి వారు , రోజు ఎంత మోతాదులో స్వీటెనర్లను సేవిస్తున్నారో అంత మోతాదులోనే తీసుకోవచ్చు అని WHO సంస్థ చెప్పుకొచ్చింది.